ఇస్రా మరియు మేరాజ్
ఈ సర్వలోకాల అధినేత అయిన అల్లాహ్ మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు రెండు సంతోషాలను ప్రసాదించాడు అవేమిటంటే అందరికీ తెలిసిన విషయమే! అవే రెండు యాత్రలు. ఇస్రా మరియు మేరాజ్. ఈ సంతోషకరమైన యాత్రలకు ముందుగా మన ప్రియ ప్రవక్తకు కొన్ని దుఃఖాలు కూడా సంభవించాయి. అవి:
మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం మతాన్ని అభివృద్ధి చేయడంలో చాలా కష్టాలను సహించారు మరియు మతం మక్కాలో అభివృద్ధి కావడంతో అక్కడి అముస్లిములు మరియు ఖురేష్ రాజులు ముస్లిములతో పూర్తి సంబంధాలను తెగింపు చేసుకున్నారు. తరువాత వారికి నీరు తిండి ఏవి దొరకేవి కావు. కావున మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారి యొక్క తెగతో పాటు ఒక కొండపై వెళ్లి అక్కడే నివసిస్తుండేవారు. దీనివల్ల మూడు సంవత్సరాలు వరకు ఆకులు అలమలు తింటూ జీవితాన్ని గడిపేవారు. కొద్ది రోజులు తర్వాత మన ప్రియ ప్రవక్త యొక్క చిన్నాన అబూ తాలిబు మరణిస్తారు.వీరు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు సల్లం యొక్క ప్రతి కష్టంలో సహాయం చేస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుండేవారు. ఈ సంఘటన యొక్క మూడు రోజుల తర్వాత మన ప్రవక్త యొక్క ధర్మపత్ని అయిన ఖదీజా (ర) కూడా మరణిస్తారు. ఒకవైపు మన ప్రియ ప్రవక్త ఇస్లాం మతాన్ని పెంచాలనే తపన, మరో వైపు మక్కాలో శత్రువులు రోజురోజుకీ పెరుగుతున్నారు దానికి మన ప్రియ ప్రవక్త వారి మామ గారి ఊరికి వెళితే, అక్కడ ప్రజలు అల్లరి పిల్లలను మరియు పిచ్చివారిని పట్టిస్తారు.
వాళ్లు మన ప్రవక్తపై రాళ్లతో దాడి చేశారు. దీనితో ప్రవక్త గారి కాళ్లు చాలా గాయపడ్డాయి మరియు రక్తం కార్యాల చేశారు. దీనితో ఆ అల్లా ఒక దైవదూతను మన ప్రవక్త దగ్గరికి పంపిస్తారు. అప్పుడు ఆ దైవదూత మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ఇలా అనుమతి అడుగుతారు: ఓ ప్రవక్త మీరు సెలవివ్వండి, ఆ అల్లా యొక్క ఆజ్ఞతో వీరందరినీ ఈ రెండు కొండల మధ్య నాశనం చేస్తాను. అప్పుడు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపేయొద్దు, బహుశా వీరు కాకుంటే తర్వాత వచ్చేవారు విశ్వసించే అవకాశం ఉంది. దీనితో మన ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం యొక్క దుఃఖాలు ముగిసిపోతాయి.
ఆ అల్లాహ్ మన ప్రియ ప్రవక్తకు కేవలం దుఃఖాలే కాదు సంతోషాన్ని కూడా ప్రసాదించారు. వాటిని ఇస్రా మరియు మేరాజ్. ఇస్రా మరియు మేరాజ్ అంటే రెండు యాత్రల పేర్లు.
అల్లాహ్ మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు దుఃఖాలు ఇచ్చిన తరువాత రెండు సంతోషాలను కూడా ప్రసాదించారు అవే రెండు యాత్రలు.
ఇస్రా అనగా మక్కా యొక్క మసీదుల్ హరాం నుండి ఫలస్తీని యొక్క మసీదులు అక్సా వరకు
మరియు మీరాజ్ అనగా మసీదుల్ అక్సా నుండి సప్తగగనాల వరకు చేసిన యాత్రను మీరాజ్ అంటారు.
ఒకరోజు రాత్రి మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు సల్లం వారి చిన్నన్న కూతురి నిలయం వద్ద నిద్రపోతూ ఉంటే అప్పుడు అల్లాహ్ యొక్క దైవదూత అయిన జిబ్రాయిల్ అలైహి సలాం వస్తారు. వారి వెంటే ఒక తెల్లటి జంతువును తీసుకొస్తారు. వచ్చిన తర్వాత మన ప్రియ ప్రవక్తను ఏ విధంగా నిద్ర నుంచి మేలుకొలపాలని ఆలోచిస్తారు. ఈ ప్రశ్నను అల్లాతో అడుగుతారు: ఓ అల్లాహ్! మీ ప్రవక్తను ఏ విధంగా నిద్ర నుంచి మేలుకొలపాలి". దీనికి అల్లా: మీయొక్క పెదవుల చేత ఆయన పవిత్ర పాదాలకు తాగించి మేలుకొలపండి" అంటారు. దైవదూతైన జిబ్రాయిల్ అలైహి సలాం ఇలాగే చేస్తారు.
తరువాత మన ప్రియ ప్రవక్త సల్లాలాహు అలైహి వసల్లం నిద్ర నుండి మేల్కొంటారు. మేల్కొన్న తర్వాత దైవదూత అయిన జిబ్రయిల్ ఏదైతే జంతువులను తీసుకొచ్చారు ఆ జంతువు ఎంత వేగంగా వెళుతుంది అంటే అది మన ఊహకు కూడా అందనంత వేగంగా వెళుతుంది ఈ జంతువు పేరు బురాఖ్. దీనిని జిబ్రాయిల్ అలహి సలాం స్వర్గం నుండి మన ప్రియ ప్రవక్త కొరకు అల్లా యొక్క ఆజ్ఞతో తీసుకువచ్చారు.
మన ప్రియ ప్రవక్త ముందుగా ఆ జంతువు మీద కూర్చుని మస్జిదుల్ హరాం నుండి మస్జిదుల్ అఖ్సా వరకు వెళ్తారు. అక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి ప్రవక్తలకు ఇమామ్ అవుతారు మరియు అల్లా కొరకు నమాజ్ చదువుతారు. దీని తర్వాత సప్తగగనాల యాత్రను ప్రారంభిస్తారు.
ప్రతి గగనంలోని దైవదూతలు మరియు ప్రవక్తలు మన ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం సుస్వాగతిస్తారు అంతేకాక మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు సల్లం అక్కడి నుండి స్వర్గం మరియు నరకం పై అలా అలా విహారించి వస్తారు మరియు కొన్ని పవిత్ర స్థలాల వద్ద కూడా వెళ్తారు ఇవన్నీ సందర్శించిన తరువాత చివరికి అల్లా వద్దకు వెళ్తారు మరియు వారితో సంభాషణ చేస్తారు.
సంభాషించిన తర్వాత మన ప్రియ ప్రవక్త తిరిగి వచ్చేటప్పుడు అల్లా కొరకు ఒక విలువైన బహుమతిని ఇచ్చారు. ఆ బహుమతి ఏమిటో తెలుసా అదే ఐదు పూట్ల నమాజ్. మొదటిగా అల్లాహ్ 50 పూటల నమాజ్ బహుమతిగా ఇచ్చారు.
తిరిగి వచ్చేటప్పుడు దారిలో మూసా అలైహి సలాం ఆపి: వెళ్లి అల్లాతో తగ్గించుకొని తీసుకురండి" అంటారు మనపై ప్రేమ వలన ప్రవక్త పెళ్లి తగ్గించుకుని వస్తే ఇంకా తగ్గించుకొని రండి అని కొన్నిసార్లు తిరిగిన తరువాత ఐదు పూట్ల నమాజ్ వరకు వస్తే అప్పుడు ప్రియ ప్రవక్త అంటారు: నా ఉమ్మత్ తప్పకుండా ఐదు పూట్ల నమాజ్ చదవగలరు అని చెప్పి ఆ విలువైన బహుమతిని తీసుకొని వస్తారు.
ఇంకొక్క విషయంn ఇస్రా మరియు మేరాజ్ యాత్రలు రజబ్ యొక్క 27వ తేదీన జరిగాయి. ఇది చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అది ఏమిటంటే ఈ ఇస్రా మరియు మేరాజ్ కేవలం ఒక రాత్రిలోనే జరిగాయి .