హిరా గుహలో

     మక్కా ముకర్రమాలో జబలున్నూర్ పేరు గల ఒక పర్వతం ఉంది, దానిలో హిరా పేరు గల ఒక గుహ ఉంది, మన ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ తరపు నుండి ఇస్లాం మతాన్ని విస్తరింపజేయాలన్న బాధ్యత దొరికింది, ఆ పని యొక్క ఆరంభం ఈ హిరా గుహ నుండే ఆరంభం అయ్యింది,

   ఒక్కోసారి మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు హిరా గుహ లోపలికి వెళ్లి ఏకాంతంగా కూర్చునేవారు, కొన్ని రోజులు అక్కడే గడపడానికి ఆహారం కూడా తెచ్చుకుంటుండేవారు, అదే గుహలో ఏకాంతంగా కూర్చుని అల్లాహ్ యొక్క ప్రార్థన కూడా చేస్తుండేవారు,

    ఒకరోజు అల్లాహ్ తరపు నుండి ఒక అద్భుతమైన సంఘటన జరిగింది, దేవుని ఆజ్ఞ చేత దేవదూత అయిన హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వద్దకు వచ్చి ఇలా చెప్పసాగారు, యా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం చదవండి, అప్పుడు మహా ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు, నేను చదివే వారిలో నుండి కాను, అంటే నాకు చదవడం రాదు, అప్పుడు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని బిగ్గరగా కౌగిలించుకొని వదిలిపెడతారు, మరియు ఇలా అంటారు, యా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇప్పుడైనా చదవండి అని అడుగుతారు, కానీ హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా జవాబు ఇచ్చారు, నేను చదువు లేని వాడిని, హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం సలాం గారు మళ్లీ పట్టుకొని తమ గుండెతో కౌగిలించి మళ్లీ అన్నారు, యా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదవండి, మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు, నేను చదివి లేని వాడిని, అనగా నాకు చదువు రాదని అర్థం, ఇక ఆఖరిసారిగా హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం మూడోసారి మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారిని పట్టుకొని మరియు గట్టిగా అరుస్తూ ఇలా అన్నారు,

 

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ ١

చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు! 1

خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ ٢

ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు, 2

اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ ٣

చదువు! మరియు నీ ప్రభువు పరమదాత,

الَّذِي عَلَّمَ بِالْقَلَمِ ٤

ఆయన కలం ద్వారా నేర్పాడు 3

عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ ٥

మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు,

      పైన ఇచ్చిన వాక్యాలు దైవ ఖురాన్ లో మొదట ఆరంభమైన వాక్యాలు, అది కూడా మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేత, ఇది విని మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు చదవసాగారు మరియు ఈ విధంగా వహీ(దైవవాణి) యొక్క ఆరంభం అయ్యింది, ఈ సమయంలో మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయస్సు 40 సంవత్సరాలు ఉండేది,

    వహీ అనగా హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం చేత ప్రవక్తలకు అల్లాహ్ తరపు నుండి ఏదైతే సమాచారం వస్తుందో ఇస్లాంకు సంబంధించి దానిని వహీ అంటారు,

    అల్లాహ్ తరఫునుండి వహీ రావడం వలన మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం వెళ్లిపోయిన తర్వాతధర ధర అంటూ వనక సాగారు, మళ్లీ అదే స్థితిలో ఇంటికి చేరుకున్నారు, ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే తమ సతీమణి అయిన ఖదీజా రదియల్లాహ్ అన్హాతో ఇలా సెలవిచ్చారు, నాకు కంబళి కట్టండి, నాకు కంబళి కట్టండి అప్పుడు వెంటనే ఖదీజా రదియల్లాహ్ అన్హా గారు కంబళి కప్పారు, వారి స్థితి యొక్క కారణమడిగింది, అయితే మహా ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం గారు సంఘటన మొత్తం వివరించారు మరియు ఇలా సెలవిచ్చారు, దీనివలన నా ప్రాణం పోతుందేమోనని అనుకుంటున్నాను, అని సెలవిచ్చారు,

అప్పుడు ఖదీజా రదియల్లాహ్ అన్హా ఇదంతా విని ఇలా చెప్ప సాగుతుంది, మీరు భయపడవద్దు, ఆ సర్వలోకాల అధినేత అయిన అల్లా మీకు ఏ హాని తలపెట్టారు, ఎందుకంటే, మీరు ఎల్లప్పుడూ నిజం మాత్రమే చెబుతారు, అనాథలకు సహాయం చేస్తారు, అతిథులను చాలా బాగా గౌరవిస్తారు మరియు ఎల్లప్పుడూ సరైన పద్ధతిలో నడుస్తారు, అల్లా తమను ప్రమాదంలో వెయ్యరుగాక వేయరు, ఈ విధంగా మన ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారి సతీమణి అయిన ఖదీజా రదియల్లాహ్ అన్హా గారు చాలా ధైర్యాన్ని ఇచ్చి వారికి కొంత ఉపశమనం అందించారు,

ఇదంతా చెప్పిన తరువాత ఖదీజా రదియల్లాహ్ అన్హా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తమ వెంట తీసుకుని తమ చిన్నాన్న తమ్ముడు దగ్గరికి తీసుకొని వెళ్లారు, వారు ఒక పెద్ద క్రైస్తవ పండితులు,

      హుజూర్ సల్లల్లాహు అలైహి వ సల్లం గారు వర్కత్ ముందు హిరా గుహలో జరిగిన సంఘటన మొత్తం వివరించారు, అప్పుడు వర్కత్ ఈ పూర్తి మాటలు విని ఇలా చెప్పసాగాడు,

ఇతనే ఆ పేరు గలవాడు ఎవరైతే హజరత్ మూసా అలైహి సలాం దగ్గరికి వచ్చాడు, జిబ్రాయిల్ అలైహిస్సలాం, ఏ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం, మీకు ఒక సంతోషకరమైన వార్త, అదేమిటంటే మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త,రసూల్, మరియు ఇంకొక బాధాకరమైన వార్త కూడా ఉంది, అదేమిటంటే, మీ దేశపు ప్రజలు తమను తమ దేశం నుండి బహిష్కరణ చేస్తారు,

       హుజూర్ సల్లల్లాహు అలైహి వ సల్లం గారు ఈ మాట వినగానే ఆశ్చర్యపోతారు అప్పుడు ఇలా అడుగుతారు, ఏమిటి,నా దేశపు ప్రజలు నన్ను నా దేశం నుండి బయటకు తీసేస్తారా,

     అప్పుడు వర్కత్ ఇలా అన్నాడు, హా అవునండి,, ఏ మానవుడైనాను మీలాగా అనగా ప్రవక్త లాగా వచ్చినచో ప్రజలు వారితోపాటు విరోధిగా ప్రవర్తిస్తారు, ఒకవేళ నేను ఆరోజు బ్రతికే ఉంటే మీకు తప్పకుండా సహాయం చేస్తాను,అని అన్నాడు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter