మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి

  وعن أبي هريرة رضي الله عنه قال: قال رسولُ اللَّه ﷺ: انْظُرُوا إِلَى مَنْ هو أَسفَل مِنْكُمْ وَلا تَنْظُرُوا إِلَى مَنْ هُوَ فَوقَكُم؛ فهُوَ أَجْدَرُ أَن لا تَزْدَرُوا نعمةَ اللَّه عَلَيْكُمْ (متفقٌ عَلَيْه)ِ

హజ్రత్ అబూహురైరా (రౙియల్లాహు‌ అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: “ఎల్లప్పుడూ మీ కన్నా హీన స్థితిలో ఉన్న వారిని చూడండి. మీకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారి వంక చూడకండి. ఇదే మీ కొరకు శ్రేయస్కరం. (ఎందుకంటే మీరీలా చేసినపుడు దేవుని ఏ అనుగ్రహం కూడా మీ దృష్టిలో అల్పంగా ఉండదు.”. (బుఖారి, ముస్లిం)

దైవాన్ని విశ్వసించి వ్యక్తిలో సతతం తృప్తి, కృతజ్ఞతా భావం ఉండాలని ఈ హదీసు చెబుతోంది. ప్రాపాచికంగా తనకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వారిని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మనసులో అసూయాద్వేషాలు జనిస్తాయి. ఏ విధంగానైనా ఎదుటివారిని మించి పోవాలన్న పెరాశ పుట్టుకు వస్తుంది. మరి ఈ ప్రాపంచిక లక్ష్యం కోసం అతడు ఎంతకైనా తెగిస్తాడు. ధర్మ మార్గాన్ని పరిత్యజిస్తాడు. దీనికి బదులు మనిషి ఆర్థికంగా తనకన్నా హీనస్థితిలో ఉన్న వారిని చూసినపుడు దేవుని పట్ల అతనిలో కృతజ్ఞతాభావం జనిస్తుంది. పేదల పట్ల దయ, జాలి, ప్రేమ వంటి సకారాత్మక భావాలు పెంపొందుతాయి. వాళ్ల మంచి చెడుల పట్ల అతను శ్రద్ధ వహించటం మొదలెడతాడు. పర్యవసానంగా సమాజంలోని ప్రజల దృష్టిలో కూడా అతను దయాశీలిగా, సత్పౌరినిగా ఉంటాడు.

ఈ సమాజంలో దురాశ కంటే ప్రమాదకరమైనది ఏదీ లేదు. ప్రతి చెడుకి మూలం దురాశే. ఓ వేల మనిషి గనుక కక్కుర్తి భావోద్వేగంతో ఖాళీ అయివుంటే ప్రపంచం మంచితనం నిండిపోయి వుండేది.

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినట్టు మానవునికి గనక రెండు ఉహద్ పర్వతాలంతా బంగారం ఇచ్చినా ఇంకా కావాలని వ్యర్ధమైన ఆశ మరియు తపన ఉంటుందే తప్ప, ఉన్న దానిలో రాజీపడడం అస్సలు ఉండదు.

ప్రపంచంలో చాలామంది ధనికులున్నారు, ఎలోన్ మాస్క్ ప్రపంచంలో అత్యంత కుబేరుడు మరియు సంపన్న వ్యాపారి కానీ ఎంత సంపాదించిన ఎంత సంపద ఉన్నా ఒకవేళ మనశ్శాంతి లేకపోతే ఆ డబ్బు మరియు సంపదతో ఎటువంటి ప్రయోజనం లేదు. నా దృష్టిలో ఓ చెంబు గంజి తాగి నలుగురుతో కలిసిమెలిసి సుఖంగా ఉంటున్న వాళ్లు ఎలోన్ మాస్క్ కంటే వెయ్యి రెట్ల ధనవంతులు.

మన దగ్గర ఏదుంటే దానిపై రాజీ పడితే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను సులువుగా గ్రహించగలం, ఇందులో బర్కత్ కూడా చాలా ఉంటుంది.

అదే గనుక రాజీ పడకుండా, మన పైన (ధనంలో మరియు స్థాయిలో) ఉండే వాళ్ళని చూస్తే మనకు దుఃఖం విశాదం తప్ప ఏమి మిగలదు. మన దగ్గర ఉన్న దానికన్నా లేని వాటి గురించి ఆలోచిస్తే ఒత్తిడికి గురవుతాము. ఫిన్నిష్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ వెల్ఫేర్ పరిశోధకుల ప్రకారం తీవ్ర ఒత్తిడికి లోనవ్వడం వల్ల మనిషి యొక్క జీవితకాలం 2.8 సంవత్సరాలు తగ్గుతుంది.

గనుక అనంత కరుణామయుడు ఏదిచ్చిన దానిలో రాజీ పడుతూ తను ప్రసాదించిన అనుగ్రహాలపై కృతజ్ఞతలు తెలుపుకోవడం ప్రతి ఒక్కరిపై కర్తవ్యం.

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter