సంభాల్ మసీదు వివాదం న్యాయమా? కుట్రా?
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ నగరంలో స్థిరపడి ఉన్న మసీదుపై ప్రభుత్వం సర్వే చేసేందుకు ఆదేశించింది. ఆ సర్వే జరిగే సమయంలో చాలా దాడులు జరగడం వలన నలుగురి ప్రాణాలు బలయ్యాయి. ఇప్పుడు ఈ విషయం అందరి మధ్య చర్చనీయాంశమైంది. హిందువులు పవిత్ర స్థలంగా భావించే స్థలంలో మసీదు నిర్మించారంటూ వచ్చిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించి అక్కడ సర్వే చేయాలని ఆదేశించడంతో వివాదం మొదలైంది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే యోగి ఆదిత్యనాథ్, ప్రభుత్వ నాయకులు హడావుడి చేస్తున్నారు. స్థానికులకు, అధికారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో భాగంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశ బహుళత్వానికి మచ్చ తెచ్చే ఈ తాజా ఘటన నవంబర్ 24న జరిగింది. శతాబ్దాల నాటి హరిహర దేవాలయం ఉన్న స్థలంలో మసీదు నిర్మించారంటూ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మరియు అతనితో సహా ఎనిమిది మంది పిటిషన్ వేశారు. వారణాసి, మథుర మరియు ఆగ్రాలలో కొన్ని మసీదులు ఉన్న చోట ఒకప్పుడు దేవాలయాలు ఉండేవని జైన్ గతంలో ఇలాంటి అనేక పిటిషన్లు కోర్టు వారికి వేసాడు. జ్ఞాన్‌వాపి మసీదు కేసులో కూడా ఆటను ప్రమేయం చేసుకున్నాడు. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, సంభాల్ షాహీ జుమా మసీదు అనేది మొఘల్ యుగం నుండి మిగిలి ఉన్న ఏకైక భవనం, ఇది బాబర్ చక్రవర్తి పాలనలో నిర్మించబడింది. ఇక్కడ మొదటి ముద్దాయి కోర్టు, ఎందుకంటే 1947 ఆగస్టు 15న ప్రార్థనా స్థలాల యాజమాన్యం ప్రాతిపదికగా ఉండాలని పేర్కొంటూ 1991లో పార్లమెంటు ఆమోదించిన ప్రార్థనా స్థలాల బిల్లును అమలులోకి తెచ్చింది కానీ దానానికి కోర్ట్ పట్టించుకోలేదు. నవంబర్ 29 లోగా నివేదిక సమర్పించాలని కోర్ట్ వారే కోరారు. ముస్లిం నాయకులూ ఇలా చెప్పారు: "కోర్ట్ వారు ఈ ఆదేశాలు జారీ చేసే ముందు మసీదు కమిటీ వారితో కేవలం ఒక్క సారి కుడా చెప్పలేదు. దీని ఆధారంగా ఇది ఉగ్రవాదంలో భాగంగా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తీసుకున్న చర్య అనే అనుమానాన్ని లేపుతుంది. అందువల్ల ఈ నలుగురి హత్యకు కోర్టు మరియు యోగి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని పలువురు మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఇలాంటి విధానాలు చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు అన్నారు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య విభజన, వివక్షకు భాజాపా తన అధికారాన్ని ఉపయోగించుకుంటోందని, తద్వారా ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని వీలైనంత త్వరగా న్యాయం చేయాలని ఆయన కోరారు.
ఇది ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలో శాంతి మరియు సామరస్యాలకు విఘాతం కలిగించాలని, శతాబ్దాలుగా ముస్లింలు ప్రార్థిస్తున్నా మసీదు 1991 చట్టం ప్రకారం ముస్లింల హక్కు అని ఆ ప్రాంతానికి చెందిన ఎంపీ జియావుల్ హక్ (సమాజ్‌వాదీ పార్టీ) మీడియాకు తెలిపారు. జిల్లా కోర్టు నుంచి సంతృప్తికరమైన తీర్పు రాకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీలు కూడా ఈ హింసను తీవ్రంగా వ్యతిరేకించారు. చట్టం ద్వారా సమాజానికి న్యాయం జరిగేలా పోరాడుతామని మీడియా ముందు ప్రజలకి కూడా హామీ ఇచ్చారు. మసీదుల ఆక్రమణలు, ముస్లింల మారణహోమానికి వ్యతిరేకంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ముస్లిం లీగ్ నిర్ణయించింది.
లౌకిక భారత రాజ్యాంగ దినోత్సవమైన నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ ఉల్లంఘనగా ఇలాంటి దాడులు జరగడం దేశంలో ప్రస్తుతం ఉన్న భయంకరమైన పరిస్థితిని సూచిస్తోంది. దేశంలో అతిపెద్ద మైనారిటీలైన ముస్లింలు స్వాతంత్య్రం వచ్చి మూడేండ్లు గడిచినా తమ ప్రార్థనా స్థలాలను కాపాడుకోవడానికి తమ ప్రాణాలను త్యాగం చేయడం ఇదంతా చూస్తుంటే ఇది మన రాజ్యంలో పెరుగుతున్న రాజ్య ఉగ్రవాదాన్ని వివరిస్తోంది. పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నా, దేశ ప్రగతికి పెద్దగా ఏమీ చేయలేని ప్రభుత్వాలు అధికారాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా మత ధ్రువీకరణకు, మత విద్వేషాలకు పాల్పడుతున్నాయి. ప్రజల మనసులను ఏకం చేసి దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపించాల్సిన ప్రభుత్వం మానవాళికే సిగ్గుచేటని ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడటం కాదనలేం.