మైసూరు పులి టిపూ సుల్తాన్

మైసూరు పులి టిపూ సుల్తాన్

భారత దేశ రాజకీయ చరిత్రలో పద్దెనిమిదవ శతాబ్దపు ఉత్తరార్థ భాగం ఎంతో కీలకమైన సమయం. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను పరాజితుడ్ని చేసి, బెంగాల్ దివానిని హస్తగతం చేసుకున్న ఈస్టిండియా కంపెనీ పాలకులు దక్షిణాదిని ఆక్రమించుకోవడానికి యుక్తపలు, కుయుక్తులు పన్నుతున్నారు. ఈ సామ్రాజ్యవాద శక్తుల రాజ్య విస్తరణ కాంక్షను అర్థం చేసుకొని స్వదేశీపాలకులు పరస్పరం కలహించుకుంటున్నారు. ఈ సమయంలో నేనున్నా నేనున్నా అంటూ భారత రాజకీయ చిత్రపటం మీద ఉదయించాడొక భానుడు. ఆ మొనగాడే, ప్రముఖ చరిత్రకారుడు జేమ్స్ మిల్(JAMES MILL) ది గ్రేటెస్ట్ ప్రిన్స్ ఆఫ్ ఈస్ట్(THE GREATEST PRINCE OF THE EAST) గా కీర్తించబడిన దక్షిణ భారతదేశ చరిత్రలో మధ్యాహ్నం మూడు మార్తుండుడిగా వెలుగొందిన, మైసూర్ పులి గా ఖ్యాతిగాంచిన టిపూ సుల్తాన్.

ఈస్టిండియా కంపెనీ పాలకుల పెత్తనాన్ని సవాలు చేసి, ఈ గడ్డమీద నిలదొక్కుకుంటున్న బ్రిటీషర్లను తొడగొట్టి సవాలు చేసిన టిప్పుసుల్తాన్ 1750 నవంబర్ 10వ తేదీన కర్నాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా దేవనహళ్ళి గ్రామంలో జన్మించారు. అసమాన ధైర్య సాహసాలతో దక్షిణ భారత దేశపు నెపోలియన్ గా ఖ్యాతిగాంచిన అరివీర భయంకరుడు. మైసూరు పాలకుడు హైదర్ అలీ, శ్రీమతి ఫాతిమా ఫక్రున్నిసాలు తల్లిదండ్రులు. ఆర్కాట్ కు చెందిన ప్రముఖ సూఫీ తత్వవేత్త మస్తాన్ ఔలియా అనుగ్రహం వలన టిపూ

తమకు కలిగాడని భావించిన తల్లిదండ్రులు, ఆయనను స్మరించుకుంటూ టిపూ అని ముద్దుగా పిలుచుకున్నారు. టిపూ తాతయ్య పేరు ఫతే ముహమ్మద్. ఆయన జ్ఞాపకార్ధం, ఆయన మీద ఉన్న గౌరవం కొద్ది టిపూకు ఫతే అలీ అని పేరు పెట్టారు.

విద్యాగంధం లేని హైదర్, తన బిడ్డ మాత్రం పండితుడు, యుద్ధ విద్యలలో ప్రవీణుడు కావాలని సంకల్పించి, టిపూ కు మంచి విద్యాబుద్ధులు చెప్పించారు. తండ్రి ప్రత్యేక పర్యవేక్షణ లో యుద్ధకళను టిప్పు ఔపోసమ పెట్టారు. ఆనాటి ప్రముఖ యోధులలో అగ్రగామిగా గుర్తింపు పొందారు. చిన్నతనం నుండి తండ్రి నాయకత్వంలో సాగిన యుద్ధాలలో పాల్గొన్నారు. ఏ అంశానికి సంబంధించినదైనా, ఎటువంటి విశిష్ట, సాంకేతిక సమాచారమైనా అధ్యయనం చేసిన ఆకళింపు చేసుకోవడం నూతనత్వాన్ని అనునిత్యం ఆహ్వానించడం టిపూ ప్రత్యేకత. భారతీయ పాశ్చాత్య తత్వవేత్తల, రాజనీతిజ్ఞుల గ్రంథాలను సేకరించి అధ్యయనం చేశారు.
ఈ విధంగా సేకరించిన అపూర్వ గ్రంథాల అధ్యయనం ద్వారా సంపాదించుకున్న పరిజ్ఞానం, సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాల మీద టిపూ సాధికారికంగా చేసినటువంటి విశ్లేషణలు, ఫ్రెంచ్, ఆంగ్లేయాధికారులను ఆశ్చర్యచకితులను చేసేవి. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల గురించి వ్యక్తం చేసిన అభిప్రాయాలు, దౌత్యవ్యూహాలను, బ్రిటీష్ అధికారి డావ్టన్(DOVETON) ప్రత్యేకంగా ప్రశంసించక తప్పలేదు.

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter