దోమ గాథ

నన్ను తెలియనివారు ఈలోకంలో ఎవ్వరూ ఉండరు. నన్ను ఈ లోకంలో మరిచిన వారు ఎవ్వరూ ఉండరు. నేను మీకు ప్రతి రోజు కనిపిస్తాను. మీ చెవులకు కూడా నేను వినిపిస్తాను. నాకు ధర్మం, మతం తెలియదు నేను అందరిని ఆక్రమించుకుంటాను. ఈ చిన్న శరీరం తప్పేమి చేసిందని కొంచెం ఆకలి తీర్చే సమయాన నన్ను పట్టుకోని చిత్ర హింసలు పెడుతు నా తల భాగంగా నా చేతులు ఇంకో భాగంగా నన్ను విడదీస్తూ నాతో ఆడుకుంటూ చిన్న పిల్లల బొమ్మగా నన్ను మార్చేశారు. ననూ కొట్టడం, ఆడడం వరకు కాకుండా నన్ను తిడుతారు కూడ. ఇదేక్కడి న్యాయమో మరియు ఏ పురాణాల్లో రాసి ఉందో అర్థం కావట్లేదు. ఇంత జరిగాక నేనెవ్వరో తెలియక పోతే మీరు మహానుభావులో లేదా మేధావులో భావించడం కష్టంగా ఉంది. గుర్తించుకోండి నేనే మి స్నేహశత్రువు  దోమరాజు, నాతో పెట్టుకోకండి ఏ రోజు.

మీకు తెలిసిన విషయం ఏమిటంటే ఒక చిన్న శరీరం ఎంత పని చేయగలిగిందో నా నోట నుండి వినే ముందు సృష్టికర్త అయిన అల్లాహ్ తో  పోరాడిన నమ్రూద్ ని హతమార్చడానికి నన్ను ఎందుకు ఎంచుకున్నారు? నా కన్నా ఈ లోకంలో ఎన్నో జీవరాసులు మరియు ఎంతో బలమైన జీవులు అతనిని హతమార్చగలరు. కాకపోతే అల్లాహ్ మనకి సందేశంగా ఒక చిన్న కీటకం ఏమి చేయగలదో అని నన్ను  ఎంచుకొని ఆ దుర్మార్గుడిని హతమార్చి నా యొక్క విలువ పెంచాడు. అలాంటి కీటకాన్ని నేను మీకు గుర్తు కాలేను, ఎందుకంటే మీరందురు చరిత్ర సంఘటనలతో పరచియం కాలేరు. ఎందుకంటే మీరందురు ఇప్పుడు జరిగే విషయాలని గుర్తించలేకపోతున్నారు మరి చారిత్రక విషయాలు దృష్టికి వస్తే అది మీకు అసాధ్యం అవుతుంది.

ప్రజలు చాలా మంచివాళ్ళు జంతువులను ప్రేమగా మరియు జంతువుల, పక్షుల, కీటకాలపై జాలి  చూపిస్తారు అన్నమాట తప్పు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను చిన్న శరీరంతో జీవించే ఓ జీవిని నాకు బతకాలన్న ఆశ ఉంటుంది. నాకు మీలాగా రెండు కాళ్ళు రెండు చెవులు అన్నీ అవయవాలు ఉన్నాయి. కాకపోతే నేను మీ కన్నా నివసించే స్థానంలో వేరుగా ఉన్నాను. నా తినే ఆహారం వేరు, నేను ఉండే లోకం వేరు. కానీ నా యొక్క ఆలోచన మరియు గుండె మిలాగే పనిచేస్తుంది ఇంకా కొట్టుకుంటుంది కూడా. నాలో ఉన్న బాధని మీకు చెప్పుకోలేను అలాగే మా బంధువులకు కూడా చెప్పలేను ఎందుకంటే వాళ్ల పరిస్థితి కూడా నా పరిస్థితే గా అందుకని!

 ఒకసారి నేను దారిలో వెళుతుండగా ఒక జట్టు మాట్లాడుకుంటూ విన్నాను. (నాకు తెలియని విషయం ఏమనగా ఈ దోమలు ఎక్కడ పుడతాయి? మమ్మల్నే ఎందుకు కుడుతాయి? ఈ భూమిలో ఎన్నో చెట్లు మరియు పొదలు ఉన్నాయి వాటిని కుట్టకుండా మనల్నే ఎందుకు గురిపెడతాయిరా నాయనో అర్తం కావాట్ల! ఇది కుట్టినాక ఎన్నో రోగాలు వస్తాయట అది మలేరియానో కలెరియానో తెలీదురా బాబు! మమ్మల్ని రక్షించే వాడు ఎవడు లేడా!) ఇది విన్న తరువాత నా మనసుకు కొంత బాధగా అనిపించింది. నా చెవిలో కొంత దురద పుట్టింది. నా కళ్ళు నమ్మలేక పోయాయి. నా చెవులు వినలేక పొయాయి . అరే ఏంట్రా ఇది ఇన్ని ప్రశ్నలు ఒకే సారి గోదావరి నీళ్ళు నాపై పడేలా అనిపించింది. అలాగే అతని మాటల్లో మొట్టమొదటి మాట ఏమంటే:

“దోమలు ఎక్కడ పుడుతాయి”?మమ్మల్నె ఎందుకు కుడుతాయి? ఈ భూమిలో ఎన్నో చెట్లు మరియు పొదలు ఉన్నాయి వాటిని కుట్టకుండా మనల్నే ఎందుకు గురిపెడతాయి?

సమాధానం: సృష్టికర్త అయిన అల్లాహ్ నన్ను మురికి కాలువలో లేదా పనికిరాని స్థలాలో సృష్టించాడు. అప్పటికి మీ మానవులను అల్లాహ్ ఓ మంచి చోటలో సృష్టించి మీకు అన్నీ విషయాలలో బాగా చూశాడు. అలాంటి కీటకమైన కూడా మీకు జాలి, దయ కలగలేదంటే నాదగ్గర మీకు చెప్పడానికి అక్షరాలు లేవు ఎందుకంటే! నేను మీలాగా మేధావిని కాను. నాకు మా అమ్మ, నాన్న చదివించలేదు. ఎందుకంటే నేను మీకు చెప్పగా మా జీవితాలు వేరు మాకు కుట్టడం తప్ప సంపాదించడం తెలియదు అందుకని.

అలాగే మా కుట్టడం విషయానికి వస్తే మనషుల తప్పవేరే ఎవ్వరిని ఎందుకు కుట్టము? ఈ ప్రశ్న అడిగినవాడు పిచ్చోడా లేక మహనుభావుడా అర్తం కాలేదు. ఎందుకంటే, సృష్టికర్త అల్లాహ్ అయిన  మీ అందరికీ తినడానికి ఎన్నో పదార్థాలు మరియు ఆహారాలు ఇచ్చాడు. మా దోమల జాతికి  మించి మీకు ప్రేమని ఇచ్చాడు. అయిన మేము పుట్టుకతోనే రక్తాన్ని త్రాగుతూ బతుకుతున్నాము. మా యొక్క ఆహారం కూడా ఇదే కానీ మీకు అది అర్థం కావట్లేదు. అందుకే మీరు మమ్మల్ని ఇలా హింసిస్తారు తరువాత తిడుతారు. ఇదెక్కడి న్యాయమో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ జీవితం మనది కాదు. ఇది అల్లాహ్ ఇచ్చిన ఓ కానుక! అది మీకు కూడా ఉంది. నాకు కూడా ఉంది. ఇంకో విషయం ఏమనగా మేము మానవులను ఎందుకు కుడతామంటే మాకు మానవుల మీదే ప్రేమ ఎక్కువ! అది మానవులకి అర్థం కావటం లేదు. మేము మానవులలో ప్రేమ వెతుకుతాము. ఎలా అంటే? మేము కుట్టిన తరువాత మమ్మల్ని కొట్టకుండా, తిట్టకుండా ఉండే వాల్లే మా ప్రేమికులు. వాళ్ళను మేము ఇంకో సారి కుట్టము, దీన్ని తిరస్కరించే వాళ్ళే మా శత్రువులు. మేము లేదా మా బంధువులు వాళ్ళని వదలరు. ఇది మాకు తప్ప మానవులకి అర్థంకాదు.

   (ఇది కుట్టినాక ఎన్నో రోగాలు వస్తాయట అది మలేరియానో కలెరియానో తెలీదు! మమ్మల్ని రక్షించే వాడు ఎవడు లేడా!) ఇది విన్న మాకు చాలా కోపం వచ్చింది దీని యొక్క సమాధానం ఏమనగా:

 ప్రజలుకు చాలా బాగా తెలుసు ఆరోగ్యం గురించి కాకపోతే ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు చాలా పోస్టర్లు చూస్తారు “ప్రొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం, మద్యపానం సేవించటం కూడా మీ జీవితానకి చాలా నష్టం” ఇది విన్న వాళ్ళు, చూసిన వాళ్ళు పట్టించూకొకపోతే ఇప్పుడు మా వాళ్ళు  కూడా ఇంతే! మీకు అనారోగ్యాలు ఇస్తూ ఉంటారు. మేము మీ గురించి ఆలోచించము, మీ బతుకు మీరే చావండి. అలాగే కాపాడే విషయానికి వస్తే ఆ దేవుడు కూడా ఏమి చేయలేడు ఎందుకంటే ఇది అతని నిర్ణయమే కాబట్టి. మాజీవితాలు ఇలాగే ఉంటాయి. మేము రక్తం తప్ప మీతో ఏమి ఆశించము. మాతో విముక్తి పొందాలని ఎన్నో వస్తువులు మాకోసం చంపటానికి తెస్తారు. ఆల్అవుట్ ఇంకా ఏవేవో పరికరాలను తెస్తారు. మేము చెప్పేది ఏమిటంటే మమ్మల్ని మీరు తరిమి కొడితే చాలు మేము మా దారిన వెళ్లిపోతాము. లేకపోతే వేరే షికారిని ఎంచకూంటాము. అంతే కానీ చంపటం, ఆటలాడుకోవటం చేయకండి మీకు చాలా ప్రమాదాన్ని తెప్పిస్తాము.  

                       కలిసి ఉందాము, కలిసి బతుకుదాము, కలిసి మరణిద్దాము. ఇదే మా దోమల బృందం  యొక్క చిన్న సందేశం. అలాగే ఒకర్ని కొట్టి ద్వేషం సృష్టించే బదులు వాళ్ళని క్షమించి లేదా తరిమిగొట్టి ఆ ద్వేషాన్ని సృష్టించే బదులు మర్యాద పుడుతుంది.

(అన్నీ దోమలకు నా తరపున దోమల దినోత్సవ శుభకాంక్షులు ) 

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter