రంజాన్ మాసంలో చేయాల్సిన ప్రత్యేక పుణ్యఫలాలు
ఇస్లాం లోని ఐదు మూల స్తంభాల్లో ఉపవాసం ఒకటి. ఒకవైపు మనం అమలు చేసే నమాజు, మన జీవితంలో దేవుడి పట్ల భయాన్ని పుట్టిస్తుంది. ఆ భయమే మానవుని తప్పుడు చేష్టలకు అడ్డుకట్ట వేసి, వాటి నుండి కాపాడుతుంది. మరోవైపు అల్లాహ్ తఆలా పట్ల ప్రేమను పుట్టిస్తుంది ఉపవాసం!. ఇంకా ఆ రోజా ద్వారానే ఒక మనిషి విశ్వాసం వెలుగులోకి వస్తుంది. అంతేకాక తన అదే విశ్వాసం, దేవుని ప్రేమను, రాజీతత్వాన్ని పొందేందుకై, తన నిత్యవసరాలైన అన్న పానీయాలను మానేలా చేస్తుంది.
ఇక రోజా ఉషోదయం (వేకువజాము) నుండి మొదలవుతుంది. దానికంటే ముందు 'సెహరి' చేయడం 'సున్నత్'. దీనివలన ఉపవాసం సులభమౌతుంది కనుక. ఇంకా సూర్యాస్తమం అవడం ద్వారా రోజా ముగుస్తుంది. అందుకే సూర్యాస్తమం అవ్వగానే, ఇఫ్తార్ చేయడం తప్పనిసరి. ఇఫ్తార్ లో ఆలస్యం చేయడం సరికాదు. పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి కూడా దాన్నే కొనసాగించడం, అది అస్సలు సరికాదు!. మరోవైపు నుండి ఇది చాలా పెద్ద తప్పు కూడా అవుతుంది. ఇందులో ఉన్న ఆంతర్యం ఏమనగా, మనం మన ఇష్టాల్ని వదులుకొని, పగలంతా ఉపవాసం ఉండడం, దేవుని కొరకైతే, ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఎక్కువ పుణ్యం దక్కవచ్చని చిన్న ప్రశ్న మనకు తట్టవచ్చు. కానీ, ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగదు మరియు అల్లాహ్ తఆలా కూడా మనల్ని కష్టపెట్టదలచలేదని స్వయంగా ఖురాన్ బోధించింది. పగలంతా రోజా ఉండడం సత్కార్యం అయితే, మరోవైపు నుంచి ఇఫ్తార్ కూడా ఒక గొప్ప ఆరాధననే. అది ఎలాగంటే మనం ఇఫ్తార్ ను సమయం ఐతనే మొదలుపెడితే, అందులో దేవుని ముందు మనం, మన బలహీనతల్ని వ్యక్తపరుస్తున్నట్లు. కాబట్టి, ఇది కూడా ఒక ప్రార్థననే. మొత్తానికి ఒక మానవుడు తన బలహీనతను అల్లాహ్ తఆలా ముందు వినయంగా ఒప్పుకోవాలి. అది ఇలాగైతే మంచిది. ఓ అల్లాహ్! నువ్వు ప్రసాదించనిదే, మాకు ఏది సొంతం కాదు! తినే ప్రతి మెతుకూ, తాగే ప్రతి గుటకా, మాకు అవసరమే. నువ్వు మమ్మల్ని వీటి నుండి దూరంగా ఆగమన్నంత సేపు, మేము దాన్ని పాటిస్తూ ఆగాము. తర్వాత నువ్వు ప్రసాదించినదే తింటాము. దీని గురించి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ తఆలా స్వయంగా ఇలా తెలియజేశారని సెలవిచ్చారు:
أحبُّ عبادي إليَّ أعجلُهم فطراً". (سنن الترمذي:٧٠٠)
"అల్లాహ్ తఆలా కు తన దాసులలో అత్యంత ఇష్టమైన వారు , సూర్యాస్తమసయం అయిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇఫ్తార్ (ఉపవాస విరమణ) చేసేవారు." అని దీని అర్థం.(సునన్ తిర్మిజీ:700)
దీని ద్వారా మరో విషయం కూడా అర్థం చేసుకోవలసి ఉంది. రోజా పూర్తవ్వాలంటే, ఇఫ్తార్ చేయడం తప్పనిసరి! అందుకే ఇఫ్తార్ ను కూడా, ప్రార్థనలో భాగంగా కలుపుతారు. రోజాకే కాదు, ఇంకా చాలా ప్రార్థనలకు కూడా అల్లాహ్ తఆలా ఇలాంటి వ్యవస్థనే ఉంచారు. ఉదాహరణకు 'సలాం' చేయడంతో 'నమాజ్' పూర్తి అవుతుంది. వెంట్రుకలు కత్తిరించడం లేదా గుండు కొట్టించడంతో 'హజ్' పూర్తి అవుతుంది. సరిగ్గా అదే విధంగా రోజా, ఇఫ్తార్ చేయడంతో ముగుస్తుంది. ఇవన్నీ కూడా ప్రార్థనల్లోని భాగాలే తద్వారానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇఫ్తార్ సమయాన్ని నిర్దేశించి, దాని పద్ధతుల్ని కూడా బోధించారు ఇంకా ఇఫ్తార్ కు ముందు ఈ దువా చదవాలని తెలిపారు:
(اللَّهُمَّ لَكَ صُمْتُ وَعَلَى رِزْقِكَ أَفْطَرْتُ)
"ఓ అల్లాహ్! నీ కోసమే నేను ఉపవాసం పెడితిని, మరియు నీవు ప్రసాదించిన ఆహారంతోనే నా ఉపవాసాన్ని విరమిస్తున్నాను."(సునన్ అబూ దావూద్:2358)
ఇంకా ప్రియా ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారు ఈ విషయాన్ని కూడా తెలిపారు:
عَنْ سَلْمَانَ بْنِ عَامِرٍ الضَّبِّيِّ، عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: "إِذَا أَفْطَرَ أَحَدُكُمْ فَلْيُفْطِرْ عَلَى تَمْرٍ فَإِنَّهُ بَرَكَةٌ، فَإِنْ لَمْ يَجِدْ تَمْرًا فَالْمَاءُ فَإِنَّهُ طَهُورٌ"
"మీలో ఎవరైనా ఉపవాసం విరమించేటప్పుడు (ఇఫ్తార్ చేసేటప్పుడు) ఖర్జూరంతో విరమించండి, ఎందుకంటే అందులో శుభం (బరకత్) ఉంది. ఒకవేళ ఖర్జూరం లభించకపోతే నీటితో విరమించండి!.ఎందుకంటే అది పవిత్రమైనది."(సునన్ అబూ దావూద్:2355)
ఇంకా స్వయంగా ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారు కూడా ఇలాగే చేసేవారు. తాజా ఖర్జూరాలు ఉంటే వాటితో, లేకపోతే ఎండిన ఖర్జూరాలతో, ఒకవేళ అవి కూడా దొరక్కపోతే, కొన్ని గుటకల నీటిని సేవించేవారు.
(అబూ దావూద్:2532)
అందువల్లనే, ఇటువంటి ప్రార్థనల్లో ముస్లింలు పరస్పరంగా చేయూతనందించుకోవడం, గొప్ప పుణ్యకార్యం. దీని విశిష్టతను గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు:
مَنْ فَطَّرَ صَائِمًا كَانَ لَهُ مِثْلُ أَجْرِهِ غَيْرَ أَنَّهُ لاَ يَنْقُصُ مِنْ أَجْرِ الصَّائِمِ شَيْئًا"
"ఎవరైనా ఒక ఉపవాసకుడికి ఇఫ్తార్ చేయిస్తే (ఉపవాసం విరమింపజేస్తే), అతనికి, ఆ ఉపవాసకుడికి లభించేంత పుణ్యం దక్కుతుంది. అయితే దీనివల్ల ఆ ఉపవాసకుడి పుణ్యంలో ఎలాంటి తగ్గింపు ఉండదు."(అబూ దావూద్)
అల్లాహ్ తఆలా మనందరికీ ఉపవాసం పెట్టే భాగ్యాన్ని , ఇంకా ఉపవాసులకు ఇఫ్తార్ చేయించే భాగ్యాన్ని కూడా ప్రసాదించుగాక! ఆమీన్!


