హజియా సోఫియా మరియు బాబ్రీ మసీదు మధ్య భిన్నత్వం
హజియా సోఫియా తన అందచందాలతో ఏకంగా ప్రపంచాన్నే తనవైపు ఆకర్షించిందఅని అనుకోవడంలో ఎలాంటి సందేహంలేదు. కొన్ని రోజుల నుండి దీనిని పత్రికా శీర్షికలలో చూడడం విశేషం. అద్భుతమైన కట్టడం వివాదాస్పద విషయంగా మారడానికి గల కారణం తెలుసుకోవాలంటే ముందుగా దీని యొక్క చరిత్ర గురించి అవగాహన పెంచుకోవాలి.
క్రీ.శ. 537 బైజంటైన్ చక్రవర్తి జస్టిడియన్ ౹ ఆదేశాల మేరకు ఈ స్మారకచిహ్నం యొక్క నిర్మాణం జరిగినది. ఈ భవనం శతాబ్దాలుగా క్రైస్తవుల అధికారంలో ఉండేది. క్రీ.శ. 1453లో ఉస్మానియా చక్రవర్తి అయిన ముహమ్మద్ ౹౹ కాన్స్టాంటినోపుల్ (ఇప్పటి ఇస్తాంబుల్)ని జయించి మస్జిదు గా మార్చిదిద్దారు. నాటి హజియా సోఫియా ఇరుపక్కలా ఉండే మీనార్లు ఉస్మానియా చక్రవర్తులు కట్టిన నిర్మాణమే. 1935న ఆధునిక టర్కీ పితామహుడుగా పిలిపించబడే ముస్తఫా కమాల్ పాషా దీనిని లౌకికవాదం యొక్క చిహ్నంగా మస్జిదు నుండి మ్యూజియంకి మార్చారు.
తాజాగా 86 సంవత్సరాల తరువాత జూలై/10/2020 తేదీన టర్కీ కోర్టు మ్యూజియం యొక్క నిర్ణయాన్ని రద్దుచేస్తూ మరోసారి మస్జిదు గానే కొనసాగాలని ప్రకటించింది. టర్కీ అధ్యక్షుడు రజబ్ తయ్యిబ్ ఎర్దోగాన్ జులై/24/ శుక్రవారం నుంచి ముస్లింలు హజియా సోఫియాలో ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు మరియు ఈ భవనం ముస్లింలకు, ముస్లిమేతరులకు, విదేశీయులకు అందరికీ తెరిచి ఉంటుందని తెలియజేశారు.
ఈ మార్పిడి నేపథ్యంలో ప్రపంచంలో పలుచోట్ల దీనికి వ్యతిరేకంగా వివిధరకాల భావాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది హజియా సోఫియా తీర్పుని బాబ్రీ మసీదు తీర్పుతో పోల్చడం మొదలు పెట్టారు. ఒక చర్చి మసీదుగా మార్చగలిగితే, హిందూ మందిరంగా మారిన మస్జిదును కూడా భారత కోర్టు మరియు భారత ప్రభుత్వం ఆలయంగా మార్చవచ్చని ఈ వాదన ప్రతిపాదకులు వాదిస్తున్నారు. ఈ వాదన జనాన్ని తప్పు పట్టడం మరియు చరిత్రను తప్పుగా చదవడం వంటివి చేయడానికి మభ్యపెట్టడం తప్ప మరేమీ కాదు. ఓ సారి రెండు కేసుల ను నిజాయితీగా పరిశీలిస్తే వారి మధ్య ఉన్న తేడాలను సుస్పష్టంగా గమనించవచ్చు.
బాబ్రీ మస్జిదు: సంక్షిప్త సమాచారం
క్రీ.శ. 1528 అయోధ్య అనే గ్రామంలో ఆ నాటి మొగల్ చక్రవర్తి అయినటువంటి జహీరుద్దిన్ బాబర్ ఆదేశాల మేరకు మొగల్ సేన్యాధ్యక్షుడు మీర్ బాఖి బాబర్ పేరున బాబ్రీ మస్జిదును నిర్మించారు. దీని యొక్క సంక్షిప్త చరిత్ర మస్జిదులోని మిహ్రాబ్ పై చెక్కబడి ఉన్నది. డిసెంబర్/ 22/1949 వరకు ఈ మస్జిదులో ముస్లింల ప్రార్థనలు కొనసాగాయి. డిసెంబర్/23/ 1949వ రాత్రి భారతీయ ముస్లింలకు మరువ లేని రాత్రి. కొంతమంది హిందూ దుండగులు మస్జిదులోనీ మిహ్రాబ్ పక్కన రామ విగ్రహాన్ని పెట్టేశారు. మరుసటి ఉదయం మస్జిదులో రాముని యొక్క విగ్రహం వెలసిందని మరియు మస్జిదుని రామమందిరంగా మార్చవలసిన అవసరం వచ్చిందని పుకార్లు కొట్టడం మొదలుపెట్టారు.
ఈ వివాదం నగర కోర్టుకి చేరిన తరువాత వెంటనే ముస్లింలు మరియు హిందువులు బాబ్రీ మస్జిదును ప్రార్థనా స్థలంగా ఉపయోగించకూడదని కోర్టు ఆదేశించింది. జనవరి/26/ 1986న అయోధ్య నగర న్యాయస్థానం బాబ్రీ మస్జిదును కేవలం హిందూ భక్తుల ప్రార్థనల కొరకు అనుమతి ఇస్తూ మరియు ముస్లింలు ఈ మసీదు ఆవరణలో ప్రవేశించకూడదని తెలియజేయడం గమనార్హం. డిసెంబర్/06/1992న కాంగ్రెస్ పార్టీ పాలనలో బాబ్రీ మస్జిదును కూల్చివేశారు.
2010లో అలహాబాద్ హైకోర్టు బాబ్రీ మస్టిదు వివాదాస్పద భూమిని హిందువులు మరియు ముస్లింలు కొరకు రెండుగా విభజిస్తూ తీర్పు ఇచ్చింది. తీర్పు ఇస్తున్న సమయంలో ఈ ప్రదేశంలో మొదట రామ ఆలయం ఉండేదని కోర్టు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ముస్లింలు మరియు హిందువులు రెండు వర్గాలు ఈ కేసుని సుప్రీం కోర్టులో పెట్టారు. సుప్రీంకోర్టు 2011లో అలహాబాద్ హైకోర్టు తీర్పును వ్యతిరేకించింది. 2017లో సుప్రీం కోర్టు న్యాయస్థానం నుండి వివాదాన్ని పరిష్కరించడానికి లిటిగేన్ట్స్ ని సూచించిన ఎలాంటి ప్రయోజనం కనపడలేదు. మార్చి/08/ 2018 మరోసారి సుప్రీం కోర్టు ముస్లిం సుప్రీంకోర్టు జడ్జి ఎఫ్.ఎం ఇబ్రహీం ఖలీఫుల్లా నాయకత్వంలో ఓ మధ్యవర్తిత్వ గ్రూపుకి ఈ కేసు అందించడం జరిగినది. ఇది కూడా విఫలమైన అందువలన ఆఖరికి ఆగస్టు/02/2019 సుప్రీంకోర్టు ఈ వివాదాన్ని మరలా వినడం ప్రారంభించి, అక్టోబర్,/16/2019న కేసు వినడాన్ని ముగించింది.
తుది కోర్టు తీర్పు నవంబర్/ 09/2019న ఇవ్వడం జరిగిందీ. దీనిలో బాబ్రీ మస్జిదు స్థలం మొదట ఒక ఆలయం అని కోర్టు పేర్కొనకపోవడం విశేషం. సుప్రీం కోర్టు సునాయాసంగా హిందూ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ఏర్పడిన కమిటీకి వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని మరియు మస్జిదు నిర్మాణానికి ముస్లింలకు ఓ ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని తీర్పు జారిచేసింది. సుప్రీం కోర్టు బాబ్రీ మస్జిదు స్థలాన్ని హిందువులకు అప్పగించడానికి గల కారణాన్ని తీర్పులో పేర్కొనలేదు. అలాగే సుప్రీం కోర్టు వివాదాస్పద స్థలం మొదట మస్జిదు లేదా ఆలయం కాదా అనే విషయాన్ని పట్టించుకోకుండా ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించే కమిటీకి ఈ వివాదాస్పద భూమిని పూర్తిగా అప్పగించాలని ఏకపక్షంగా ప్రకటించింది.య
హజియా సోఫియా : సంక్షిప్తసమాచారం
బైజాంటైన్ చక్రవర్తి కాన్స్టాంటియస్ హజియా సోఫియా బసిలికా ను క్రీ.శ. 360లో నిర్మించారు. వివిధ తెగకు చెందిన క్రైస్తవులు ఇక్కడ ఆరాధించేవారు. క్రీ.శ.404న చక్రవర్తి అర్కాడియస్ పాలనలో రాజు కుటుంబంలో రాజకీయ భేదాల వలన దీనిని దుండగులు కాల్చివేశారు. తరువాత 10 సంవత్సరాల పాటు ఆ ప్రదేశంలో చర్చి లేదా కేథడ్రల్ అనే నిర్మాణమే జరగలేదు.
క్రీస్తుశకం బైజంటైన్ చక్రవర్తి థియోడోసియస్ ౹౹ మరోసారి హజియా సోఫియాను నిర్మించారు. క్రీ.శ.531 చక్రవర్తి జస్టీనియన్ (క్రీస్తుశకం 527-565) పాలనలో మరోసారి ఈ భవనాన్ని కాల్చివేశారు. క్రీ.శ. 537లో చక్రవర్తి జస్టీనియన్ ౹౹ హజియా సోఫియాని గ్రీక్ఆర్థడాక్స్ చర్చిగా మరోసారి నిర్మించారు. ఈ నిర్మాణం 1453 వరకు 921 సంవత్సరాల పాటు చర్చిలాగా అలానే కొనసాగింది.
క్రీ.శ.1453లో ఉస్మానియా చక్రవర్తి సుల్తాన్ ముహమ్మద్ ౹౹ కాన్స్టాంటినోపల్ (ఇప్పటి ఇస్తాంబుల్)ని జయించిన వెంటనే మస్జిదుగా మార్చారని చరిత్రకారులు పేర్కొన్నారు. ఇది ఋణానుసరాలు మరియు సందర్భానుసార సాక్ష్యాలులేని దావా. సుల్తాన్ ముహమ్మద్ అల్-ఫాతిహ్ హజియా సోఫియాలో వెళ్లి క్రైస్తవుల భూమిపై విజయం సాధించిన ఆనంద సందర్భం తెలుపు కొనుటకు తన సైనికుల నుండి ఎవరినైనా అజాన్ ఇవ్వమని కోరిన విషయం వాస్తవమే. హజియా సోఫియా కేవలం క్రైస్తవుల ప్రార్థనలు చేసే స్థలం కాదు, బైజంటైన్ చక్రవర్తుల పెట్టుబడికి కూడా ఇదే స్థలం. హజియా సోఫియా భవనంలో ఎగువ భాగాన్ని ప్రత్యేకంగా రాజా కుటుంబాలు ఉపయోగించడం జరుగుతుంది మరియు తొమ్మిదవ ద్వారం నుండి ప్రవేశించడం కూడా శతాబ్దాలుగా అంతటి చక్రవర్తులు మరియు వారి కుటుంబాలకే ప్రత్యేకంగా పరిమితం. ముహమ్మద్ అల్ ఫాతిహ్ కాన్స్టాంటినోపుల్ ని జయించిన తరువాత చాలా మంది ప్రజలు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోయారు. మతగురువులు కూడా వలసవెళ్లడం ద్వారా ఆ ప్రదేశం ఎడారిగా మారిపోయింది. వారి జీవితాలపై భయంతో వదిలి వెళ్ళిన ప్రజలను పొరుగు పట్టణాల నుండి మరియు గ్రామాల నుండి వారి జీవితం, ఆస్తి మరియు గౌరవానికి ఎలాంటి అపాయము ఉండదని మరియు రక్షింపబడునని హామీ ఇచ్చి ప్రజలును మరలా ఆ ప్రదేశా నికి తిరిగి వచ్చేలా చేశారు ముహమ్మద్ అల్-ఫాతిహ్.
ఈ నేపథ్యం లోనే సుల్తాన్ ముహమ్మద్ అల్ ఫాతిహ్ హజియా సోఫియా మరియు దానికి ఆనుకుని ఉన్న భూములను తన స్వంతధనం నుండి కొనుగోలు చేశారు. మతగురువులు నుండి చట్టబద్ధంగా కొన్నతర్వాత వెంటనే దానిని దానముగా ప్రకటింపచేశారు. టర్కీ దేశ వక్ఫ్ ఫొండేషన్ కింద సంరక్షించబడిన ఒక పత్రం ఉంది ఇది సుల్తాన్ ముహమ్మద్ విరాళం ఇచ్చిన వక్ఫ్ ఆస్తి హజియా సోఫియా మస్టిదు అని రుజువు చేస్తుంది. క్రీ.శ. 1934లో ముస్తఫా కమాల్ పాషా దీనిని మ్యూజియంగా తీర్చిదిద్దారు.
బాబ్రీ మస్జిదు మరియు హజియా సోఫియా కేసుల మధ్య తేడా :
చారిత్రక దృష్టికోణాల నుండి గమనిస్తే రెండు కేసులకు ఎటువంటి సంబంధం లేదు.
1992లో బాబ్రీ మస్జిదును కూల్చినంత వరకు అది మస్జిదే, మస్జిదుకు ముందు ఒక ఆలయం ఉండేదని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఎవరి దగ్గర లేవు. సుప్రీం కోర్టు హిందూ సంస్థల నుండి వచ్చే సామాజిక- రాజకీయ ఒత్తిడి కారణంగా ప్రభుత్వానికి వివాదాస్పద స్థలంలో ఆలయం నిర్మించమని మరియు మస్టిదుకు ఓ ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయమని ఆదేశం జారీ చేసింది.
ఇప్పుడు హజియా సోఫియా విషయానికి వస్తే మొదటగా ఇది చర్చిగా ఉండేది, ఉస్మానియా చక్రవర్తి సుల్తాన్ ముహమ్మద్ అల్-ఫాతిహ్ తన సొంత ధనంతో మతగురువుల దగ్గర దీనిని కొనుగోలు చేసి దానముగా క్రీ.శ. 1462లో ప్రకటించారు. ఆ దాన పత్రము ఇప్పటికీ టర్కీ వక్ఫ్ ఫొండేషన్ దగ్గర సురక్షితంగా ఉంది.
భారత సుప్రీం కోర్టు హజియా సోఫియా కేసుని నిర్ణయిస్తే, ఇలా నిర్ణయం తీసుకొని ఉండేదేమో:
హజియా సోఫియాపై భారతీయ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్నట్లు అయితే బాబ్రీ మస్జిదుపై ఎలాంటి సొంత చారిత్రాత్మక తీర్పును తీసుకుని ఉందో అలాంటి తీర్పునే హజియా సోఫియా పై కూడా ప్రస్తావించి ఉండేది. ఎందుకంటే బైజాంటైన్ చక్రవర్తి జస్టినయన్ ౹ హజియా సోఫియా ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చిగా నిర్మించారు. అయితే ఈస్టర్న్ ఆర్థడాక్స్ తన ఏకపక్షంగా ఉండే స్వాధీనాన్ని నిరూపించ లేక పోయింది ఎందుకంటే క్రీ.శ.1204 నుండి 1261 వరకు ఇది రోమన్ కేథడరల్గా ఉపయోగించబడింది.
బాబ్రీ మస్జిదు కేసులో ముస్లిం అర్జీదారులు బాబరే మస్జిదును నిర్మించాడని ఎటువంటి ఆధార పత్రాన్ని ప్రవేశించ లేదు. కానీ, హజియా సోఫియా విషయంలో అలా కాదు. సుల్తాన్ ముహమ్మద్ అల్-ఫాతిహ్ దానము (వక్ఫ్)గా ఇచ్చిన పత్రం ఇప్పటికీ టర్కీ వక్ఫ్ ఫౌండేషన్ దగ్గర సురక్షితంగా ఉంది. ఒకసారి భగవంతునికి అంకితమై ఉన్న ఆస్తి అగమ్యగోచరంగా మారదన్నది భారతీయ చట్టం స్పష్టం.