ముస్లిం తన ఇస్లామిక్ జీవితంపై మరింత శ్రద్ధ వహించాలి
ఇస్లాం వల్ల ఈ ప్రపంచం నడుస్తుంది. ఎందుకంటే 14 వేల సంవత్సరాల ముందు ప్రస్తావించిన మాటలను ఇప్పుడు ప్రపంచంలో వాడుతున్నారు కానీ మన ముస్లింలు ఎంతో వెనక్కున్నారు.
ముస్లింలు ఎప్పుడు చూసినా ఈ ప్రపంచం వెనుకే పరుగులు తీస్తున్నారు. డబ్బుకోసం ప్రాణాలనే అర్పిస్తున్నాను. మహాహారాలు విలువైన వస్తువులు కొంటున్నారు. ఎంతోమంది తిండిని పారేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఇది తెలీదు ఎంతోమంది ఆకలితో కన్నుమూసేస్తున్నారు అని. వచ్చే కాలంలో మన పిల్లలకి అన్నం కూడా దొరకదు. ఎందుకంటే ఇప్పుడు చాలా పొలం కోసం మందులు వాడి మట్టిని కూడా మందు చేసేస్తున్నారు. ఇది అంతా అమూల్య ఆహారాల కోసమే కదా! ఏదైనా తింటే దాని రుచి గొంతు వరకే, ఆ తర్వాత అంతా మట్టిలో కలిసిపోతుంది. అందుకే ఒక కవి అరబీలో ఇలా అన్నారు జైనుద్దీన్ అల్ మఖ్దూమ్
" واقنع بترك المشتهى والفاخر
من مطعم و ملابس ومنازلا"
భావం: మీ ఆశలను వదిలేయండి మరియు పెద్ద పెద్ద ఆహారాలు బట్టలు మరియు ఇల్లుని వదిలేయండి.
ఇలా గనక మేము చేస్తే భవిష్యత్తులో కూడా అందరికీ అన్నం చాలా సులభంగా దొరుకుతుంది. మనుషులు డబ్బు అన్న వాళ్ళ దగ్గరే ఉంటారు డబ్బునే వాళ్ళ ప్రాణం అనుకుంటారు కానీ అల్లాహ్ ఇలా ప్రస్తావించాడు.
إن أکرمکم عند الله أتقاکم
"బేషుగ్గా అల్లాహ్ దగ్గర అత్యుత్తమ వారు తఖ్వాతొ ఉన్నవారు."
అల్లా డబ్బు ఉన్న వాడిని అనలేదు, తఖ్వాతో ఉన్నవాడిని అత్యుత్తమ మనిషిగా గుర్తించాడు.
మన ముస్లింలు చదువులో కూడా ఎంతో వెనక్కున్నారు. ఎంత వెనక్కున్నారంటే తమ మతానికి ఐశ్వర్యం కూర్చే మాట రద్దు చేస్తుండగా కూడా న్యాయస్థానంలో జరుగుతున్న హిజాబు గురించి దానికి ఎదురుకోవడానికి ఒక మంచి వకీలు లేరు. మన మదర్సాల్లో చదివే పిల్లలు కూడా పెద్ద పెద్ద వస్తువులు కొని ఒక డబ్బులు కలిగిన జీవితాన్ని గడుపుతున్నారు. కొన్ని మొదటి సారిలో అయితే మత చదువు మాత్రం చదివించడం వలన మన ముస్లింలు ఎంతో వెనక్కున్నారు ఒక పుస్తకంలో ఇలా రాసి ఉంది.
"أفضل العلم علم الحال"
"అత్యుత్తమ చదువు ప్రస్తుత చదువు"
అనగా ఖురాన్ హదీస్ తర్వాత అత్యుత్తమ చదువు అక్కడ అవసరమైన చదువు ఎంతో మంది ముస్లింలు చదవడం లేదు. వాళ్లకోసమే ఒక ఆయతులు అల్లాహ్ ఇలా ప్రస్తావించాడు.
قل هل يستوى الذين يعلمون والذين لا يعلمون
"ఓ ప్రవక్త మీరు చెప్పండి చదువు తెలిసినవాడు మరియు తెలియనివాడు ఒక్కరు అవ్వగలరా".
ఇక్కడ మనము ఆలోచించాలి.
ఇప్పుడు మన ఇస్లామీయ రాష్ట్రాల్లో కూడా అమ్మాయిలు పద్ధతి లేకుండా తిరుగుతున్నారు. ప్రపంచంలో ఇప్పుడు వ్యభిచారం పెరిగిపోతుంది. దీని గురించి అల్లాహ్ ముందే చెయ్యొద్దు అన్నాడు. కానీ వినకుండా అలాగే చేసుకోవడం వలన ఒక శిక్షను కూడా పంపాడు. AIDS అనే ఒక పెద్ద రోగం భయంకరమైన రోగం అది రుచితో మొదలై మీ ప్రతి నర నరాన్ని చీల్చి పెట్టేస్తుంది దాని ముందు ఇప్పుడు వరకు కూడా ఎవరు మందు కనిపెట్టలేకపోయారు మనుషులు.
ఇంత చేసిన తర్వాత కూడా అల్లాహ్ మన కోసం వాళ్ళ పాపాల్ని కడుక్కోవడం కోసం మంచి మనసుతో ఒకవేళ తోబా చేసి వారికి వాల్ల పాపాలని కూడా క్షమించేస్తాను అని అన్నాడు. కానీ మేము అల్లాహ్ తో భయపడం. మేము ఒక పాము వస్తే భయపడతాం, ఒకరు కొడితే భయపడతాం, మబ్బులో పోతే భయపడతాం, ఇవన్నీ మమ్మల్ని చంపేయవు. కానీ మమ్మల్ని సృష్టించినవాడు మా ప్రాణాలు ఎవరి చేతుల్లోనైతే ఉన్నాయో ఆయనతో మాత్రం భయపడరు.
అల్లాహ్ మమ్మల్ని మంచినీ చేసి చెడుని నిషేధించేందుకు మరియు బాగా చదివేందుకు టోపీకి ఇవ్వాలని కోరుకుంటున్నాను.
آمين