ఇస్లాం ధర్మం లో తల్లిదండ్రుల ప్రాముఖ్య

పూర్వ కాలం అనగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం మరియు ఈ ఆధునిక కాలముతో మనం పోల్చితే ఆ కాలం లో తల్లిదండ్రులకు ఇచ్చే ప్రాముఖ్యత ఈ కాలం లో మనం ఇవ్వటం లేదు. ఈ కాలం లో మన తల్లిదండ్రులు మనల్ని పెంచి, పెళ్లి చేపించిన తరువాత మనం మన తల్లిదండ్రులకు వృద్ధాప్యము గదికి పరిమితం చేస్తాం.

ఈ కాలంలో మనం అందరూ తమ తల్లిదండ్రులకు కొంచం కూడా ప్రాముఖ్యత ఇవ్వడం లేద. ఎందుకనగా మనకు తల్లిదండ్రులు కొట్టిన తిట్టిన మన మంచి కోసమే చేస్తారు. కానీ మనం దానిని వేరే దృష్టికోణంతో చూస్తాము. దాని యొక్క పగ కసి పెట్టి మరి వాళ్ళు వృద్ధులు అయిన తరువాత వాళ్ళని హింసిచి మరియు కొట్టి తిట్టి బూతు మాటలు చెబుతూ వాళ్ళని తిండి కూడా ఇవ్వకుండా వాళ్ళని నీళ్ళు ఇవ్వకుండా మరీ హింసిచ్చి వేధిస్తాం.

అది చూసిన మన పిల్లలు కూడా మనల్ని ఇలాగే హింసిచ్చి మరియు మనలని కూడా వేధిస్తారు. ఎందుకంటే మనం మన తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఇవ్వ కుండ వృద్ధాప్యము గదికి నెట్టెస్తాం. అలా మనల్ని కూడా హింసించి మరి చంపేస్తారు.

కానీ ఇస్లాం ధర్మం లో తల్లిదండ్రులకు ఇచ్చే ప్రాముఖ్యత చాలా ఉన్నాయి. ఎలాగైతే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వ సల్లం పై అవతరించిన గ్రంథం దివ్య ఖుర్’ఆన్ లో అల్లాహ్ ఇలా బోదిస్తున్నాడు:

"وَ بِالوَالِدَينِ إحْسَاناً"

 

ఈ యొక్క శ్లోకం తో అల్లాహ్ మనల్ని ఒక మంచి పాఠమును బోధిస్తున్నాడు. ఆ పాఠము ఏమనగా మన మీద తల్లిదండ్రుల పై ఉన్న భాద్యతులను పూర్తి చేయాలి, అది ఎలాగనగా ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం  తమ విషయం లో ఇలా చెబుతూన్నారు:-       

و عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه و سلم قال:- (رغم أنف, ثم رغم انف , ثم رغم انف من أدرك ابويه عند الكبر أحداهما أو كليهما فلم يدخل الجنّة)

హజరత్ అబూ హురైరా (రజి) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (స): “ముసలి వారై పోయిన తల్లి దండ్రులు - వారిరువురిలో ఒక్కరుగాని లేక ఇద్దరుగాని బ్రతికుండగా ( వారికి సేవ చేసుకొని ) స్వర్గంలోకి ప్రవేశించ లేకపోయినవాడి ముక్కుకి మన్నుతగలు! వాడి ముక్కుకి మన్నుతగలు! వాడి ముక్కుకి మన్నుతగలు!” అని మూడు సార్లు శపించారు.

మన తల్లిదండ్రులు చిన్నప్పుడి  నుంచి మనల్ని పెంచి, చదివించి, మరియు ఎన్నో మార్గాలతో మనల్ని పెళ్లి ఏర్పాటులు చేసి పెళ్లి చేపిస్తారు. ఒక అమ్మగా మనల్ని అంటే మనం పుట్టినప్పుడు నుంచి, పుట్టక మూడు నుంచి మనతోపాటు ఉంటుంది. 9 నెలలు కడుపు లో మోస్తున్నపుడు అమ్మకు కలిగే బాధ అమ్మకు కలిగే నొప్పి గురించి ఒక అమ్మనే అడిగి చూడండి ఎలా ఉంటుందో. దాని తరువాత అనగా పుట్టిన తరువాత మనం ఆకలిగా ఉన్నపుడు పాలనిచ్చి మధ్య రాత్రి ఆకలి కోసం ఏడిచినప్పుడు వచ్చి మనల్ని పాలిచ్చి మరి నిద్రపోతుంది. కొన్ని సార్లు అయితే మన వల్ల అమ్మ నిద్రపోకుండా మన పక్కన నిద్రపోయామో లేదని చూస్తూ అక్కడే ఉంటుంది.

అసలు విషయం ఏమి అనగా మనం ఎవరైనా బాత్రూమ్ లో అశుద్దం వదిలి నీళ్ళు కొట్టకుండా వెళ్ళి పోతే మనం దాని చూస్తూ ఉంటాము మరియు అక్కడ వెళ్ళడం దాన్ని శుభ్రం చేయడం అవన్నీ మనం చేయము కానీ మనం చిన్నప్పుడు మనం బట్టల్లో నే అశుద్దం చేసినప్పుడు లేక మూత్రిస్తే మనల్ని కడిగించి మరియు మనకు వేరే బట్టలు తొడగించిన అమ్మపై మన భాద్యతులు ఎన్నో ఉన్నాయి. దాని భాద్యతులన్నీ మనం పూర్తి చేయాలి. ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం ఇలా చెబుతున్నారు:-

 

و عن أبي هريرة رضي الله عنه قال :- جاء رجل إلى رسول الله صلى الله عليه و سلم فقال:- يا رسول الله! من أحق الناس بحسن صحابتي؟ قال:- أمك قال:- ثم من؟ قال:- أمك قال:- ثم من؟ قال:- أمك قال:- ثم من؟ قال:- أبوك.

 

హజరత్ అబూ హురైరా (రజి) గారే చేసిన కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవప్రవక్త (స) దగ్గరికి వచ్చి, “దైవప్రవక్తా! నా సత్ప్రవర్తనకు  అందరికన్నా ఎక్కువ హక్కుదారులేవరు?” అని అడిగాడు. దానికి ఆయన “నీ తల్లి” అని చెప్పారు. “ఆ తరువాత ఎవరు?” అని అడిగాడు. దానికి ఆయన “నీ తల్లి” అని చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ, “ఆ తరువాత ఎవరు?” అని అడిగాడు.  అప్పుడు కూడా “నీ తల్లి” అనే చెప్పారు దైవప్రవక్త (స). ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు “ ఆ తరువాత ఎవరు?” అని. అప్పుడు ఆయన ‘నీ తండ్రి’ అని చెప్పారు.

ఇప్పుడు మనం నాన్న గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం:-

        ముందుగా మనం జీవించడానికి కావలసిన వస్తువులు అనగా అన్నం, నీళ్ళు మరియు ధరించేందుకు బట్టలు కొనిపిస్తారు, ముఖ్య విషయం మనకి జ్వరం లేదా జబ్బు ఇలా ఎన్నో వ్యాధులు వచ్చినప్పుడు మనల్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్తారు. ముఖ్య మాట ఏమి అనగా మనల్ని చదివించడం. మీరు పాఠశాల లో చదువుతూ ఉంటే ఒక మాటని చూడండి మనకి ఏకరీతి కావాలి మరియు పుస్తకాలు ఇంకా టైబెల్ట్ ఇలాగే రుసుములు కూడా కట్టాలి. ఇదంతా చేసిన మా నాన్నపై మన బాధ్యతులు ఎన్నో  ఉన్నాయి.

        ఈ భాద్యతులని ఎలా పూర్తి చేయాలంటే మనం చిన్నప్పుడు ఏ పని చేయలేక పోయేటప్పుడు మన కోసం ఎలాంటి త్యాగాలు చేశారో అలాంటి త్యాగాలు మనం కూడ వాళ్ళు వృద్ధులు అయిన తరువాత అన్నం ఇవ్వలీ బట్టలు కొనిపించాలి మరియు వాళ్ళు మూత్రించిన లేక అశుద్ధం బట్టలో చేసిన దాన్ని శుభ్రం చేయాలి.

నేను అల్లాహ్ తో ప్రార్థిస్తున్నాను అల్లాహ్ మన మీద ఉన్న భాద్యతలను పూర్తి చేసే అవకాశం ఇవ్వు గాక, మరియు మన జీవితాన్ని తల్లిదండ్రుల యొక్క సేవలో పూర్తి చేసే అవకాశం ఇవ్వు గాక, ఆమీన్.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter