ఇస్లామీయ ప్రథమ మాసం ముహర్రం యొక్క ఘనత
ఇస్లామిక పంచాంగం ప్రకారం గురువారం 1445వ సంవత్సరం ప్రారంభమయ్యింది. ఇస్లామియా నెల ఆరంభం ఇస్లామియా క్యాలెండర్ యొక్క ఆరంభం ముహర్రం నెల ద్వారా అవుతుంది. అయితే ఈ ముహర్రం నెల 12 నెలల్లో నాలుగు గౌరవప్రదమైన నెల. అదే విషయాన్ని అల్లాహు తఆలా సూర తౌబా సూర సంఖ్య 9, శ్లోకం సంఖ్య 36 లో ఇలా ప్రస్తావించాడు,
إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّـهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّـهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
నిశ్చయంగా, నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర పన్నెండు నెలలు మాత్రమే. ఇది భూమ్యాకాశాలు సృష్టించిన దినం నుండి అల్లాహ్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాటిలో నాలుగు నిషిధ్ధ (మాసాలు). 27 ఇదే సరైన ధర్మం. కావున వాటిలో (ఆ నాలుగు హిజ్రీ మాసాలలో) మీకు మీరు అన్యాయం చేసుకోకండి.
ఆయత్ లోని మొదటి భాగం అల్లాహ్ వద్ద నెలల సంఖ్య ఎక్కువ కాదు తక్కువ కాదు. మరి ఈ విషయం గురించి అల్లాహ్ యొక్క గ్రంథంలో అంటే لوح محفوظ అందులో లిఖించబడి ఉన్నది. అల్లాహు తఆల అందులో ప్రస్తావించాడు. ఈ నెలల సంఖ్య ఎప్పటినుండి ఉంది? అల్లాహుతాలా భూమాకాశాలను సృష్టించినప్పటినుండి ఉంది. ఈ రోజుల్లో ఖురాన్ యొక్క ఈ శ్లోకం ఎవరైతే గ్రహించారో, తెలుసుకోరో అలాంటి కొందరు అజ్ఞాన ముస్లింల ప్రకారం ముహర్రం నెల కేవలం హజరత్ హుస్సేన్ (రదియల్లాహు అన్హు) యొక్క షహాదత్ ఆయన యొక్క అమర వీరులయ్యారో దానిని బట్టి ఈ నెలకి ఏదైనా ఘనత ఉందని భావిస్తారు. అయితే అలాంటి విషయం ఏమీ లేదు. స్వయంగా అల్లాహ్ తఅలా ఈ పన్నెండు నెలలను భూమాకాశాలు ఎప్పటినుండైతే సృష్టించాడో అప్పటినుండి వీటిని నెలకొల్పాడు. ఆ 12 మాసాల్లో నాలుగు మాసాలు గౌరవప్రదమైనవి.
ఇందులో ప్రత్యేకంగా ఒక ఆదేశం అల్లాహ్ మనకు ఇచ్చాడు. అదేమిటి فلا تظلموا فيهن انفسكم మీరు ఈ గౌరవనీయమైన మాసాల్లో స్వయంగా మీపై ఎలాంటి అన్యాయం చేసుకోకండి. అంతకు ముందే ముంది ذلك دين القيم, అదియే సరైన ధర్మం. ఈ శ్లోకంలో మనకు 12 మాసాలు ఉన్నాయని తెలిసింది. 12లో నాలుగు మాసాలు గౌరవప్రదమైనవి అని తెలిసింది. ఆ నాలుగు మాసాలు ఏమేమి సహీహ్ బుఖారి సహీహ్ ముస్లింలో హదీస్ ఉంది. ప్రవక్త చెప్పారు ذي القعده ذي الحجه محرم ఈ మూడు మాసాలు క్రమంగా ఉన్నాయి. నాలుగో మాసం జుమాదల్ ఆఖిరా మరియు షాబాన్ మధ్యలోని మాసం రజబ్. ఈ నాలుగు గౌరవప్రదమైన మాసాలలో ప్రత్యేకంగా ఎలాంటి అన్యాయం, బలవంతం చేయకూడదని అల్లాహుతఆల ఆదేశించాడు. విషయం ఏమిటంటే అన్యాయం ప్రతిరోజూ ప్రతి రాత్రి ప్రతి సమయంలో నిషిద్ధమే పోతే ఈ గౌరవనీయమైన మాసాల్లో ఇంకా దాని యొక్క నిషిద్ధత అనేది పెరిగిపోతుంది. సామాన్యంగా మనలో కూడా కొంత మంది మసీదులో ఉండి ఏదైనా అబద్ధం మాట్లాడుతుంటే అరే మసీదులో అబద్ధం మాట్లాడుతున్నావ్, అని అంటాము. దాని అర్థం బయట అబద్ధం చెప్పవచ్చు అని కాదు. మస్జిద్ కు ఏదైతే గౌరవ స్థానం ఉందో దానిని బట్టి ఇక్కడ ఆ నిషిద్ధత అనేది పెరిగిపోతుంది. అలాగే ఈ గౌరవప్రదమైన మాసాల్లో ఎలాంటి నిషిద్ధం చేయకూడదు.
ఒకరి నొకరు మరొకరిపై చేసే అన్యాయాలయితే మనకు తెలుస్తాయి. కానీ స్వయంగా మనిషి తనపై ఎలా అన్యాయం చేసుకుంటాడు. అల్లాహ్ యొక్క ఆదేశాలను ఉల్లంఘించి అల్లాహ్ నిశ్శబ్దపరిచిన కార్యాలను వాటికి పాల్పడి. అందువల్ల అతనిపై ఏదైతే శిక్ష పడుతుందో అది అతను స్వయంగా తనపై అన్యాయం చేసుకున్నట్లు. ఈ ముహర్రం మాసం యొక్క ఘనతలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క హదీస్ సహీహ్ బుఖారి పుస్తకంలో నెంబర్ 1163, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, أَفْضَلُ الصِّيَامِ بَعْدَ رَمَضَانَ شَهْرُ اللَّهِ الْمُحَرَّمُ. రమదాన్ తర్వాత అతి ఉత్తమమైన ఉపవాసాలు అల్లాహ్ యొక్క మాసమైన ముహర్రం మాసం. ఇందులో ఉండే ఉపవాసాలు విధిగా ఉన్నాయి. అయితే రమదాన్ తర్వాత అతి ఉత్తమ ఉపవాసాలు అల్లాహ్ యొక్క మాసమైన ముహర్రంలోని ఉపవాసాలు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారు. ఈ మాసానికి అల్లాహు తఆల యొక్క మాసం అని ప్రవక్త చెప్పారు.
ఇదే ముహర్రం మాసంలో పదో తారీకు సామాన్యంగా దానిని ఆషూరా అని అంటారు. ఆషురా 10వ రోజుకి మరింత ఎక్కువగా ప్రాముఖ్యత, ఘనత ఉంది. ఈ ఘనత స్వయంగా అల్లాహ్ దేనికి ప్రసాదించాడు. చారిత్రకంగా చూసుకుంటే ఫిరౌన్ లాంటి దౌర్జన్యరాజు మరియు అతనిని వెంబడించిన వారు అతని యొక్క అన్యాయాలు అతని యొక్క అతన్ని అనుసరించిన వాళ్ళు ఇదే పదో తారీకున అల్లాహ్ సముద్రంలో ముంచేసి ఎవరైతే బాధితులుగా ఉండిరో ఫిరౌన్ ఎవరికైనా దౌర్జన్యం చేశాడు. బని ఇస్రాయిల్ వారిని అదే సముద్ర నుండి అల్లాహుతాలా దారి చూపించి బయటికి తీసుకొచ్చాడు. ఆరోజు ముహర్రం 10 వ తారీకు అందుగురించి కూడా మూసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క కృతజ్ఞతగా ఈరోజు ఉపవాసం ఉన్నారు. అయితే మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారు కూడా ఆషూరా యొక్క ఉపవాసం చాలా ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధతో ఉండేవారు. దీని గురించి హదీస్ సహీహ్ బుఖారి లో హదీస్ నెంబర్ 2006 సహీహ్ ముస్లింలో హదీస్ నెంబర్ 1132 హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, مَا رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَتَحَرَّى صِيَامَ يَوْمٍ فَضَّلَهُ عَلَى غَيْرِهِ، إِلاَّ هَذَا الْيَوْمَ يَوْمَ عَاشُورَاءَ وَهَذَا الشَّهْرَ. يَعْنِي شَهْرَ رَمَضَانَ.. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆషూరా దినం మరియు రమదాన్ మాసం తప్ప మరే రోజు ఘనత గలదిగా భావిస్తూ పుణ్యఫలాపేక్షతో ఉపవాసం ఉన్నది నేను చూడలేదు, అని హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు గారు తెలుపుతున్నారు.
రమదాన్ ఉపవాసాలు విధిగా ఉన్నందున ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు పాటించే ఉపవాసాలు పాటించేవారో అలాగే ఈ ఆషూరా యొక్క ఉపవాసం చాలా చాలా ఘనత గలది గనక ప్రత్యేకంగా ప్రవక్త సల్లల్లాహు గారు ఎంతో పుణ్యఫలాపేక్షతో పుణ్యం సంపాదించే ఉద్దేశంతో ఈరోజు ఉపవాసం ఉండేవారు. ఈ అషూరా (పదో తారీఖున) ప్రవక్త సలసలామ్ గారు ఉపవాసం ఉండడానికి ఎంతో ప్రయత్నించేవారు అని ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు కూడా ద్వారా మనకు తెలిసింది. అయితే మనం ఉపవాసం ఉంటే లాభమేంటి. హజరత్ ఖతాదా రదియల్లాహు అన్హు గారి హదీస్ లో ఉంది, أَن رسول الله صلى الله عليه وسلم سئل عن عاشوراء ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారితో ఆషూరా ఉపవాసం గురించి ప్రశ్నించబడినప్పుడు يكفر السنه الماضيه అని ప్రవక్త గారు చెప్పినారు. అది గత సంవత్సర పాపాలకు పరిహారంగా అవుతుంది. ఈ ఒక్క ఉపవాసానికి బదులుగా గత ఒక సంవత్సరం పాపాలు మన్నించబడతాయి. ఈ ఉపవాసాల వల్ల ఒక సంవత్సరపు పాపాలు ఏవైతే మన్నించబడతాయో అవి చిన్న పాపాలు.