ముహర్రం మరియు ఉమర్ రౙియల్లాహు అన్హు

ముహర్రం మాసం సకల సౌభాగ్యాలతో 1444 కొత్త సంవత్సర ఆగమనాన్ని కానుకగా తీసుకురావడంలో ఎలాంటి సందేహం లేదు. ముహర్రం మాసం చారిత్రక నేపథ్యంగా మరియు ఇస్లాం పరంగా ఎనలేని ప్రత్యేకతలతో కూడి ఉన్నది. విచారకరమైన మరియు బాధాకరమైన విషయం ఏమనగా ఇన్ని అగణ్యమైన విశిష్టల తో నిండి ఉన్న ఈ మొదట మాసాన్ని ప్రజలు కేవలం హుస్సేన్ (రజియల్లాహు అన్హు) యొక్క వీరమరణం సంఘటనతో పరిమితం చేస్తారు. ప్రజలు హుస్సేన్ (రజియల్లాహు అన్హు) యొక్క పేరుతో ప్రారంభిస్తూ ఆయన పేరుతోనే ఈ మాసాన్ని ముగిస్తారు. మసీదులోని ఖుత్బాలు ప్రసంగించే వాళ్ళ ప్రసంగాలలో కేవలం కర్బలా సంఘటన చుట్టూ తిరుగుతుంది అనడంలో ఎలాంటి సంకోచం లేదు. అయితే ఈ నెల కేవలం కర్బలా మరియు హుస్సేన్ (రజియల్లాహు అన్హు) కు పరిమితం కాదు, లెక్కలేనన్ని చారిత్రక సంఘటనలు ఈ నెలలో చోటు చేసుకున్నాయి. అందులో ఈ హిజ్రీ క్యాలెండర్ ఆవిష్కర్త మరియు రెండో ఖలీఫా ఉమర్ (రజియల్లాహు అన్హు) మరువలేనిది. ఓ మచ్చలేని నాయకుడుని కోల్పోవడం యావత్తు ఇస్లామిక్ ప్రపంచానికి చాలా పెద్ద లోటు. ఈ నిర్మలమైన వ్యక్తిత్వం గురించి ఆ మహానీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు: 

جعل الله الحق على لسان عمر

"ఉమర్ రజి అల్లాహ్ మాటను అల్లాహ్ హక్కు వాక్కుగా విధించాడు"

لو كان بعدي نبي لكان عمر

"నా తర్వాత ప్రవక్త ఎవరైనా ఉన్నట్లయితే అది ఉమర్ మాత్రమే."

పరదాపై నియమం, ముఖాము ఇబ్రహీం వద్ద నమాజ్ చదవడం మొదలైనవి ఖలీఫా ఉమర్ రజియల్లహుఅన్హు కోరిక మేరకు వెళ్లడయ్యాయి. దైవచింతన మరియు అతీత వినయము గల వ్యక్తిత్వం ఆయనది. రెండు లక్షల చదరపు మైళ్ళకు పైగా ఆయన స్వాధీనంలో ఉన్నప్పటికీ బహిరంగ ప్రదేశంలో నిండు ఆకాశం కింద ఇటుక దిండుతో నేలపైన నిద్రించేవారు. ఈయన పాలన ఇతర పరిపాలకులకు నిదర్శనం మరియు మార్గం. పోలీసు తపాలా వ్యవసాయ శాఖలను మొట్టమొదట స్థాపించింది ఈయనే. తరావీజమాత్ ను ప్రారంభించి ఉమ్మత్ పై చేసిన మేలు మరువలేనిది. బలహీనులు నిరుపేదలందరికీ వివక్ష లేకుండా ఆదుకున్న వ్యక్తిత్వం ఈయనది. కానీ ఎటువంటి న్యాయమైన ఖలీఫా తన రాజధాని లోనే ఓ ఫిరోజ్ అబులులూ అనే మజూసి బానిస చేత అమరుడయ్యాడు.

ఆ క్రూర హంతకుడు 23 హిజ్రీ దుల్ హిజ్జాన ఫజ్ర్ నమాజులో విషం పూసిన కత్తితో మసీదులోకి ప్రవేశించి ఉమర్ (రజియల్లాహు అన్హు) నమాజు చదివిస్తున్న సమయంలో ఆరుసార్లు అతికిరాతకంగా పొడిచి పేగులు కోశాడు. దీనికి హజ్రత్ ఉమర్ (రజియల్లాహు అన్హు) మంచ పాలయ్యారు. ఏదైనా తినిపిస్తే అది గాయ మార్గం నుండి బయటకు వచ్చేది. ఈ స్థితిలో హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు నొప్పితో చాలా బాధపడుతూ ఎనిమిది రోజుల తర్వాత ఈ బాధలోనే ముహర్రం ఒకటిన తుది శ్వాస విడిచారు.‌ హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు జనాజా నమాజ్ హజ్రత్ సుహైబ్ రజియల్లాహు అన్హు నేతృత్వంలో జరిగింది. మహానీయ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు హజ్రత్ సిద్దిఖ్ అబూబక్ర్ రజియల్లాహు అన్హు లతో పాటు ఆయిషా రజియల్లాహు అన్హా గదిలో భు‌స్థాపితం చేయబడింది.

కానీ అల్లాహ్ యొక్క అత్యున్నత వాక్యం కొరకు తన కాలంలోని అగ్రరాజ్యాలైన కిస్రా మరియు ఖైసర్‌లను ఓడించి ఇస్లాం మతం గౌరవాన్ని పెంచి, అవిశ్వాసానికి భయపడేటట్టుగా చేసి, ఆ అగ్ర నాయకుడ త్యాగాలను ఈ నాటి ప్రజల మరచిపోవడం చాలా విచారకరం.‌అల్లాహ్ తఆలా అయినను ఆశీర్వదించి శాంతిని ప్రసాదించుగాక. 

ఆమీన్.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter