రంజాన్ మాసంలో ప్రవక్త గారి ఉపదేశం (మొదటి భాగం)
రంజాన్ హృదయాల శాశ్వత వసంతం. దివ్య ఖురాన్ యొక్క అవతరణ జరిగిన శుభ మాసం. ఈ మాసం రాకతో స్వర్గపు ద్వారాలు తెరుచుకుంటాయి. నరకపు ద్వారాలు మూయబడతాయి. సైతాన్లు ఖైదీలు అవుతాయి మరియు ప్రతి విశ్వాసి ప్రార్థన వైపు పరుగులు తీస్తాడు. ఈ నెల మొత్తంగా ఆ పరుగులతో ఉపవాసాలు కూడా తోడుగా ఉంటాయి. ఈ పరుగులు మనకు చివరికో పెద్ద పుణ్యంగా మారి చివరికి సాఫల్యాన్ని చేజిక్కిస్తాయి.
హజరత్ సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు) గారి కథనం మేరకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు షాబాన్ యొక్క ఆఖరి రోజు, రంజాన్ యొక్క రాకపై ఇలా ప్రసంగంలో సెలవిచ్చారు: ఓ ప్రజలారా! మీరో గొప్ప అరుదైన మాసాన్ని చేజిక్కించుకోబోతున్నారు. ఆ పుణ్య మాసంలో "షబ్బేఖధర్" అంటూ ఒక రాత్రి దాగి ఉంది. అది 1000 నెలలకు పైగానే ఉత్తమం. రోజులు కాదు! వారాలు కాదు! ఏకంగా 1000 నెలలకు పైగానే దాని విలువ ఉన్నది. ఈ మాసంలో అల్లాహ్ మనపై ఉపవాసాలను విధి (ఫరజ్) గా పరిగణించాడు. దీనిలోని వెన్నెల రాత్రుల్లో మసీదుల యందు తరావీహ్ ప్రార్థన చేయడం నఫిలుగా పరిగణించాడు (నిర్ణయించాడు), తోడుగా దానికెంతో పేద్ద పుణ్యాన్ని కూడా పెట్టాడు. ఎవరైనా ఈ పవిత్ర మాసంలో అల్లాహ్ యొక్క సమ్మతాన్ని (రిజాను) లేదా ఆయన వద్దకు చేరాలని ఏదైనా సున్నత్ లేదా నఫిల్ ప్రార్థన చేసినచో, అతనికి మరుసటి అనగా రాబోయే కాలంలో విధి ప్రార్ధనలను అమలు చేసినంత పుణ్యం దక్కును. అంతేకాక ఈ నెలలోని విధి ప్రార్ధనలను అమలు చేయడంతో దానికి బదులు ఎంతో తీయనైన మధురమైన ప్రతిఫలాన్ని పొందును! అదే 70 విధి ప్రార్ధనల ప్రతిఫలం.
ఇది ఓర్పుగా ఉండవలసిన నెల. ఆ ఓర్పుకు ప్రతిఫలంగా ఏకంగా స్వర్గమే దక్కును. ఇది చాలా కరుణమైన మరియు విజయాన్ని చేజిక్కించుకొనే మాసం. అంతేగాక ఈ మాసంలోనే విశ్వాసులకు చాలా ఎక్కువగా కోరినది (రిజ్ఖ్) ఇవ్వబడుతుంది. ఈ మాసంలో ఎవరైనా ఒక ఉపవాసకి, అల్లాహ్ యొక్క సమ్మతం లేదా పుణ్యం పొందడానికి ఇఫ్తార్ చేయిస్తే, అతను తన పాపాల నుండి క్షమింపబడి, ఇక ఏకంగా నరకాగ్ని నుండి మోక్షం పొందుతాడు. ఇంకా ఉపవాసికి ఎంతైతే పుణ్యం దక్కనుందో, అంతే అతనికి కూడా దొరుకును. అలాగని ఉపవాసం యొక్క ప్రతిఫలంలో ఎటువంటి కమీ చేయరాదు. ఆ సమయాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చే అడగసాగారు: మరీ పేద ప్రజలు అంతటి పెద్ద ప్రతిఫలం పొందుటకు అర్హులు కారా! దానికి జవాబులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు: ఏ ఒక్క మనిషైనా సరే! అంతటి ప్రతిఫలానికి అర్హుడే! ఎవరైనా కేవలం ఒక ఖర్జూరపు ముక్కైనా లేదా కేవలం ఓ గుటక పాలు లేదా ఆఖరికి నీళ్ల చేతే ఇఫ్తార్ చేయించినా, ఇంతటి పెద్ద ప్రతిఫలానికి అర్హుడే. ఇంకా ఎవరైనా ఒక ఉపవాసికి నీళ్లతో దాహం తీరిస్తే, ప్రళయ దినాన అల్లాహ్ తఆలా అతనికి నా తొట్టి (హౌజ్) కౌసర్ లో ఉన్న పానీయం తాగిస్తాడు. దాని చేత అతనికి స్వర్గాన్ని చేరుకునే వరకు దాహం అనే మాటే రాదు.
దాని తర్వాత ఇలా సెలవిచ్చారు: ఈ పుణ్య మాసం మూడు మహోన్నత భాగాలను కలిగియున్నది.
- మొదటి పది రోజులు అల్లాహ్ తన గొప్ప కరుణను కురిపిస్తాడు.
- పశ్చాత్తాపల చేత మన్నింపజేసేవి మరియు
- నరకాగ్ని నుండి విముక్తి కల్పించేవి.
అంతేకాక, ఈ పవిత్ర మాసంలో ఎవరైనా తమ బానిస యందు దయ చూపించి, కొంతైనా వారిపై పని భారాన్ని తగ్గిస్తే, అతనిని అల్లాహ్ తఆలా తప్పక క్షమిస్తాడు మరియు నరకాగ్ని నుండి అతన్ని మోక్షం ప్రసాదిస్తాడు.
దాని తర్వాత ఇలా సెలవిచ్చారు: ఈ పవిత్ర మాసంలో నాలిగింటిపై బాగా శ్రధ్ధ చూపండి. రెండిటితో తమరు తమ దేవుణ్ణి రాజీ పరచగలరు . మరో రెండిటితో ఏకంగా సాఫల్యాన్నే పొందగలరు.
- స్వచ్ఛతా వాక్కు! అనగా (కలిమాయే తొయ్యిబా మరియు క్షమాపణ కోరడం!. ఈ రెండిటిని ఎక్కువగా చేయడం వలన తమ దేవుణ్ణి తమతో రాజీపరచగలరు!.
మరో రెండు :1. స్వర్గం కోసం అభిలాషింటడం! మరియు 2. నరకాగ్ని నుండి పశ్చాతాపన పడడం. ఈ రెండిటిని ఎక్కువగా చేయడం వలన ఏకంగా సాఫల్యాన్ని చేజిక్కించుకుంటారు.