హిందూ ముస్లిముల మధ్య ద్వేషం ఎక్కడ మొదలైంది?

రోజు రోజుకి భారతదేశ ముస్లింల వైఖరి ఎలా తయారవుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ముస్లింలు ఏ విభాగంలోనైనా ముందున్నారంటే అదీ లేదు. ఇస్లాం మతాన్ని మరియు దాని యొక్క సత్య పాఠాలను మైమరిచి కాస్తంత సంపాదించామా కడుపు నింపుకున్నామా అలా అయిపోయింది నేడు ముస్లింల పరిస్థితి. ఇప్పుడు దేశంలో ద్వేష పూరిత స్వభావంతో చోటు చేసుకుంటున్న సంఘటనల పైన ఎలాంటి జ్ఞానం కాదు సుమా, రవ్వంత అవగాహన కూడా లేదు. చూస్తూ చూస్తూనే బాబరీ మసీదు చేతిలో నుంచి జారిపోయింది, కానీ ముస్లిం సోదరులకు ఎలాంటి చింత వంత లేదు. నమాజులు సరిగ్గా చదవని వాళ్లకి చైతన్యము ఉంటుందని మేము అనుకోవడం మూర్ఖత్వానికి దారితీస్తుంది. బాబరీ మసీదు కథ ముగిసింది అనుకుంటే కొత్తగా జ్ఞానవాపి వివాదం తీవ్రస్థాయిలో ముసురుకుంటుంది. అసలు హిందూ ముస్లింల సంఘర్షణ ఎప్పటిది దీని వాస్తవాలు ఏంటని చాలామందికి సందేహం అనేది వచ్చే ఉంటుంది.

ద్వేష బీజం

ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే మనకు ద్వేషపూరిత వాతావరణం గురించి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు తమ అంతులేని ఆధిపత్యాన్ని భారత దేశంలో చలాయించడానికి  కేవలం బల ప్రయోగం ఒక్కటే సరిపోదని అర్థం చేసుకున్నాక వాళ్లు భారతదేశ చరిత్ర, సంస్కృతి విశ్లేషణలో జోక్యం చేసుకోవడం మొదలపెట్టారు. మొదటగా బ్రిటిష్ భారతదేశంలో తమ అధిపత్యాన్ని సమర్థించుకోవడానికి భారతదేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తమకు అనుకూలంగా తీర్చిదిద్దుకున్నారు. తదనుగుణంగా బ్రిటిష్ చరిత్రకారులు భారతదేశ చరిత్రను మతవాద ధోరణిలో మూడు భాగాలుగా విభజించారు. జేమ్స్ మిల్ రాసిన గ్రంథం "హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా" లో భారతదేశ చరిత్ర మత ప్రాతిపదికపై హిందూ యుగం, ముస్లిం యుగం, ఆధునిక యుగం విభజించినాడు. 19 వ శతాబ్దం ప్రారంభంలో వలస పాలకుల కోసం రాసిన ఈ గ్రంథం పాక్షికతో, వలస పాలన పరోక్షకంగా సమర్ధించటానికి ఉద్దేశింపబడింది. దేశ చరిత్ర రచనలలో మతతత్వ వొరవడికి దోహదం చేసింది. దీనిలో భాగంగానే మధ్యయుగంలో ముస్లిం రాజులు అత్యంత క్రూరంగా మరియు కిరాతకంగా చిత్రీకరించి, దానికి కారణం ముస్లిం రాజులు తమ అధిపత్యాన్ని నెలకొల్పుకుని క్రమంలో హిందూ మతంపై దాడి చేసి వారి మత, ఆచార సంప్రదాయాలను ధ్వంసం చేసినారు అని మీల్స్ పేర్కొన్నాడు.‌‌ మిల్స్ రాసిన గ్రంథంలో మధ్యయుగాల చరిత్రకు చీకటి యుగంగా, అత్యంత పీడన, అసహనాలతో,‌‌ క్రూరమైందిగా అభివర్ణించడం చరిత్రకు జరిగిన తీరని అన్యాయం. అంతేగాక బ్రిటిష్ వారు తమ అధికారాన్ని బలపరచడానికి ప్రభుత్వ నివేదికలు, పాఠ్యపుస్తకాలు మరియు గజేట్లలో ఈ కథనానికి తగిన స్థానాన్ని కల్పించారు.‌

ముస్లిం పాలకుల మరియు హిందువుల మధ్య అబద్ధ పేచీలను నిర్మించి యావత్తు ప్రపంచానికి చూపారు. ఇది చదువరుల బుర్రలో పటిష్టంగా నాటుకుపోయింది. స్వాతంత్రం తర్వాత కూడా ఈ భావనాలే ప్రధానంగా కొనసాగాయి. నిష్పాక్షిక దృక్పథంతో మన చరిత్రపై ఎన్నో రచనలు ఉన్నా, కానీ సమూహానికి చేరినవి చాలా తక్కువ. ఇలా చరిత్రను తమ స్వలాభం కొరకు రాసుకుని ప్రదర్శించడం ఎన్నో అనర్ధాలకు దారి తీసింది. మత‌ కలహాల వలన మన భారతదేశంలో ఎందరో మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.

బ్రిటిష్ కాలం నుంచి మతాన్ని ఒక మాధ్యమంగా మార్చుకొని తమ స్వలాభం కోసం వాడుకోవడం ఓ నగ్న నిజం. 1984 ముందు భాజాపా, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థల ఎజెండాలలో రామ మందిరం లేనేలేదు. రెండు సీట్ల నుండి 300 సీట్లు దాకా భాజాపా ఎదిగిన ప్రస్థానంలో బాబరీ మసీదు కూల్చివేత మరియు రామ మందిరం పాత్ర  ఎంత వుందో మనకు తెలిసిందే. ఇప్పుడు రామలల్లా ప్రాణ ప్రతిష్టాపన తర్వాత భాజాపా 400 సీట్లు దాకా సులభంగా తెస్తుందనడంలో ఎలాంటి సంకోచం లేదు. మతం రాజకీయంగా మారిపోవడం, రాజకీయం మతంగా మారిపోవడం ఇప్పుడే ఏదో కొత్తేం కాదు.

ఇలా దేశంలో రాజకీయ వాతావరణం ఉంటే, భారతీయ సోదరులు గాఢ నిద్రలో మునిగి తేలుతున్నారు. సమస్య మన ఇంటి గడప దాక వచ్చేవరకు మనకు బుద్ధి రాదు. ఆ పరిస్థితి ఏర్పడక ముందే ముస్లిం అందరూ కలిసికట్టుగా తమ సమస్యల్ని అరికట్టడానికి పనిచేస్తే ఏదో ఒక మార్గం బయట పడుతుంది. లేదు మేము కలవం మారం అంటే అందరికీ సలాం.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter