నెల్లూరు రొట్టెల పండుగ

నెల్లూరు అంధ్రరాష్ట్రానికి చెందిన ఒక జిల్లా, సముద్రం ఒడ్డున ఉన్న ఒక అందమైన పట్టణము. 300 సంవత్సరాల క్రితం పన్నెండు మత గురువులు ఇస్లాంని వ్యాపించేందుకు ఎందరో తమ తమ దేశాలను వదిలి మన భారతదేశానికి వచ్చారు. అందులో 12 మంది సౌదీ అరేబియా దేశము నుండి వలస వచ్చారు. వారందరూ జాతులకు, మతాలకు అతీతంగా శాంతిని నెలకొల్పాలని వచ్చినట్లు చరిత్రలో వ్యాఖించబడి ఉంది. ఆ దర్గా పేరు బారాషహీద్ (12 వీర మరణం పొందిన వారు) అనే పేరుతో కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ దర్గాకు ఎంతో పేరు ప్రఖ్యాతలు దక్కినాయి వీరి యొక్క చరిత్రను మనము చదివితే ఎన్నో కథనాలు మనకు లభ్యమవుతాయి. ఇస్లాం మతం వ్యాప్తి చేయు సమయంలో కొందరు ఇస్లామేతరులకు వీళ్ళ మధ్య యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ 12 మంది వాళ్ళతో యుద్ధం చేసి చివరికి వీరమరణం పొందారు. ఆ విశ్వాసులు వీరి తలను మెడలను వేరుచేసి గండవరం చెరువు వద్ద పడేశారు. ఆ తరువాత వారందరిని ఆ సెలయేరు (ఒక పెద్ద చెరువు) వద్దనే సమాధి చేసారు. ఈ దర్గా బాగా ప్రసిద్ధి చెందడం వెనుక ఒక కథనం ఉంది. తమిళనాడుకు చెందిన ఆర్కట్ ను పరిపాలించే నవాబు భార్య దీర్ఘానారోగ్యంతో బాధపడుతూ ఉండేది. అప్పుడు ఆమెకి తన అనారోగ్యం వీడాలంటే ఈ నెల్లూరు ప్రాంతంలో ఉన్న బారాషహీద్ దర్గాను దర్శించాలని  కలలో వచ్చింది. అప్పుడు ఆమె అదే విధంగా ఈ దర్గాని దర్శించుకుని ఆరోగ్యవంతురాలుగా మారింది. ఈ శుభకార్యము వలన ఆ నవాబు ఆ దర్గా చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కొని ఆ దర్గాకు యాజమాన్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రదేశం నెల్లూరు జిల్లాలో గండవరం చెరువు అనే ప్రదేశంలో ఉంది. ఇప్పుడు ఆ పన్నెండు దర్గాలను కలిపి 'బారా షహీద్ మజార్ షరీఫ్' అని పేర్కొంటారు. అక్కడే మరొక దర్గా 'సయ్యద్ బాబా' అని 'జలాలుద్దీన్  దర్గా' పేరుతో ఉంది. 

 

రొట్టెల పండుగ

రొట్టెల పండుగ పేరుతో  కొన్ని లక్షల మంది ప్రజలు ధర్మాలకు అతీతంగా, ప్రతి ఏట ముహర్రం నెలలో ఈ దర్గాను సందర్శిస్తారు. అక్కడ ఉత్సవాల(ఉౠస్) పేరుతో ముహర్రం నెల 11,12,13 వ తేదిలలో రొట్టెల మార్పిడి జరుగుతుంది. అలా మూడు నాలుగు రోజుల పాటు ప్రత్యేక చదివింపులు, ప్రార్థనలు, ఆచారాలు పాటిస్తారు. అంటే అక్కడ వచ్చేవారి వివిధ మ్రొక్కుబడుల ప్రకారం రొట్టెలను పేర్లు కేటాయించుకుంటారు. ఉదాహరణకు 'పిల్లల రొట్టెలు' ఎవరికైన సంతానం లేకపోతే ఆ నదిలో నిలబడి తలపై ఆ నది నీళ్ళను తీర్థంలా చల్లుకొని, సంతానం లేనివారు సంతానం కలిగినవారి నుండి రొట్టెలను తీసుకొని తింటారు. అలా చేస్తే సంతాన ప్రాప్తి జరుగుతుందనీ వారి మూఢ నమ్మకం.

అలా సంతానం లేనివారు రొట్టెలను తిన్న తరువాత వారికి సంతానము కలిగితే, తిరిగి వచ్చి వారుకూడా రొట్టెలను ఇతరులకు ఇస్తారు. అలా అనేక మంది ప్రజలు తమ తమ మ్రొక్కుబడుల ప్రకారం ప్రతి ఏట రొట్టెల మార్పిడి జరిపే ఆచారాన్ని 'నెల్లురు రొట్టెల పండుగ' అని అంటారు. ప్రజల సమస్యలకు అనుగుణంగా రొట్టెలను పేర్లు పెట్టుకుంటారు. ఉదా; ఉద్యోగ రొట్టెలు, ధన రొట్టెలు, విదేశాలకు పోయే విసా రొట్టెలు, అసెంబ్లీ రొట్టెలు, ఆరోగ్యం రొట్టెలు, వివాహ రొట్టెలు అని వివిధ సమస్యల అవసరాల పేర్లతో రొట్టెల మార్పిడి జరుగుతుంది. తరువాత అక్కడికి వచ్చేవారు ఉనలను కూడా ఆరాధిస్తారు. ప్రతి దర్గా వద్ద జరిగే షిర్క్ మరియు బిద్అత్ వంటి అధర్మ కార్యాలను బహిరంగా పాటిస్తారు. 'బారా షహీద్ మజార్ షరీఫ్'కు వచ్చే ప్రజలు తమ నమ్మకాల ప్రకారం నాణెల రూపంలో ఆ దర్గాలపై నాణెములను (చిల్లరడబ్బులు) విసురుతారు. దర్గాల నిర్వాహకులు దర్గాలపై నుండి రూపాయి లేక రెండు రూపాయి బిళ్ళలను తీసుకుని, ఎర్రటి లేక పచ్చటి రంగుల గుడ్డపేలికలలో చుట్టి, ప్రజల మూఢ నమ్మకాలను ఆస్రాగా చేసుకొని, ఆ ఒక్క రూపాయిని పది రూపాయిలకు లేక ఇరవై రూపాయిలకు విక్రయిస్తారు. ఎందుకంటే ఆ నాణెములను ప్రజలు పవిత్రధవనంగా నమ్మి వాటిని తమ దగ్గర ఉంచుకుంటే ధనంలో శుభాలు కలుగుతాయని నమ్మిస్తారు.

స్త్రీలు అధికమైన సంఖ్యలో అక్కడ సమావేశమవుతారు. ఎందుకంటే మూఢ నమ్మకాల వలలో స్త్రీలే అతి ఎక్కువగా చిక్కుకుంటారు. అలాగే ఇస్లాం ధర్మం తెలియని అజ్ఞాన ముస్లింలు మరియు బలహీన విశ్వాసులు అలాంటి మూఢ విశ్వాసాలకు తొందరగా ప్రభావితులవుతారు. ఎందుకంటే ఏదో విధంగా తమ అదృష్టాలను పరీక్షించుకొని, కష్టాలను దూరం చేసుకోవాలని వారి తపన. మన సమాజంలో అలాంటి మూఢ విశ్వాసాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. అల్లాహ్ మరియు తన ప్రవక్త నేర్పిన మన ఇస్లాం మతం వాటి విధులను పాటించకుండా  వారు దేశ, విదేశాల దర్గాలను సందర్శించి ఆరాధిస్తూ ఉంటారు.

కనుక అల్లాహ్ వాటిని ఖండిస్తూ ఇలా తెలియజేసాడు: إِنْ هِىَ إِلَّآ أَسْمَآءٌ سَمَّيْتُمُوهَآ أَنتُمْ وَءَابَآؤُكُم مَّآ أَنزَلَ ٱللَّهُ بِهَا مِن سُلْطَٰنٍ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَمَا تَهْوَى ٱلْأَنفُسُ ۖ وَلَقَدْ جَآءَهُم مِّن رَّبِّهِمُ ٱلْهُدَىٰٓ

 "ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి, తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింప జేయలేదు. వారు కేవలం తమ ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరుపునుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది”. (సూరతున్ నజ్మ్: 23)

అల్లాహ్ ఇలా తెలియజేసాడు: قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُمْ مِنْ دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِنْ شِرْكٍ وَمَا لَهُ مِنْهُمْ مِنْ ظَهِيرٍ

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా చెప్పండి: “అల్లాహు వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవ్వంత అధికారంగానీ వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్ కు సహాయకుడు కూడా కాదు” (సూరతుస్ సబా:22).

అల్లాహ్ ను మాత్రమే ప్రార్థించాలి. భయం, భక్తి, ఆశ, ప్రేమానురాగం, మొరపెట్టుకోవడం, అణుకువ, అశక్తత, శరణు వేడుకోవడం, జిబహ్ చేయడము, మ్రొక్కుబడులు చెల్లించడం, ఉపాధిని కోరడం వంటి కార్యాలన్నీ ఆరాధనలే. కనుక ఆ ఆరాధనలు అల్లాహ్ కు సమర్పించి ఆరాధించాలి. అల్లాహ్ ను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు.

అలాగని మేము పూర్తిగా అల్లా యొక్క అవ్లియాలను దర్శించకూడదు అని కూడా అనలేము. వారి యొక్క సమాధులను దర్శించుకొని వారి యొక్క హాజరలో ఆ అల్లాను ప్రార్థించాలి. వీరి యొక్క మహిమ వల్ల మన ప్రార్థనలు ఆరాధనలు తొందరగా స్వీకరించబడతాయి. వీటికి విరుద్ధంగా జరిగే ఆచారాలను మనము ఖండించాలి.

Files

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter