కేరళలో ఘోర విమాన ప్రమాదం రెండు ముక్కలైన విమానం
- K. Siraj Ahmad
- Aug 14, 2020 - 15:50
- Updated: Aug 14, 2020 - 21:55
కేరళలో ఘోర విమాన ప్రమాదం రెండు ముక్కలైన విమానం
కేరళ: కోళికోడ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం అదుపుతప్పి 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. దీంతో తీవ్ర విషాదం నెలకొంది.
కేరళలో ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో 16 మంది మరణించారు. మరో 123 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది.
వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి ప్రయాణికులతో వచ్చిన ఎయిరిండియాకు చెందిన బోయింగ్ B737 విమానం కోజికోడ్ సమీపంలోని విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో రన్‌వే పైనుంచి పక్కకు జారింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన ప్రాంతం సంక్లిష్టంగా ఉంది. రన్‌వేకు ఆనుకొని లోతైన లోయ ఉంది. విమానం అదుపుతప్పి ఆ లోయలోకి దూసుకెళ్లింది. 30 ఫీట్ల లోతులో పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో విమానం రెండు ముక్కలైంది. ఫోటోలో రెడ్ మార్క్ చేసిన ప్రాంతంలోనే ఈ ప్రమాదం జరిగింది. విమానం రెండు ముక్కలైన తర్వాత మంటలు చెలరేగి ఉంటే.. ప్రాణ నష్టం ఊహించనివిధంగా ఉండేది.
Related Posts
Leave A Comment
Popular Posts
Recommended Posts
Voting Poll
కొత్తగా ప్రారంభించిన ఇస్లామ్ ఆన్ వెబ్ తెలుగు పోర్టల్‌తో మీ అనుభవాన్ని మొత్తంలో ఎలా అంచనా వేస్తారు?
Get Newsletter
Subscribe to our newsletter to get latest news, popular news and exclusive updates.