భారత స్వాతంత్ర్యోద్యమం – ఆంధ్రప్రదేశ్ ముస్లింలు

భారత స్వాతంత్ర్యోద్యమం – ఆంధ్రప్రదేశ్ ముస్లింలు

బ్రిటిష్ బానిస బంధనాల నుండి విముక్తుల్ని కోరుకుంటూ వజ్ర సంకల్పంతో అద్వితీయ పోరాటపటిమతో భారతీయులు సాగించిన స్వాతంత్రోద్యమం ప్రపంచ పోరాటాలకు చరిత్రలో సువర్ణాక్షారాలతో లిఖించినదగిన మహత్తర ఘట్టం. ఈ మహోద్యమంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు జాతి, కుల, మత, వర్గ భేదాలు మరచి స్వరాజ్య సాధన మాత్రమే అంతిమ లక్ష్యంగా పాల్గొన్నారు.

భిన్నత్వంలో ఏకత్వం-ఏకత్వంలో భిన్నత్వం, అంతర్గత మార్గదర్శక సూత్రంగా సాగుతున్న భారతీయ సాంఘిక జనసముదాయాలలో ఒకటైన ముస్లిం జనసముదాయం సోదర జనసమూహాలతో కలిసి మెలిసి ఈ పోరులో క్రియాశీలకంగా పాల్గొంది. అది శాంతి పథమైనా, విప్లవమార్గమైనా ఆత్మార్పణలకు ఏనాడు వెనకడుగు వేయలేదు.

మాతృభూమి పట్లగల అవ్యాజ ప్రేమాభిమానాలను ఫలితంగా ధన, మాన ప్రాణాలను పణంగా పెట్టి సోదర సమానులతో కలిసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అసమాన త్యాగలతో అమరులయ్యారు. అద్భుతమైన విజయాలు సాధించారు. అపూర్వ త్యాగాలు, అద్వితీయ సాహసాలతో బ్రిటిష్ వలస పాలకులను ప్రదేశం నుండి పారద్రోలి స్వదేశీయుల పాలన సాధించుకోవడంలో మహత్తర పాత్ర పోషించారు.

ఆ పోరులో అశేష హిమాచలం ఎలాగైతే నడుంకట్టి కదనరంగానికి కదలి వచ్చిందో అదే విధంగా ఆంధ్రావని కూడా పోటెత్తిన సముద్రంలా త్యాగాల బాటలో  ముందుకు సాగింది. పరదేశీయువ పీడనను వదిలించుకునేందుకు భారతీయులంతా ఏకన్మోఖంగా పోరుబాటలో సాగుతున్న సమయంలో ఆంధ్రులు ఆ మార్గాన్నే ఎన్నుకున్నారు. ఈ క్రమంలో తెలుగుగడ్డ మీద పుట్టి పెరిగిన ముస్లింలు తరతరాలుగా కలిసిమెలసి సహజీవనం సాగిస్తున్న సోదర సామానుల దారినే ఎంచుకున్నారు. ముస్లిమేతర జనసముదాయాలలోని స్వాతంత్ర సమరయోధులతో కలిసి ముందుకు నడిచారు. చివరికంటా పోరాడిన ఆంగ్లేయ వలస పాలకులతో పోరాడి భారత స్వాతంత్ర్యసంగ్రామంలో తమవంతు భాగస్వామ్యాన్ని అందించారు.

ఈ మేరకు స్వాతంత్ర్యోద్యమంలో ముస్లిం జనసముదాయాలు నిర్వహించిన మహత్తర పాత్రకు అంతర్గత, బహిర్గత కారణాలు, జాతీయస్థాయి పరిణామాల మూలంగా చరిత్రలో లభించాల్సినంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ప్రచారం లభించలేదు. ప్రామాణిక చరిత్ర గ్రంథాలలో తగిన స్థానం లభించక పోవడం వలన సాహిత్య, సాంస్కృతిక కళారంగాలలో ముస్లింల త్యాగాలకు సంబంధించిన ప్రస్తావనలు అంతగా అగుపించవు. ఈ దౌర్భాగ్యం వలన ఈ జనసముదాయాల భాగస్వామ్యం జనబాహుళ్యానికి పూర్తిగా చేరలేదు. ఆ కారణంగా ఆనాటి అపూర్వ ఆత్మార్పణలు, త్యాగాలు చరిత్ర గర్భాన మరుగున పడిపోయాయి.

తొలి సమర శంఖారావం

ఈస్టిండియా కంపెనీ పేరుతో వ్యాపారం నిమిత్తం భరత గడ్డమీద అడుగుపెట్టిన ఆంగ్లేయులు తిన్నగా స్వదేశీ ప్రభువుల ప్రాపకం సంపాదించారు. అనుమతులు పొందేందుకు అంగీకరించిన షరతులను ఉల్లంఘించారు.

దుశ్ఛచర్యలను సహించలేని బెంగాలు నవాబు సిరాజుద్దౌలాహ్ తొలిసారిగా ఆంగ్లేయుల మీద 1757లో పోరాటం ప్రారంభించారు. స్వజనుల నమ్మకద్రోహం కారణంగా బెంగాల్లోని ప్లాసీ అను గ్రామం వద్ద కంపెనీ సైన్యాలతో జరిగిన యుద్ధంలో సిరాజుద్దౌలాహ్ పరాజయం పాలయ్యారు.

ఆ విధంగా లభించిన విజయంతో పునాదులను గట్టిపర్చుకోచూసిన ఆంగ్లేయులకు ఆ తరువాత మరో పోరాటయోధుడు మీరు ఖాసిం అడ్డుతగిలారు. 1764లో బక్సర్ వద్ద ఆంగ్లేయులతో ఆయన తలపడ్డారు. అంగబలం, అర్థబలంతోపాటుగా విభీషణ మనస్తత్వం గల కొందరు స్వదేశీ పాలకులు ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాలకు అండగా నిలవడంతో ఆ యుద్ధంలో ఆంగ్లేయులు విజయం సాధించాయి. ఈ విజయంతో ఆంగ్లేయులు పూర్తిగా ఉత్తర హిందుస్థానంలో బలపడ్డారు. ఈ విధంగా లభించిన విజయావకాశాలు మూలంగా మొగల్ పాదుషాల మీద ఒత్తిడి పెంచి 1765లో మొగల్ ప్రభువు షా ఆలం నుండి బెంగాల్ దివానిని ఈస్టిండియా కంపెనీ కైసవం చేసుకుంది.

 ఆనాటి నుండి భారతీయుల మీద బ్రిటిష్ వలసపాలకుల పెత్తనం పూర్తిగా స్థిరపడ్డ సాగింది ఈ విధంగా లభించిన పెత్తనం ఆసారాగా అన్నివర్గాల ప్రజలను, స్వదేశీ ప్రభువులను ఈస్టిండియా కంపెనీ పాలకులు, ఆంగ్లేయ అధికారులు దోచుకోవడం ఆరంభించారు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter