హిజ్రత్ సమయంలో జరిగిన సంఘటనలు
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సల్లం గారు మదీనా వైపు ప్రయాణిస్తున్నప్పుడు వారితోపాటు మరో ముగ్గురు కూడా ఉన్నారు. వారు హజరత్ అబూబకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్హు, వారి యొక్క బానిస అయిన ఆమిర్ బిన్ ఫుహైరత్ రదియల్లాహు అన్హు మరియు అబ్దుల్లా బిన్ ఉరైకిత్ రదియల్లాహు అన్హు కూడా ఉన్నారు.
మొత్తానికి అవిశ్వాసులు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కనబడకపోయేసరికి వారిపై ఒక బహుమతిని ప్రకటించారు. ఎవరైతే వారిద్దని పట్టుకొస్తారో, వారికి వంద ఒంటెలను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు అవిశ్వాసులు. మరుసటి రోజు హజరత్ అబూబకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్హు గారు మరియూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖుదైద్ అనే నగరానికి చేరుకున్నారు. అయితే వీరి వెనకే సురాకతు బిన్ మాలిక్ అనే వ్యక్తి వీరిని పట్టించడానికి బయలుదేరాడు. ఈయన హుజూర్ గారిని చూసేశాడు. ఈయన వారి చెంతకు చేరుకున్న వెంటనే వారి గుర్రపు కాళ్లు ఎడారి ఇసుకలో ఇరుక్కుపోతాయి. అప్పుడు ఈయన ప్రవక్తతో ఇలా అన్నాడు, అల్లాహ్ తో నా గుర్రపు కాళ్ళు బయటకు వచ్చే ప్రార్థన చేయండి. నేను తిరిగి వెళ్ళిపోతాను మరియు నా వెనుక వచ్చే వారిని కూడా తిరిగి పంపిస్తాను అన్నాడు. దీనితో మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు అల్లాహ్ తో ప్రార్థన చేయగా గుర్రపు కాళ్ళు బయటికి వచ్చాయి. కానీ, ఈయన మళ్ళీ వీరిని భందించడానికి ముందుకు వెళ్ల సాగడు. అయితే మళ్లీ వీరి గుర్రం భూమిలో ఇరుక్కుపోయింది. మళ్ళీ హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం చే ప్రార్థన చేయమనగా ఆయన చేశారు. అయినా మళ్లీ ఇలా రెండుసార్లు జరిగి చివరికి ఆయన వెళ్లిపోయాడు. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖుదైదులో ఉమ్మే మాబుద్ అనే పేరుగల ఒక స్త్రీ ఇంట్లో నుండి పాలు సేవించి మరియు వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క రాక కబురు మదీనాకు చేరింది. అయితే మదీనావాసులు ప్రతిరోజు ప్రొద్దున్నే బయలుదేరి, హిరా అనే స్థానంలో ఆయన రాక కోసం ఎదురు చూస్తూ చూస్తూ మధ్యాహ్నం అయ్యే సరికి తిరిగి వెళ్ళిపోతారు. ఒకరోజు వచ్చి అందరూ తిరిగి వెళ్ళిపోయారు. కానీ, ఒక యూదు మనిషి ఒక కోట మీదికి ఎక్కి దేనికోసమో చూడ సాగాడు.
అతనికి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు వారి తెల్ల బట్టలు కనిపించాయి. ఇక ఇతడు అరవసాగాడు. ఓ ప్రజలారా, ఎవరికోసమైతే మీరు ఎదురుచూస్తున్నారో, వారు వచ్చేసారు. ఇది విన్న ముస్లింలు మొత్తం సురకతు కుబాహ్ అనే ప్రాంతంలో మహా ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం గారికి స్వాగతం పలికారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే ప్రాంతంలో ఒక ప్రార్థన స్థలాన్ని అనగా మసీదును నిర్మించారు. ఆ మసీదులో జుమా నమాజు (ప్రార్థన) చేసుకొని తమ పయనాన్ని కొనసాగించారు. దారిలో ప్రతి వంశపు వారు వచ్చి తమ ఇంట్లో ఉండమంటే, తమ ఇంట్లో ఉండమని అందరూ తమ కోరికను బయటపెట్టసాగారు. కానీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు ఇలా సెలవిచ్చారు, నా ఒంటె అనారోగ్యంగా ఉంది. దానికి దారి వదలండి. అది ఎక్కడైతే ఆగుతుందో, అక్కడే నేను ఉంటాను. ఆ ఒంటె నేరుగా హాజరత్ అబూ అయ్యూబ్ అన్సారీ గారి ఇంటి ముందుక వెళ్లి కూర్చుంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుమతిచే వారి సామాన్లను ఇంటిలోనికి తీసుకెళ్తారు. అబూ అయ్యూబిల్ అన్సారీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉండడానికి చాలా సౌకర్యాలు కూడా కల్పించారు.