ఇస్లాం మతం యొక్క విస్తరణ 

   మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తమ ప్రజలు రాజ్య బహిష్కరణ చేసినా తాము ఎటువంటి వెనకడుగు వేయలేదు. అల్లాహ్ తఆలా ఏదైతే హక్కునిచ్చారో దానిని పూర్తి చేయాలనే చిత్తశుద్ది, పట్టుదలతో ప్రజలను ఇస్లాం మతం వైపు ఆహ్వానించసాగారు.

          ఇక ఎప్పుడైతే మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజలను ఇస్లాం మతం వైపు ఆహ్వానించడం మొదలుపెట్టారో, అప్పుడు మొట్టమొదటిగా వీరు ఇస్లాం మతాన్ని స్వీకరించారు‌. వారు ఎవరంటే.

          స్త్రీలలో మొట్టమొదటిగా ఖదీజా రదియల్లాహ్ అన్హా గారు, పిల్లలలో మొట్ట మొదటిగా హజరత్ అలీ రదియల్లాహ్ అన్హు గారు, పురుషులలో మొట్టమొదటిగా హజరత్ అబూబకర్ సిద్ధిఖ్  రదియల్లాహ్ అన్హు గారు, విముక్తి కలిగించిన బానిసలలో మొట్టమొదటిగా హాజరత్ జైద్ బిన్ హారిస్ రదియల్లాహ్ అన్హు మరియు బానిసలలో మొట్టమొదటిగా హజరత్ బిలాల్ రదియల్లాహ్ అన్హు  గారు, మొట్టమొదటిగా ఇస్లాం మతాన్ని స్వీకరించారు.

            మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు అందరికంటే ముందుగా తమ ఇంటి నుండి మరియు తమ బంధువుల నుండి ఇస్లాం మతం వైపు ఆహ్వానించే పనిని ఆరంభించారు. ఈ విధంగా మూడు సంవత్సరాల వరకు చాటుగా ఇస్లాం మతం వైపు ప్రజలను ఆహ్వానించసాగారు. మళ్లీ ఎప్పుడైతే పూర్తి ప్రజలను ఇస్లాం వైపు ఆహ్వానించవలసి వచ్చిందో, అప్పుడు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సఫా (మక్కా ముకర్ర మాలో ఒక పర్వతం) పర్వతం పైకి ఎక్కి మరియు ప్రజలను పిలిచి ఇలా అడిగారు

ఓ, ప్రజలారా, చూడండి, నేను ప్రస్తుతం ఇటువంటి స్థానం మీద నిలిచి ఉన్నాను, అక్కడి నుండి నేను  దీని ముందు కూడా చూస్తున్నాను మరియు వెనుక కూడానూ. నేను ఇలా అందును, అది ఏమిటంటే, ఒక పెద్ద సైన్యం దాడికి సిధ్ధమై వస్తోంది అని అంటే, మీరు దీన్ని నమ్ముతారా. ఇది విన్న ప్రజలు, ఇలా అంటారు, తప్పకుండా. ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ సత్యం మాత్రమే చెబుతారు మరియు నిజాయితీపరులు కూడాను. అప్పుడు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారు ఇలా సెలవిచ్చారు, అయితే వినండి. ఒకవేళ మీరు దేవుని యొక్క ఏకత్వం మరియు నేను ఆ దేవుని యొక్క ప్రవక్తనని విశ్వాసించి ప్రవర్తించాలి, మీ మీద కఠినాతి కఠినమైన శిక్ష దించబడుతుంది .ఇది విన్న అబూ లహబ్ ఇలా అంటాడు. నీకు అపకారం కలుగు, నీవు ఈ పనికిరాని మాటల కోసమేనా మమ్మల్ని పిలిచింది. తర్వాత అక్కడి ప్రజలందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు.

            కానీ ఈ సంఘటన తర్వాత ఇస్లాం మత విరోధులు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మరియు ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారిని కూడా రకరకాలుగా బాధించి హింసపెట్టేవారు. విశ్వాసులు అన్ని విధాల హింసలు మరియు బాధలను సహించారు. కానీ ఇస్లాం మతాన్ని విడిచి పెట్టేవారు. ఇదంతా చూసి అర్థం చేసుకొని ఇతరులు కూడా కొంచెం కొంచెంగా ఇస్లాం మతాన్ని స్వీకరించసాగారు. ఈ విధంగా మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అయిన ఆరు సంవత్సరాలకు వారి చిన్నన్న అయినా హంజా రదియల్లాహ్ అన్హు గారు అదే సంవత్సరంలో మరియు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహ్ అన్హు గారు కూడా దారుల్ అర్కమ్ అనే సంస్థకు వెళ్లి ఇస్లాం మతాన్ని స్వీకరించారు.

           దారుల్ అర్కమ్ అనగా అదొక విద్యాలయం. అక్కడినుండి మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నో సంవత్సరాలుగా ఇస్లాం మతం యొక్క ప్రచురణ చేస్తూ ఉండేవారు.

             ఈ విధంగా ఇస్లాం మతం విస్తరించ సాగింది ప్రజలు రోజురోజుకీ ఇస్లాం మతాన్ని స్వీకరించసాగారు. కానీ, మక్కాలోని విశ్వాసుల విరోధులకు ఈ మాట అస్సలు నచ్చలేదు. వారు ముస్లింలను చెడు విధంగా సతాయించసాగారు. ఎటువంటి బాధలను చేపట్టారంటే, అవి వినగా మన నయాలనుండి నీళ్లు బయటపడతాయి. అంతటి సంఘటనలు వెలబడ్డాయి. ఇంతగా ఘోరంగా  విశ్వాసులను హింసిస్తున్న అవిశ్వాసులుకు ఏమాత్రం, ఏమాత్రం మనసాక్షి లేదు. ఈ విధంగా చాలా బాధలు పెట్టి విశ్వాసులను చాలా హింసించేవారు అవిశ్వాసులు. వారు పెట్టే హింసలను మరియు బాధలను తట్టుకోలేక చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ, ఇస్లాం మతాన్ని వదిలిపెట్టాలేదు. కొంతమందేమో ఈ హింసలను భరించలేక హిజ్రత్ చేయాలని చెప్పేసి హిజరత్ చేస్తారు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter