అయా సోఫియా: ఒక చారిత్రక సంఘటన

ఇస్తాంబుల్ లోని ప్రపంచ ప్రఖ్యాత హయా సోఫియా కట్టడాన్ని మరోసారి ముస్లింల ప్రార్థనల కోసం మసీదు గా తీర్చిదిద్దారు. హయా సోఫియా దాదాపు 1500 సంవత్సరాల కిందట క్రిస్టియన్ కేథడ్రాల్ గా నిర్మించారు. 1453 లో ఆనాటి ఒట్టోమన్ నాయకుడైనా ముహమ్మద్ అల్-ఫాతిహ్ ఇస్తాంబుల్ ని జయించి దీనిని మసీదు గా మార్చారు. 1934 లో టర్కీ దేశం రిపబ్లిక్ గా మారిన తరువాత ముస్తఫా కమాల్ అటాతుర్క్ ఈ హయా సోఫియా నీ మ్యూజియంగా ప్రకటించారు.

తాజాగా, 86 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ నిర్మాణాన్ని టర్కీ కోర్టు మ్యూజియం యొక్క నిర్ణయాన్ని రద్దు చేస్తు మసీదు గా ప్రకటించడం ప్రపంచంలోని ప్రతి ముస్లిం సోదరునికి ఎంతో ఆహ్లాదకరమైన విషయం.టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్... జులై 24 నుంచి హజియా సోఫియాలో ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కట్టడాన్ని తిరిగి మసీదు గా మార్చడం వలన ఎన్నో రకాల కొలతలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా టర్కీలోని ప్రతిపక్ష లౌకిక వాద సభ్యులు ఈ వాదనను వ్యతిరేకిస్తూ వచ్చారు. దీనిపై స్పందిస్తూ ఎర్డోగాన్ ఈ భవనం ముస్లింలకు, ముస్లిమేతరులకు, విదేశీయులకు అందరికీ తెరిచే ఉంటుందని అన్నారు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter