సయ్యిదినా ఉస్మాన్ (ర) జీవితం: మనకు ఓ ఆదర్శం
హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రజియల్లాహు తాలా అన్హు) ముస్లింల యొక్క మూడవ ఖలీఫా. పురుషులలో మొదట ఇస్లాంను విశ్వసించిన వారిలో నాల్గవవావరు. ఆయన 1వ మొహర్రం 24 హిజ్రి నుండి 18 దుల్ హిజ్జా 35 హిజ్రీ వరకు ఖిలాఫత్‌ను అద్భుతంగా నిర్వహించారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆయనికి అపరిమితమైన సిరి సంపదను ఇచ్చాడు మరియు అంతకంటే ఎక్కువ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసే మనస్సు కూడా ప్రసాదించాడు. ఆయన ఎల్లప్పుడూ ఖురాన్ పఠించడం తన అలవాటుగా రూపుదిద్దుకున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ప్రేమే ఆయన విశ్వాసం, సున్నిత మనస్తత్వమే ఆయన స్వభావం. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్కఇద్దరు కుమార్తెల వివాహిత, అల్లాహ్ యొక్క దీవెనలు అతనిపై ఉండుగాక). సయ్యదినా ఇబ్రహీం (అలహిస్సలాం) మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పోలి ఉన్న ఏకైక వ్యక్తి ఉస్మాన్ (రజియల్లాహు తాలా అన్హు). ఈ భూమండలంపైనే స్వర్గ వాసిగా శుభవార్త పొందిన వారు మన ఉస్మాన్ రజియాల్లాహు అన్హూ గారు.
ఈ లక్షణాలన్నింటితో పాటు, ఆయన అత్యుత్తమమైన వినయం. విశ్వాసుల యొక్క తల్లి అయిన ఆయిషా రజియాల్లాహు అన్హా ఉల్లేఖిస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఒకరోజు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన కాళ్లు అవస్త్రం గాను ఉండేవి. అప్పుడు అబూబకర్ సిద్ధీఖ్ రజిఅల్లాహు అన్హూ లోపల రావడానికి అనుమతి అడిగి వచ్చారు మరియు పవిత్ర గ్రంథమును వినిపించి వెళ్లిపోయారు. తరువాత ఉమర్ రజిల్లాహు అన్హూ లోపల రావడానికి అనుమతికి వచ్చి సంభాషించి వెళ్లిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం మీద ఎటువంటి మార్పు లేదు, ఆయన అదేవిధంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియాల్లాహు అన్హూ అదేవిధంగా లోనికి రావడానికి అనుమతి అడిగారు. అప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న ప్రవక్త లేచి తన దుస్తులను సరి చేసుకున్నారు. ఆయన ప్రవక్తతో సంభాషించి వెళ్ళిపోయారు. అప్పుడు హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హ ప్రవక్తతో ఈ విధంగా ప్రశ్నించారు: గదిలో హజరత్ అబూబకర్ సిద్ధిక్ వచ్చినప్పుడు గానీ, ఉమర్ ఫారూఖ్ గారు వచ్చినప్పుడు గానీ మీరు ఎటువంటి చలనం లేకుండా అలాగే ఉన్నారు. కానీ, హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్పాన్ గారు ప్రవేశించక ముందు మీరు మీ వస్త్రాలను సరి చేసుకున్నారు. ఎందువలన? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా జవాబు ఇచ్చారు: హజరత్ ఉస్మాన్ చూసి దేవదూతలే నిరాడంబరంగా ఉంటాయి. అలాంటి వ్యక్తితో నేను కూడా నిరాడంబరంగా ఉండకూడదా.!
చరిత్రకారులు ఆయన గురించి ఈ విధంగా రాస్తున్నారు: ఆయన తన ఏకాంతంలో కూడా ఎంతో నమ్రత తో ఉంటారు.
దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచరుడైన ఉస్మాన్ రజియల్లాహు అన్హు గారు మన అందరికీ ఏమి ఆదేశిస్తున్నారు అంటే మనము మన మానాన్ని ఎవరి ముందు కూడా చూపించకూడదు దీనిలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉస్మాన్ రజియల్లాహు అన్హు రాకముందు ప్రవక్త కాళ్లు అవస్త్రబడి ఉన్నాయి. అది ఎటువంటి నిషేధం కాదు. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తన కాళ్ళను క్రింది వరకు కప్పిపుచ్చారు. నేడు నాటి యువతలో ఎందరో కొత్త కొత్త అశ్లీలగా పరిగణించే వస్త్రాలు ధరిస్తున్నారు. అందులో టాయ్ జీన్స్, షార్ట్స్ మొదలగు వంటివి. మనం ధరించి మన ఇస్లాం మతంను యొక్క పేరును మట్టిలో కలిపేస్తున్నాము. మనము దాచవలసిన అవయవాలను ఇతరులకు చూపించి పాపాలను పొందుతున్నాము. ఇలా చేయడం ఇస్లాం మతంలో ఎప్పటికీ అనుమతించబడదు. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా ప్రవచించారు:
ఒకవేళ మీకు నమ్రత లేకపోతే మీరు ఎటువంటి అఘాయిత్యానికైనా పాల్పడండి.
ఆ సర్వశక్తి సంపన్నుడు అయిన అల్లాహ్ మా యొక్క విశ్వాసం కాపాడుగాక ఆమీన్..