ఇస్లాం మతానికే కాదు, మానవాళికి కూడా కృత్రిమ మేధతొ ముప్పే
ఈ వ్యాసంలో చాట్ జిపిటి ద్వారా కలిగే దీర్ఘకాలిక సమస్యలు, మనుషుల పై మరియు వారి దినచర్యలో రాబోయే చిక్కుల గురించి చర్చించడం జరుగును. కృత్రిమ మేధ మనలో ఎంతలా ఇముడ్చుకుని పోయిందంటే ఉదయం నుంచి రాత్రి పడక గదిలో వెళ్ళే వరకూ మేము కృత్రిమ మేధ ను అధికముగా వాడుతున్నాము అనడం లో అతిశయోక్తి లేదు.
లోపరహితమైన ఉద్యోగి
ఓ సారి చాట్ జిపిటి ని తన వల్ల కలిగే ప్రభావల గురించి అడిగినప్పుడు కంటెంట్ రైటింగ్, డేటా ఎంట్రీ మరియు ట్రాన్స్లేషన్ వంటి వచనా పూరిత పనులకు ప్రమాదం ఉందని తనే స్వయంగా జవాబును రచించి చెప్పింది. కాని ఈ సమాధానం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది తప్ప సంతృప్తి వ్యక్తం చేయదు.
కృత్రిమ మేధ వల్ల ముప్పు కేవలం లేఖనానికి సంభందించిన ఉద్యోగాలకే కాదు. చాట్ జిపిటి వంటి కృత్రిమ మేధ స్వీయ అభ్యాస నమూనాలు. వారు మానవ పరస్పర చర్య మరియు అభిప్రాయాల ద్వారా నిరంతరం తమను తాము మెరుగుపరుస్తాయి, వారి డెవలపర్లు కూడా వాళ్ళ పై నిరంతరం కృషి చేస్తుంటారు. ఇప్పటికే జిపిటి-3 అభివృద్ధి చేసిన "ఓపెన్ ఎఐ" సంస్థ కొత్తగా 'జిపిటి-4' ను రంగంలోకి ప్రవేశ పెట్టింది, ఇది మునుపటి జిపిటి కంటే చాలా వేగమైనది మరియు సృజనాత్మకత మైనది. జిపిటి-3 లో లేని ఎన్నో విషయాలు మరియు విశేషాలు దీనిలో కూడున్నాయి, పుకార్లు ఏంటంటే మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజన్ "బింగ్" తో ఇది చేర్చబడుతుంది. మైక్రోసాఫ్ట్ ఏకంగా 10 బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది, రాబోయే రోజుల్లో చాలా మంది దీనినే తమ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా పెట్టుకునే అవకాశం చాలా గట్టిగా నే కనబడుతోంది.
మైక్రోసాఫ్ట్ లాగా గూగుల్ కృత్రిమ మేధ ను తనలో చేర్చుకోవపోడానికి గల కారణం వ్యాపార ప్రచార ప్రకటనలు, గూగుల్ సంపాదన చాలా వరకు ఈ వాణిజ్య ప్రకటనల వల్లనే వస్తుంది. వినియోగదారులకు నేరుగా ప్రశ్న కు సమాధానం ఇవ్వకుండా ప్రకటనల పై క్లిక్ చేసే అవకాశాన్ని అందిస్తోంది. కృత్రిమ మేధ కూడి ఉన్న సెర్చ్ ఇంజిన్ లో ఇలాంటి సదుపాయాలు ఉండవు. నీవు కోరే జవాబును తక్షణమే అందించడం లో ఇది దిట్ట. యిప్పటికీ దీనిలో ఎలాంటి ప్రకటనలు లేవు భవిష్యత్తులో చెప్పలేం, కాని జిపిటి-4 ను జిపిటి-3 లాగా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే లా అందించడం లేదు కేవలం నెల నెల కు 20 అమెరికన్ డాలర్లు చెల్లించే వారికే పరిమితం చేశారు. చాట్ జిపిటి అయిన లేదా వేరే ఏదైనా, ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ప్రకటనలు చూపించడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం.
సాధారణంగా చెప్పాలంటే, కృత్రిమ మేధ కూ మనిషి చేసే ప్రతి పనిని దాదాపు భర్తీ చేయగలిగే సామర్థ్యం వుంది.
ఉదాహరణకు భోధనను తీసుకుందాం
ప్రస్తుతం చాట్ జిపిటి యొక్క ప్రాథమిక పని సమాచారాన్ని జమ చేసి పొందికైన రీతిలో హాజరు చేయడం. నేటి ఆధునిక విద్య వ్యవస్థ ఉపాధ్యాయుని పాత్ర ను తన విద్య, అనుభవం మరియు నైతికతను వచ్చే తరానికి బోధించే గురువు నుంచి స్తోత్రముచేయబడ్డ సమాచార విశ్లేషకుడు గా మార్చింది. ఈ కాలంలో ఉపాధ్యాయులు ఉదారవాద ప్రభుత్వం యొక్క కీలు బొమ్మలా మారిపోయి ప్రతిపాదకులా వ్యవహరిస్తున్నారు. వారు ఏమి చెబితే అదే ధర్మం మరియు తత్వం, అది సరైనది కాదా లేదా నని సరిచూసుకోకుండా దానిని పిల్లలకు అందజేస్తున్నారు. ఇంకా వివరంగా చెప్పాలంటే సత్య అసత్య పాఠాలు నేర్పకుండా భవిష్యత్తులో సూక్ష్మముగా మరియు స్వేచ్ఛగా పిల్లలను ఆలోచించకుండా చేయడానికి విత్తనాలు ను నాటుతున్నారు. అసత్యమైన ఉదారవాద ప్రచారాన్ని వివాదస్పదమైన వాస్తవాలుగా ప్రదర్శించడమే వారి ప్రథమ లక్ష్యం.
సమాచారాన్ని ఇతరులకు అందించడం లో ప్రస్తుతం జిపిటి కంటే వేగంగా ఎవ్వరూ లేరు. ఒకవేళ లోపయుత ఉపాధ్యాయుని దగ్గర పిల్లలకు పాఠాలు నేర్పించే ఒకటో రెండో మార్గాలు తెలుసుంటే కృత్రిమ మేధ అనేక విధములు తెలుసుంటాయి. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో గమనించినట్లైతే మనకి ఇట్టే అర్థం అవుతుంది ప్రస్తుత ఉపాధ్యాయుల వల్ల కలిగే నష్టం స్వల్పమని. అధికంగా పిల్లలు యుట్యూబ్ లో కార్టూన్ల పరికరం లో వచ్చే పాఠాలను ఆలకించి ఇముడ్చుకున్నారు.
అంతేగాక ప్రభుత్వం తమకు కావలసిన విషయాలను మాత్రమే ఇతరులు కు అందజేయాలని అనుకుంటుంది, ప్రజలను బకరా చేయాలంటే దీనికంటే సులువైన మార్గం లేదు. ఇప్పటికే పుస్తకాలలో ఇస్లాం మరియు ముస్లిం సమాజానికి సంబంధించిన ఎన్నో విషయాలు ను కొన్ని చోట్ల తీసేసింది మరి కొన్ని చోట్ల వారికి నచ్చేటట్టుగా మార్చి తిరగ రాసింది. లోపయుత మనుషలైతే ఇటువంటివి వెంటనే గ్రహించి తెర పైకి తెస్తారు దీనివల్ల ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వానికి కృత్రిమ మేధ కంటే సౌకర్యవంతమైన కీలుబొమ్మ వేరే గత్యంతరం లేదు.
కృత్రిమ మేధతొ ముప్పు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితమా? లేదు వైద్య రంగానికి మరియు ఎన్నో శాస్త్రాలకు కూడా ఆపదే.........