ప్రముఖ ఇస్లామిక విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవ వేడుకలు

హిదాయా నగర్ (మలప్పురం): దక్షిణభారత కేరళ రాష్ట్రంలో స్థాపించబడ్డ ఆధునిక, ధార్మిక విద్యా స్థాపన, ముస్లిం సమాజం యొక్క సంస్థ, దారుల్ హుదా ఇస్లామిక విశ్వవిద్యాలయం 35  సంవత్సరాల నుండి తన విద్యా సేవలు సమాజానికి అందిస్తూ వస్తుంది, మరియు వికాస కార్యక్రమాల కొరకు కొత్త మార్గం వైపు దూసుకెళుతోంది.
దాని మునుపటి కార్యక్రమాల అనుగుణంగా, ఈ సంవత్సరం  మార్చి 9 10 బుధ గురువారాల్లో విశ్వవిద్యాలయం నుండి చదువు పూర్తి చేసుకున్న వందలాది పండితుల స్నాతకోత్సవ వేడుకలు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరగనున్నాయి.
ఇందులో కేరళ నుండి 387 మరియు కేరళ వెలుపల నుండి 29 పండితులకు ప్రముఖ పండితుల సమక్షంలో 'హుదవీ' బిరుదు ఇవ్వబడుతుంది.

(File Photo)

కరోనా మహమ్మారి వలన, ప్రభుత్వం జారీ చేసిన సూచనల ప్రకారం, మాస్క్, సమాజ దూరాన్ని పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించబడుతోందన్న విషయం గమనార్హం. అందువలన ఈ కార్యక్రమం యూట్యూబ్ మొదలగు సామాజిక మాధ్యమాలలో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది.
మొదటి రోజు (మార్చి 9న) కార్యక్రమం మూడు భాగాలుగా నిర్వహింపబడుతుంది. ఈ మూడు భాగాలు కూడా రాష్ట్రీయ హుదవీల కొరకు దారుల్ హుదా యొక్క ఆడిటోరియంలో ప్రత్యేకంగా చేపట్టనున్నారు. ఇందులో విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ డా. బహావుద్దీన్ నద్వీ, జనరల్ సెక్రటరీ కూడా తమ సలహాలను, ఆలోచనల్ని ప్రసంగ రూపంలో అందించనున్నారు.
మధ్యాహ్నం 3:30 తర్వాత మంపురం మఖాం దర్శనం చేసుకుని, తిరిగి విశ్వవిద్యాలయంలో సమస్త కేరళ పతాకాన్ని ఎగురవేయనున్నారు.
అలాగే ఈ స్నాతకోత్సవ సంబరాల్ని మరింత వైభవంగా అలంకరించడానికి ఎందరో ప్రముఖులు విచ్చేయనున్నారు. అందులో కేరళ రాష్ట్ర ముస్లిం యువ నాయకుడైన పానక్కాడ్ మునవ్వరలీ షిహాబ్ తంగళ్, మహారాష్ట్ర ముఫ్తీ అల్లావుద్దీన్ ఖాదిరీ, ముఫ్తీ ముయీన్ మియాన్ హాజరుకానున్నారు.

మరుసటి రోజు, బుధవారం, వివిధ కార్యక్రమాల తరువాత పవిత్ర ఖురాన్ పూర్తి పారాయణం మరియు దువా మజ్లిస్ ఏర్పాటు చేయబడ్డాయి. అస్ర్ నమాజ్ ప్రార్ధన తరువాత, స్నాతకోత్సవ ప్రధాన కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ మాజీ అధ్యక్షుడైన జైనుద్దీన్ ముస్లియార్ మరియు విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడైన బాపుట్పి హాజి సమాధులను సందర్శించి ప్రారంభిస్తారు. ఈ ప్రోగ్రామ్ యొక్క స్వాగత ప్రసంగం షేఖ్ హైదర్ అలీ షిహాబ్ తంగల్ ద్వారా జరుగును. ప్రోగ్రామ్ సమస్తా కేరళా అధ్యక్షుడు సయ్యిద్ జిఫ్రి తంగల్ నాయకత్వం లో జరుగుతుంది. షేఖ్ హైదర్ అలీ షిహాబ్ తంగల్ పండితులకు పట్టాలను తమ చేతుల ద్వారా అందిస్తారు. పట్టాలు తీసుకునే పండితులలో కేరళ బయట నుంచి కూడా 29 పండితులు దేశంలో నీ పలుప్రాంతాల మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ మరియు నేపాల్ మొదలైనవి, నుంచి ఉండడం విశేషం. స్నాతకోత్సవ కార్యక్రమం అనంతరం సమస్త కేరళా సెక్రటరీ ముఖ్య ప్రసంగాన్ని కొనసాగిస్తారు‌.‌‍‍‍ వీరితో పాటు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డా. బహావుద్దీన్ ఉస్తాద్ కూడా ప్రసంగిస్తారు. పండితులు పట్టాలు అందుకున్న రూపాంతరం ఎల్లప్పుడూ మతం ప్రచారంలో కృషి చేస్తామని మరియు మతం వేదాంతాన్ని ఎప్పుడూ వదలమని ప్రతి పండితుడి నుండి వాగ్దానం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో పలు ముఖ్య అతిథులుగా ఎం.పి పి.వి అబ్దుల్ వాహ్హాబ్ మరియు ఎం.ల.ఏ అబ్దు రబ్ ఉండడం గమనార్హం.

రాత్రి మీరాజ్ సందర్భంగా, జిక్ర్ మరియు దువా కార్యక్రమాలు జరుగును. జిక్ర్, దుఆ మజ్లిస్‌ను ఆల్ రసూల్ సయ్యద్ అబ్బాస్ అలీ షెహాబ్ తంగల్ ప్రారంభిస్తారు. మరియు ఈ కార్యక్రమానికి షేక్-ఉల్-హదీత్ మౌలానా ఇస్హాఖ్ బాఖవీ అధ్యక్షత వహించనున్నారు.  అసెన్షన్ రాత్రి సందేశం మరియు ముఖ్య ఉపన్యాసం ఇవ్వడానికి ప్రఖ్యాత ఇస్లామిక్ పండితుడు మరియు కేరళకు చెందిన ఖతీబ్ అబ్దుల్ సమద్ పూకోత్తూర్ హాజరుకానున్నారు.  సమావేశం దారుల్ హుదా విశ్వవిద్యాలయం ఉప అధ్యక్షుడు మౌలానా సయ్యద్ మహ్మద్ కోయ తంగల్ హృదయపూర్వక ప్రార్థనతో ముగుస్తుంది.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter