యూదుల నమ్మకద్రోహం  - ఖందఖ్ సమరానికి కారణం

         ' ఖందఖ్' ఈ సమరం కూడా 'గాజ్వాహ్' దే. అనగా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యుద్ధంలో పాల్గొన్నారు. ఖందఖ్ అనగా చాలా వెడల్పు లోతు గల లోయ. ఆ లోయను ఆ అవిశ్వాసుల భారీ నుండి తమను భధ్రపరచుకోవడానికి విశ్వాసులే స్వయంగా నిర్మించారు. దీని నిర్మాణం హిజ్రత్ యొక్క ఐదవ సంవత్సరంలో షవ్వాల్ మరియు జిల్ ఖాయిదా అనే మాసాలలో చేకూర్చబడింది. దీనికి మరో పేరు 'గజవాహే అహజాబ్ 'అని కూడా అంటారు.

          ఈ గాజ్వాఖందఖ్ జరగడానికి గల కారణాలు:

మక్కా నుండి మదీనాకి హిజ్రత్ చేసిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 'బను నజీరా' అనే వంశం చేసిన ఒప్పందాన్ని తిరస్కరించింది. అంతేకాక వారు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చంపడానికి కూడా ప్రయత్నించారు. దీనితో హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ వంశాన్ని మొత్తాన్ని  రాజ్య బహిష్కరణ చేశారు. అనగా మదీనా నుండి వెళ్లగొట్టారు.

          ఆ వంశం వారు స్వతంత్రులమయ్యామనుకొని వేరువేరు ప్రదేశాలకు వెళ్లిపోయారు. ఆ సమూహం నుండి కొంత మంది మాత్రం మక్కాకు వెళ్లి ఖురైష్ వంశంతో చేతులు కలిపి ఇలా చెప్పసాగారు . "మేము మీతో కలిసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో శత్రుత్వం చేద్దామనే ఉద్దేశంతో  ఓ ఒప్పందం కుదుర్చుకోవాలని వచ్చాము మరియు ఇరువురమూ కలసి ఆ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బలగాన్ని పటాపంచలు చేద్దాం" అని చెప్పసాగారు.

ఖురైష్ ఈ విషయాన్ని విని ఆనందపడ్డారు మరియు ఆ యహూదులు ప్రతి వంశం వద్దకు వెళ్లి ఈ సంఘటన చెప్పి అందరినీ తమ వశపరచుకున్నారు. చివరకు పదివేల ఒక సైన్యం సమరానికి తయారయ్యింది. దానికి సేనాధిపతిగా అబూసుఫియాన్ అనే బాధ్యత వహించారు.

అప్పుడు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ సమాచారం అందగా అవిశ్వాసులు ఒక సైన్యాన్ని తయారుచేసి విశ్వాసులపై దండయాత్ర చేయడానికి వస్తున్నారని తెలుసుకోగా, అప్పుడు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముహాజిరీన్ మరియు అన్సార్ల మధ్య చర్చించారు. ఆ చర్చలో హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక అనుచరుడు "సల్మాన్ ఫార్సీ" గారు తమ ఉద్దేశాన్ని వినిపించారు .ఆ ఉద్దేశం ఏమిటంటే "నగరం అనగా మదీనా యొక్క మూడు వైపులా పెద్ద పెద్ద శైలాలచే విస్తరించి ఉంది. కేవలం ఒకవైపు మాత్రమే దాడి చేయడానికి అవకాశం ఉంది. ఆ దారిలో ఒక ఖందఖ్ (మొదట్లో దీని గురించి రాసి ఉంది) ను తయారు చేస్తే గనుక ఆ అవిశ్వాసులు నగరంలో చొరబడలేరు. ఈ వాదం ప్రకారమే ఖందఖ్ నిర్మించాలని నిర్ణయించారు.

దీని తర్వాత హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 3000 విశ్వాసులతో పాటు ఖందఖ్ నిర్మాణం కొరకు బయలుదేరారు మొత్తానికి 20 రోజులపాటు కష్టపడి ఆ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆ పనిని ఏ విధంగా పూర్తి చేశారంటే ?

ఇందులో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా ఆ గుంత త్రవ్వడంలో పాల్గొన్నారు. తీవ్రమైన ఆకలి కలగడం వలన ఆ ప్రజలు తమ  కడుపులపై రాళ్లను కట్టుకొని ఉండేవారు. గుంత తవ్వుతూ ఉండగా మధ్యలో ఒక పేద్ద బండరాయి వచ్చింది. ఎవరి దెబ్బతో ఆ రాయి పగలకపోవడంతో, చివరికి హుజూర్ సలాం గారు విచ్చేశారు. ఆయన గారి పుణ్యచేత్తో ఒక్క దెబ్బ పడగానే ఆ పేద్ద బండరాయి ముక్కలు ముక్కలుగా అయ్యింది. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెయ్యెత్తేటప్పుడు ఆయన కడుపు మీద రెండు రాళ్లు కట్టి ఉన్నాయి. ఖందఖ్  పని పూర్తయిన తర్వాత ముస్లింలు ఆ అవిశ్వాసుల కొరకు ఎదురుచూస్తూ ఉండేవారు. వాళ్ళు చేరుకున్నప్పుడు ఆ ఖందఖ్ ను దాటడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. శతవిధాలుగా ప్రయత్నించారు. కానీ ఏం లాభం లేదు. విశ్వాసులు వాళ్ల మీద బాణాల వర్షం  కురిపించసాగారు వారు ఖందఖ్ నుండి దూరం అవుతుండేవారు.

ఇక ఎటు వారికి మదీనాలోనికి రావడానికి వేరే మార్గము లేదు. ఉన్న ఒక్కటి ఖందఖ్ తో పూర్తిగా ఉంది. మదీనాలో ఇక కేవలం ముస్లింలు మరియు 'బను నజీరా' అనే యాహూదులు ఉండేవారు. కానీ మధ్యలో వారు కూడా చేసిన ఒప్పందాన్ని తిరస్కరించారు మరియు అవిశ్వాసుల సహాయం చేయసాగారు. దీని వలన ముస్లింలు చాలా సతమతమయ్యారు. అప్పుడు వారు ముస్లింలను చుట్టుముట్టేశారు. వారు అలాగే చుట్టుముట్టి ఉండటం వలన హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు వారి అనుచరులు చాలా ఆకలిగొన్నారు . ఆకలి వలన అందరూ అల్లాహ్ తో దువా చేశారు.

ఆఖరికి అల్లాహుతాలా యొక్క సహాయం వచ్చింది చుట్టుముట్టే వారి ధైర్యం తక్కువ అవసాగింది 10000 మందికి సహాయం చేర్చడం కష్టంగా ఉండేది. ఇక అల్లాహ్ తఆలా వాళ్ల మీద ఒక తుఫాను పంపాడు. దాంతో వారి గుడిసెలు మరియు వాటికి కొట్టి ఉన్న ఇనుపరార్డులతో సహా అన్ని ఊడిపోయాయి. పొయ్యిల మీది సర్వలు కూడా పడిపోయాయి.

          పర్యావరణకు కఠిన స్థితి, తుఫాను యొక్క జోరు, సహాయపు కొరత ఇవన్నీ ఇలా ప్రోగవడం వలన అవిశ్వాసులు అందరికీ అందరూ చుట్టుముట్టడం వదిలేసి తిరిగి వెళ్ళిపోయారు. యుద్ధం ఆగిపోయింది. ఈ యుద్ధంలో ముస్లింల నుండి 6 మంది షహీదయ్యారు. వారి నుండి 8 కన్నా ఎక్కువే హతమయ్యారు. ధనవృద్ధం చాలా ఎక్కువగా అయ్యింది. యుద్ధంలో ముస్లింలు చాలా గొప్ప విజయాన్ని పొందారు. దానిలో ఖందఖ్ తయారు చేయాలనే ఆలోచన చాలా బాగా ఉపయోగపడింది. అవిశ్వాసులు చాలా దినాల వరకు ఈ యుద్ధంలో జరిగిన కొన్ని విషయాలను సహించలేకపోయారు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter