రబీ ఉల్ అవ్వల్ మరియు ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క జననం
రబీ అల్ అవ్వల్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్‌లో 3వ నెల, దీనిని హిజ్రీ క్యాలెండర్ అని కూడా పిలుస్తారు. రబీ అనే పదం అరబీ నుండి వచ్చినది. అంటే వసంతం అని అర్ధం. రబీఉల్ అవ్వల్ అనగా వసంత కాల ప్రారంభం అని అర్ధం. ఇస్లాం దృష్టిలో ఈ నెలకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మన ప్రభువు అయిన అల్లాహ్ మనకోసం రంజాన్ నెలలో ఉపవాసం పెట్టమని ఆదేశించి ఆ నెలకు చాలా ప్రాధాన్యతను ఇచ్చాడు అలాగే షవ్వాల్, జుల్ ఖా’దా మరియు జుల్ హిజ్జాలో మక్కా ప్రదక్షణ చేయమని ఆదేశించి ఆ నెలకు ప్రాధాన్యతను ఇచ్చాడు. అదే విధంగా మన జీవితలో నిజమార్గం చూపడానికి పంపబడ్డ ప్రవక్తలలో అత్యంత ఉత్తమమైన మహా ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) ఈ భూలోకంలోజననం పొందారు. అందువలన ఈ నెలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది.
ఈ నెలలో మన చివరి ప్రవక్త(صلى الله عليه وسلم)ను ఈ ప్రపంచానికి పంపడానికి గల కారణం ఏమనగా ఈ వసంత కాలంలో “మక్కా” అనే నగరంలోని ఎవ్వరూ ఇంటి నుండి బయటకు వచ్చే వారు కాదు. అంతే కాకుండా ఆ నగరంలో అల్లాహ్ ను వదిలి ఇతర బొమ్మలను, విగ్రహాలను మరియు శిల్పాలను కట్టి వాటిని పూజించేవారు, అంతేకాదు మన ముస్లిం ప్రజల దైవ స్థలం కాబాలో కూడా వాటిని పెట్టి పూజించే వారు.
ఆ సమయంలో అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم)ను ఈ నగరంలో పుట్టించారు, వారు పుట్టిన మరుక్షణమే కాబాలోని 313 శిల్ప విగ్రహాలు కుప్ప కూలిపోయాయి. ఈ సంఘటన మామూలు దినాలలో జరిగి ఉంటే ఎవరో వచ్చి ఈ విగ్రహాలను విరక్కొట్టి పోయారు అని అనుకుంటారు, కానీ రబీ ఉల్ అవ్వల్ (ఈ నెలలో ఎవ్వరూ ఇంటి నుండి బయటకు రారు) లో ప్రవక్త వచ్చిన సందర్భంగా వాటికై అవే స్వయంగా కుప్పకూలీ పోయాయనే నమ్మకం మన ముస్లిం ప్రజలలో ఏర్పడుతుంది.
ప్రియ ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) మన ప్రపంచానికి రాక ముందు ప్రజలు తమ నిజ మార్గాన్ని వదిలి ఇతర మార్గాల్లో దూరి మన ప్రభువుని వదిలి ఇతర బొమ్మలను పూజించే వారు, చిన్న పసిపాపల పుట్టుకతోనే వారిని చంపేసే వారు, ఎవరైనా చనిపోతే వాళ్ళ భార్యాలను బ్రతికుండాగానే సమాధిలో పాతేసేవారు మరియు చిన్న చిన్న మాటలలో 40 సమాత్సరాల వరకు గొడవలు మరియు యుద్ధాలు చేసేవారు. ఇటువంటి మూర్ఖత్వంతో నలిగి కరిగి చెడిపోతున్న ఈ లోకంలో దివ్య కాంతితో ప్రకాశమైన మహా ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) రాకతో ప్రపంచ చరిత్రే మారిపోయింది.
ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) యొక్క జననం రబీ ఉల్ అవ్వల్ 12 వ తేదీ సోమవారం రోజున ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) ఆమినా రజి అల్లాహు అన్హా కడుపున పుట్టారు. ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) వచ్చిన 40 సంవత్సరాల తరువాత అల్లాహ్ వారిని తన ప్రవక్తగా నిశ్చయించారు. మరియు ఇస్లాంను ప్రపంచ నలుమూలల వ్యాపించే బాధ్యతను వారికి అప్పగించారు. వారిని ప్రవక్తగా నమ్మి స్వర్గం దారిన నడిచిన చాలా మంది వారికి అనుచరులుగా మారిపోయారు.
వారు పుట్టిన రోజుని మన ముస్లిం సహోదరులు ఒక పండుగగా భావిస్తారు. అంతే కాకుండా ఆ రోజున పెద్ద పెద్ద కార్యక్రమాలను నిర్వహించి ప్రవక్త ముహమ్మద్ (صلى الله عليه وسلم) మీద ఉన్న ప్రేమను ప్రదర్శిస్తారు. మన భారత దేశంలో చూసినట్టైతే ప్రజలు ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు ప్రతి రోజు రాత్రులు మౌలిద్, సలాం, దరూద్ చదివి అల్లాహ్ను ప్రవక్త ప్రేమ పెంచమని ప్రాధిస్తారు.
అల్లాహ్ మమ్మల్ని కూడా ప్రవక్త ప్రేమపై ఏమైనా పని చేయడానికి అవకాశం ఇవ్వు గాక.
ఆమీన్ , ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్......