సువర్ణ అవకాశం చేజారి పోతుంది
రంజాన్ మాసం శుభాలతో నిండినది. ఈ మాసం కోసం ప్రతి ముస్లిం తన జీవితంలో ప్రతి సంవత్సరం ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ శుభ సమయాన రంజాన్ వచ్చిందని స్వాగతం పలుకుతూనే ఈ రంజాన్ యొక్క మొదటి దశకం పూర్తయిపోయింది. రమదాన్ మూడు దశకాల కూర్పు. మొదటిది రహమత్ (కరుణ) రెండవది మగ్ఫిరత్ (మన్నింపు) మూడవది నరక నుంచి విముక్తి. సంవత్సరంలో 12 నెలలలో ఒక మనిషి 11 నెలలు అంతా పాపాలు చేస్తూనే జీవిస్తాడు. ఆ పాపాల మన్నింపుకై రంజాన్ మాసం ఈ విధంగా మూడు దశకాలలో విభజించబడింది. చూస్తూ చూస్తూనే మొదటి దశకం పూర్తి అయిపోయింది. ఈ రెండవ దశకం యొక్క సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనివారు ఎంత నిర్భాగ్య పరిస్ధితిలో ఉన్నాడో చింతించాల్సిన అవసరం చాలా ఉంది.
ఉపవాసం ఉండడం అంటే తెల్లవారి జామున నుండి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలను దేహేచ్చాలను విడవడం మాత్రమే కాదు. అసలైన ఉపవాసి అంటే తన యొక్క పూర్తి దేహంతో, జ్ఞానేంద్రియాలతో చెడు నుంచి కీడు నుంచి బూతుల నుంచి దూరంగా ఉండటం. అల్లాహ్ యొక్క ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు
من لم يدع قول الزور والعمل به والجهل فليس لله حاجة أن يدع طعامه وشرابه ( رواه البخاري)
ఎవరైనా ఉపవాసం ఉండి కూడా అబద్ధాలు చెప్పడం، వాటిని అమలు చేయడం، అజ్ఞానాన్ని వదులుకోకపోతే ఆ వ్యక్తి అన్న పానీయాన్ని వదిలిపెట్టడం వల్ల అల్లాహ్ కు ఎటువంటి అవసరం లేదు (బుఖారీ ఉల్లేఖనం)
అయితే ఉపవాసం కళ్ళతో చెవులతో నాలుకతో చేతులతో కాళ్లతో అంగాలతో కడుపుతో అంతా ఉపవాసం పెట్టాలి. కళ్ళతో అనగా అశ్లీలాన్నీ చూడకూడదు, చెవులతో పాటలు వినడం బూతులు వినడం వదులుకోవాలి, నాలుకతో అనగా బూతులు చెప్పడం ఇతరులను నాలుకతో బాధపెట్టడం తిట్టడం మొదలగు నుండి దూరం అవ్వాలి, చేతులతో అనగా ఎవరికి హాని కలిగించకూడదు బాధ పెట్టకూడదు, కాళ్లతోనగా ఏ ఒక్క కీడు పనిని ఉద్దేశించి దాని వైపు ముందుకు పోకూడదు, కడుపుతో అనగా తినే ఆహారం హలాల లేకపోతే హరమా అని ఆలోచించి కడుపులో వెళ్లే ఆహారం హలాలై ఉండాలి హారం కాకూడదు.
ఇప్పుడు ఇంకా రంజాన్ నెల యొక్క రెండు దశకాలు మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా నమాజులు చేస్తూ, ఇతరులకు దానధర్మాలు ఇస్తూ, ఖురాన్ పారాయణం చేస్తూ అల్లాహ్ తో దువా చేస్తూ గడపడానికి శాయాశక్తుల ప్రయత్నించాలి. ఈ రంజాన్ మాసంలో ఖురాన్ పారాయణం మరియు ఉపవాసం చేయడం ద్వారా దాని ప్రయోజనం వివరిస్తూ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఇలా తెలియజేశారు:
الصيام والقران يشفعان للعبد يقول صيام: أي رب اني منعته الطعام الشهوات بالنهار فشفعني فيه ويقول القرآن: منعته النوم بالليل فشفعني فيه فيشفعان
ఉపవాసం మరియు ఖురాన్ అల్లాహ్ దాసుడికై సిఫార్సు చేస్తాయి. ఉపవాసం ఇలా అంటుంది: ఓహ్ అల్లాహ్! నావల్ల ఇతను ఆహారాన్ని దేహేచ్చలను వదులుకున్నాడు. తనకై నా సిఫార్సు నువ్వు స్వీకరించు. ఖురాన్ ఇలా అంటుంది: నాకోసం తాను రాత్రి నిద్రలను వదులుకున్నాడు. తనకైనా స్వీకరించు!. ఇద్దరి సిఫార్సులు స్వీకరించబడతాయి.
రంజాన్ గురించి అల్లాహ్ కొద్ది రోజులు (أياما معدودات) మాత్రమే అని పేర్కొన్నారు. ఈ కొద్ది రోజుల విలువ ఇప్పుడు ఎక్కువమందికి తెలియకపోవచ్చు. చూస్తూ చూస్తూ మిగిలిన రెండు దశకాలు కూడా మొదటి దశకంగా పూర్తయిపోతాయి. కానీ ఈ నెలలో ఎవరైతే మిగిలిన ఘడియలను సద్వినియోగం చేసుకుంటూ అల్లాహ్ సమీపాన్ని కోరుకుంటాడో అతనే మహోన్నతుడు గొప్పవాడు.
అందువలన ఖురాన్ పారాయణం, పాపాల మోక్షం కోసం అల్లాహ్ తో ప్రార్థన ఎక్కువగా చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ రెండవ దశకంలో ఈ దువా పఠించడం ఎక్కువగా పాటించాలి:
اللهم اغفؤ لي ذنوبي يا رب العالمين
(అల్లహుమ్మ ఇగ్ఫిర్ లీ జునూబీ యా రబ్బల్ ఆలమీన్)
ఓహ్ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్! నా పాపాలను మన్నించు.