రమదాన్ మాసం యొక్క ప్రత్యేక పుణ్య ఫల ప్రార్థన: ఇతికాఫ్

రంజాన్ మాసం ఎంత శుభప్రద మాసమో యావత్ ముస్లిం సమూహానికి తెలిసిన విషయమే. ఈ మాసం మూడు భాగాలకు విభజించబడింది.

మొదటి దశకం: కారుణ్య దశకం

రెండవ దశకం: మన్నింపు దశకం

మూడవ దశకం: నరకం నుండి విముక్తి దశకం.

ఇప్పటికే రంజాన్ యొక్క రెండు దశకాలు పూర్తి కావస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఎన్ని మంచి పనులు, ఎన్ని చెడ్డ పనులు చేసాం అనేదానిపై ఎంతో మంది ఆలోచించడం లేదు. ఈ శుభ సువర్ణ అవకాశం చేజారి పోతుందని తెలిసిన కూడా మంచి కార్యాలకు చేపట్టకుండా జీవితం గడిచిపోతుంది. అల్లాహ్ సుబహానహు వతఆలా మనిషిపై ఉపవాసం విధిగా నిర్ణయించడానికి ఎన్నో రహస్యాలు దాగున్నాయి. అలాగే మనిషి శారీరకంగా, మానసికంగా కూడా శుద్ధి అవ్వాలి. నవ ఉత్తేజ రూపంలోకి మారాలి అనే ఉద్దేశంతో ఇతర ఆరాధనలు కూడా ఇందులో సాంప్రదాయంగా నిర్ణయించాడు. అందులో ఒకటి ఇతికాఫ్. అనగా మస్జిదులో అల్లాహ్ యొక్క సమీపాన్ని కోరుకుంటూ తరచుగా ఉండడం.

فعنِ ابنِ عُمَرَ رَضِي اللَّه عَنْهُما، قالَ: كانَ رسولُ اللَّهِ ﷺ يَعتَكِفُ العَشْرَ الأَوَاخِرَ مِنْ رَمَضَانَ. متفقٌ عَلَيْهِ.

ఇబ్ను ఉమర్ రదియల్లాహు అంహు కథనం: ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం రమదాన్ లోని చివరి దశకంలో ఇతికాఫ్ పాటించేవారు.

ఈ ఇతికాఫ్ 3 రకాలు:

1. వాజిబ్ (తప్పనిసరి)

2. సున్నత్ ముఅక్కదా (సామూహిక సాంప్రదాయ ఆచరణ)

3. నఫిల్ (ఆదనంగా చేసేది)

 మొదటిది నోము వంటిది ఏదైనా పని సక్రమంగా పూర్తి అయిపోతే నేను అల్లాహ్ కోసం ఇతికాఫ్ పాటిస్తాను అని సంకల్పం చేసుకొని ఆ పని పూర్తి అయిన తర్వాత మసీదులో ఎన్ని రోజులు కేటాయిస్తే అన్ని రోజులు ఇతికాఫ్ పాటించాలి.

రెండవది సున్నత్ ముఅక్కదా. మూడవ దర్శకం చివరి 10 రోజులు అల్లాహ్ సమ్మితిని కోరుకుంటూ ఆరాధన చేసుకుంటూ రాత్రి పగలు మసీదులోనే ఉండటం.

మూడవది అదనంగా పాటించడం. దీనికంటూ ప్రత్యేక సమయం లేదు ఎప్పుడైనా మసీదులో ప్రవేశించినప్పుడు ఏతికాఫ్ సంకల్పం చేసుకుంటే చాలు. అది ఒక నిమిషమైనా ఒక గంటైనా ఒక రోజైనా ఒక జీవితమైన.

కానీ ఇక్కడ సముచితమైన ఇతికాఫ్ రెండవ రకం. అంటే రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటూ అల్లాహ్ సమ్మితి కోరుకుంటూ మసీదులోనే పది రోజులపాటు తరచుగా గడపటం. రమదాన్ మాసంలో ఇతికాఫ్ పాటించడంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి: మొదటగా ఇతికాఫ్ తోపాటు ఉపవాసం కూడా పాటించడం నిర్బంధం. రంజాన్ లో ముందుగానే ఉపవాసం ఉండడం తప్పనిసరి. దానితోపాటు మసీదులో ఇతికాఫ్ పాటించటం ఆ ప్రార్ధనలో తాకీదు చేస్తుంది. రెండవది అల్లాహ్ సుబహానాహు వతఆల ఇతికాఫ్ రంజాన్ లోనే కేటాయించడంలో ఇంకొక రహస్యం ఉంది. అది ఏమనగా ఈ చివరి పది రోజులలో ఏదో ఒక రాత్రి లైలతుల్ ఖదర్ ఉండే అవకాశం ఉంది. అయితే పది రోజులు నిరంతరంగా మసీదులో ఉంటే తప్పకుండా ఏదో ఒక రాత్రి లైలతుల్ ఖదర్ దొరికుతుంది. ఆ ఒక్క రాత్రి వెయ్యి నెలల రాత్రి కంటే చాలా గొప్పది హదీసులో ఇలా ప్రవచించబడింది:

من قام ليلة القدر إيماناً واحتساباً غفر له ما تقدم من ذنبه ) – متفق عليه

ఎవరైతే లైలాతుల్ ఖదర్ (ఘన రేయి)న విశ్వాసంతో పుణ్యఫలాపేక్షంతో గడుపుతాడో అతని యొక్క గతంలో జరిగిన పాపాలన్నీ మన్నింపబడతాయి.

ఇతికాఫ్ యొక్క ప్రయోజనాలు:

అల్లా సుబహానాహు వతలా మనిషికి ఆదేశించిన ప్రార్థనలన్నిటిలో ఏదో ఒక రహస్యం దాగి ఉంటుంది. ఈ ప్రార్థనలన్నీ మనిషి యొక్క హృదయంతో కూడి ఉంటాయి. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఎలా బోధించారు:

ألا وإن في الجسد مضغة إذا صلحت صلح الجسد كله، وإذا فسدت فسد الجسد كله، ألا وهي القلب

ఖబర్దార్! ప్రతి శరీరంలో ఒక అవయవం ఉంటుంది. అది బాగుపడితే, పూర్తి శరీరం బాగుపడుతుంది. అది పాడైపోతే పూర్తి శరీరం పాడైపోతుంది. ఆ అవయవం హృదయం.

ఆహారం, పానీయాలు, వివాహం, అతిగా మాట్లాడటం, అధిక నిద్ర మరియు హృదయ వ్యవహారాలను విభజించి దాని ఏకాభిప్రాయాన్ని పాడుచేసే ఇతర పరధ్యానాల వంటి కోరికలు, హృదయాన్ని పాడుచేసే వాటిలో చాలా వరకు ఉన్నాయి. కాబట్టి అల్లాహ్ హృదయాన్ని రక్షించే నైవేద్యాలను సూచించాడు. ఉదాహరణకు, ఉపవాసం. అది ఒక వ్యక్తిని తినడం, త్రాగడం మరియు పగటిపూట లైంగిక సంపర్కం నుండి నిరోధిస్తుంది. ఈ ఆనందాల యొక్క దుబారా నుండి దూరంగా ఉండటం హృదయంలో ప్రతిబింబిస్తుంది, తద్వారా అది దేవుని వైపుకు వెళ్ళే మార్గంలో బలంగా మారుతుంది. అలాగే ఒక వ్యక్తిని పరలోకం నుండి ఇహలోకానికి దూరం చేసే కోరికల సంకెళ్ళ నుండి విముక్తి చేస్తుంది. ఉపవాసం హృదయానికి కవచం అయినట్లే, నిరుపయోగమైన ఆహారం, పానీయం మరియు శారీరక కామపు పరధ్యానం యొక్క పరిణామాల నుండి దానిని కాపాడుతుంది. అలాగే ఇతికాఫ్‌లో ఒక గొప్ప రహస్యం ఉంది. ఇది అల్లాహ్ దాసులకు ఇతర విషయాలపై శ్రద్ధ వహించే ప్రభావాల నుండి కాపాడుతుంది. అల్లాహ్ కోసం, పుణ్య ఫలా పెక్షతో నిలబడడం, ఖురాన్ చదవడం, స్మరణ, ప్రార్థన మొదలైనవాటి ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మల్లించడంలో సహకరిస్తాయి. ఎందుకంటే ఒక దాసుడు వివిధ రకాల ఆరాధనలతో దేవునికి దగ్గరవ్వడానికి మసీదులో మాత్రమే ఒంటరిగా ఉంటాడు. అధిక చర్చను వదిలించుకోవడంలో సేవకుడు విజయం సాధించడంలో సందేహం లేదు. నిద్ర హృదయాన్ని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వైపు తిప్పడానికి మరియు దానికి వ్యతిరేకం నుండి రక్షించడానికి సహాయపడుతుంది.

ఇతికాఫ్ యొక్క అంతర్ ఉద్దేశ్యాలు:

1. లైలత్ అల్-ఖదర్‌ను పరిశోధించండి.

2. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తో తన సాన్నిహిత్యాన్ని, అతని స్మరణను పూర్తి చేయడానికి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కోసం ఇతికాఫ్

3. వీలైనంత వరకు ప్రజల నుండి నిర్లిప్తత.

4. హృదయాన్ని సరిదిద్దడం, మరియు అల్లాహ్ వైపు మళ్ళించడం.

5. ప్రార్థన, ఆరాధన, స్మరణ మరియు ఖురాన్ చదవడం వంటి స్వచ్ఛమైన ఆరాధన ద్వారా ఇతర అనవసర పనుల నుండి పూర్తిగా దూరంగా ఉండండి.

ఇలాగే ఇతికాఫ్ పాటించడం వల్ల ఎన్నో పుణ్యాలు లభిస్తాయి. ఇతికాఫుకు సంబంధించిన ఏదైనా సమస్యలు లేదా ప్రశ్నలు ఉంటే కామెంట్ ద్వారా, లేకపోతే మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించగలరు.

 అల్లాహ్ సుబహానహు వతఆలా మనందరినీ పుణ్య కార్యాలను చేపట్టడానికి మరియు అల్లాహ్ కోసమే చితిశుద్ధ సంకల్పం చేయడానికి అవకాశం కల్పించుగాక.

ఆమీన్.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter