అమ్మ

అమ్మ

నా ఆనందం,నా బాధ నువ్వే అమ్మ

నువ్వు లేక ఈ లోకంలో నేలేనమ్మ

నా గాలి  నా  ఊపిరి  నీలోనమ్మ

నీ కోసం ఈ లోకాన్ని వదలానమ్మ

అమ్మ! అమ్మ! అమ్మ! అమ్మ!

 

ఆ త్యాగం ఆ కష్టం నీదేనమ్మ

ఆకలిని ఓర్పుగా మార్చి నన్ను పెంచావమ్మ

ఆ సమయం చాలా బాధను నే ఇచ్చానమ్మ

అయిన నాకోసం చాలా నువ్వు చేసావమ్మా

అమ్మ! అమ్మ! అమ్మ! అమ్మ!

 

ఎంత క్రూరంగ నిన్ను నే ప్రవర్తించాను

జంతువు కన్నా హీనంగా హింసించాను

నీకు ఎన్నో కష్టాలను తెప్పించాను

ఇన్ని జరిగాక నాతోనె ఉన్నావమ్మ

అమ్మ! అమ్మ! అమ్మ! అమ్మ!

 

బాధ కలిగింది నువ్వులేక నాతోట

విలువ తెలిసింది నువ్వులేక ఈ పూట

నువ్వు ఉన్నప్పుడు వినాలిసింది నీ మాట

ఎన్ని సంతోషాలను ఇచ్చేసి వేళ్ళావమ్మ

అమ్మ! అమ్మ! అమ్మ! అమ్మ!

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter