రంజాన్ మాసంలో ప్రవక్త గారి ఉపదేశం (రెండవ భాగం)
ఇంతటి సుదీర్ఘ హదీసు ద్వారా ఒక్క మాట మనకు బాగా అర్థమవుతున్నది! ఏమనగా, రంజాన్ మాసాన్ని పొందడం, దీనిని దక్కించుకోవడం మరియు ఇంతటి అదృష్టం కలగడం...... ఇదంతా ఆ అల్లా యొక్క దయ మరియు కరుణే. కనుక, ఈ రంజాన్ మాసాన్ని పొందిన ప్రతి ముస్లిం హర్షాన్ని వ్యక్తం చేయాలి. ఎందుకంటే, ఇది ఉపవాసాల మాసం, ఖురాన్ పారాయణ మాసం, దేవుడు కరుణించే మాసం మరియు పశ్చాతాపాన్ని అంగీకరించి మన్నింపజేసే మాసం!
అంతేకాక ఈ మాసంలో అడిగిన వారికి కాదనకుండా అందజేసే మాసం! అందుకోసమే ఈ మాస ఆతిథ్యం కోసం సన్నాహాలు ఎంతో ఘనంగా చేయాలి మరియు చాలా పుణ్యకార్యాలు అమలు చేస్తూ ఉండాలి.
- గొప్ప మరియు అరుదైన మాసం: మొట్టమొదటిగా మనం, మన హృదయాలలో రంజాన్ యొక్క ప్రాముఖ్యత మహిమ మరియు దాని యొక్క గొప్పతనం గురించి బాగా తెలిసి ఉండాలి. నమాజ్, ఉపవాసం మరియు సజ్దా ఈ విధమైన ప్రార్థనలను చాలా తాజాగా కొత్తగా తమ జ్ఞాపకంలో ఉంచుకోవాలి మరియు తమ లోపల తఖ్వా పుట్టించే గట్టి నమ్మకాన్ని ఉంచాలి! అది ఉపవాసాలను పాటించినచో లభిస్తుంది.
- సహనం: ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారు తమ ప్రసంగంలో ఇలా సెలవిచ్చారు: రంజాన్ పవిత్ర మాసంలో సహనం కలిగే ఉండాలి. ఇది బాధలను పంచుకునే మాసమని మరియు అల్లాహ్ రాజీ పరచటానికి మనం, మనసు మాటలను వినకూడదని చెప్పారు. ఇంకా ఉపవాసపు సమయాన పుట్టే ఆకలి యొక్క స్పర్శతో షావుకారు లైనా, ఫకీర్లైనా, బీదవాళ్లైనా........ అందరూ ఒక్కరే అన్న ఆలోచన లోపలి నుండి పుట్టుకొస్తుంది. ఆ ఆకలిని సహించి ఆహార పానీయాల నుండి దూరంగా ఉండాలి. రాత్రిపూట తరావీహ్ ప్రార్థనలో పాల్గొనడం, అందులో పవిత్ర ఖురాన్ని పూర్తిగా చదవడం తహజ్జుద్ నమాజ్ చదవడం, సహరీ సమయాన మేల్కొని ఉండడం..... వీటన్నిటి ద్వారా మనకు రంజాన్ లో సహనం పాటించి, ఆరోగ్యంగా, సుఖశాంతులతో ఉండవలసిన మాసమని బాగా స్పష్టంగా అర్థమవుతుంది.
- బాధలను సహించడం: ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు ఇలా సెలవిచ్చారు: ఈ మాసం బాధలను సహించవలసినది. ఇందులో పరస్పరంగా ఒకరికొకరు మంచిగా మసులుకోవాలి మరియు ఇఫ్తారీలో మీ ఎదుట ఐదు, ఆరు పదార్థాలు ఉంటే, తప్పక దాని నుండి ఓ పదార్థాన్ని పేదవారికి ఇచ్చి తీరాలి! లేదా సమానంగా పంచుకోవాలి. ఎప్పటి వరకైయితే తమరు తమకిష్టమైన పదార్థాన్ని పంచరో, అప్పటివరకూ మీరు ఎటువంటి పుణ్యకార్యం చేయనట్లే లెక్క. ఎలాగంటే తమ ఇంట్లో వారు ఎవరైనా సరే, ఆకలిగా ఉంటే వారికి లేదా పేద ప్రజలకు ఇవ్వడం మంచిది. ముందే ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పైగా ప్రస్తుతం రంజాన్ పవిత్ర మాసం కూడానూ. కుదిరితే ఆ నిస్సహాయస్థితి ప్రజలనన్నా ఆరాదీసి చేతనైనంత తినిపించాలి, త్రాగించాలి మరియు ఆఖరిన ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం వారి వద్ద కాలం గడిపేంత భాగ్యం పొందాలి.
- భాగ్య కల్పన (రిజ్ఖ్): ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు: రంజాన్ లో విశ్వాసులకు (రిజ్ఖ్) భాగ్య కల్పన చాలా ఎక్కువగా భాగ్యమవుతుంది. ఒకవేళ అతను పేద ముస్లిమైననూ అవుతుంది. అంతేకాక ఏ ఒక్కరూ కొంత తిన్నా కూడా సరే వారు ఆకలితో మాత్రం ఉండరు గాక ఉండరు. ماشاء الله
- ఇఫ్తారీ చేయించే ప్రతిఫలం: ఎవరైనా ఓ ఉపవాసకి ఇఫ్తారీ యొక్క బందోబస్తు చేస్తే, అతనికి అల్లాహ్ తరపు నుండి మూడు వస్తువుల భాగ్యం కలుగును.
1) పాపాల మన్నింపు!
2) అల్లా నరకాన్ని తమ శరీరం నుండి వ్యర్థ పదార్థంగా చేస్తాడు. అనగా మన శరీరాన్ని అందులో ప్రవేశపెట్టడు గాక పెట్టడు,
3) ఉపవాసి ఎంత అయితే పుణ్యాన్ని పొందాడో అతను కూడా అంతే పుణ్యానికి అర్హుడవుతాడు.
ఆ సమయాన హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులు ఇలా చెప్పసాగారు: మాలో నుండి ప్రతి ఒక్కరు అయితే మాత్రం కడుపు నింపేంత ఇఫ్తారీ ఏర్పాటు చేయలేరు! అప్పుడు మేమేం చేయగలం? అప్పుడు ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారు జవాబులో ఇలా సెలవిస్తిరి: ఓ ఖర్జూరు ఇవ్వండి! ఓ గుటక పాలు ఇవ్వండి మరియు ఒక్క గుటక లస్సి ఇవ్వండి. అంతేకాక బావిలోని నీళ్లు లేదా కొళాయికి వచ్చే నీళ్లలోనే ఏదో ఒక గుటక తెచ్చి ఉపవాసి ఎదుట పెట్టి ఇఫ్తారీ చేయించినచో అల్లాహ్ తఆల అతనికి ఇఫ్తారీ చేయించినంత పుణ్యాన్ని తప్పక ఇస్తాడు.
పవిత్ర రంజాన్ మాసంలో మూడు మహోన్నత భాగాలు ఉన్నాయి: 1) కరుణ 2) మన్నింపు మరియు 3) నరకాగ్ని నుండి మోక్షం
మొదటి భాగమైన కరుణ సమయంలో ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు చిన్నచిన్న తప్పులు కూడా చేయరు. మరియు రెండవ భాగంలో వారి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారి నుండి మన్నింపబడతాయి మరియు మూడవది నరకాగ్ని నుండి విముక్తులై స్వర్గంలో ప్రవేశిస్తారు. దానికి కారణం కూడా రెండవ పది దినాలలో అయి ఉంటుంది.