ప్రవక్త యొక్క నైతికత యొక్క చిత్రం

ఒక మనిషి తప్పులతో వాడి శరీరం నిండిపోయింది, అతను ఎల్లప్పుడూ వాడి తరుపు నుండి చిన్న తప్పులు పెద్ద తప్పులు అవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో అతను ఏమి చేయాలి? ఇలాంటి స్థితిలో మంచి మనిషి అయ్యేందుకు ఏమి చేయాలి? మరి మీరు తెలుసుకోండి. ఆ సర్వలోకాల అధినేత, సృష్టికర్త అయిన అల్లాహ్ అతని ఉలుహియత్ చూపించేందుకు అన్ని లోపాల నుంచి శుద్ధిగా ఉండిన వాడిని సృష్టించాడు. ఆయన పేరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వారు అందరికన్నా ముందుగా జన్మించారు. ఎలాగైతే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రస్తావించారు-

''اول ما خلق الله نوري وكل شيء من نوري "

అంటే ముందుగా అల్లాహ్ నా నురుని సృష్టించాడు. తర్వాత అన్నీ  వస్తువులు నానూరుతో సృష్టించాడు.

మన ప్రవక్త యొక్క పవిత్రం శ్రేష్టమైన ఉత్తమముగా అన్నిటిలో మిక్కిలి బాగుగా మరియు క్షమించడం మరియు దానం చేయడం ఇవన్నీటికీ వీరు రాజు. ఇంకా దీని అన్నిటికన్నా పెద్ద గుణము మీ స్వభావము ఆయన ఒక పెద్ద గుణనానికి కూడా రాజు ఎలాగైతే అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో ఇలా ప్రస్తావించాడు

 ''انك لعلى خلق عظيم "

బేషక్ మీరు స్వభావము యొక్క గుణానికి మీరు రాజు. ఆయత్ యొక్క తఫ్సీర్ ఇలా ఉంది అల్లాహ్ తన సృష్టి అందాన్ని గుణాన్ని చూపించేందుకు  రాశారు  దాని గురించి తఫ్సీర్ లో అక్షరం అక్షరం గురించి ఇంకా దాని గురించి రాశారు. అది మీరు చదివి తెలుసుకోండి. خلق అక్షరం గురించి ఇమామ్ ఫక్రుద్దీన్ రాజీ రహమతుల్లా అలైహి పెద్ద భావంగా తెలుపుతున్నారు. దాని అక్షరం ఒక మనిషి యొక్క అందం వాడి మాటల్లో అందం అతడిలో ఏ యొక్క లోపం ఉండదు.

ఎలాగైతే చూడడంలో మన కళ్ళకి కష్టం అవ్వదు, వినడంలో మన చెవ్వులకి కష్టం అవ్వదు, చెప్పడంలో మన నాలికకి కష్టం అవ్వదు అలాగే బలం దానం చేయడం నిజం చెప్పడం సిగ్గు ఇంకా తక్కువ ఇలాంటి పెద్ద పెద్ద గుణాలలో చేయడంలో ఏ యొక్క కష్టం లేకుండా చేయడం మన ప్రవక్త స్వభావం.

ఇలాంటి గుణాలు ఉండటం వలన మన ప్రవక్త ఏ పని చేసేటప్పుడు కష్టం కానీ ఇతరులకి చూపించేందుకు కానీ అలాంటి అవసరం రాలేదు. అలాగే మన ప్రియ ప్రవక్తలో ఆ అన్ని గుణాలు ఉన్నాయి. ఎలాగైతే అన్ని ప్రవక్తలకి వేరే వేరేగా ఉండేవో, కృతజ్ఞతభావత ప్రవక్త నూహ్ అలైహి సలామ్ కి  ప్రత్యేకత. కాని మన ప్రవక్తలో ఉండేది. సహనం ప్రవక్త యాకూబు ప్రత్యేకత. కానీ మన ప్రవక్త మహమ్మద్ లో ఆ గుణము కూడా ఉంది. సరళత ప్రవక్త సులేమాన్ ప్రత్యేకత కానీ మా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లో కూడా ఉంది. అలాంటి చానా ప్రవక్తలకి ఒక ఒక ప్రత్యేకత ఉంది. అవన్నీ కలిపి మన ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలో ఉన్నాయి. ఉర్దూ భాషలో ఒక కవి ఇలా రాశాడు.

حسن یوسف ، دم عیسی ، ید بیضا داری

آنچه خوبان همه دارند ، تو تنها داری

ప్రవక్త యూసుఫ్ కి అందం ప్రత్యేకత, మూసాకి కట్టి లాంటి కానీ మన ప్రవక్తలో ఇవన్నీ ఉన్నాయి. ఒకే రూపంలో మన ప్రియ ప్రవక్తలో ఉన్నాయి. ఇవి అన్నిటిలో నేను స్వబర్ అనగా ఓర్పు చేయడం గురించి ఒక సంఘటన చెప్తాను.

మన ప్రవక్త త్వాయుఫ్ కి ఇస్లాం వ్యాపించడానికి వెళ్లారు. అప్పుడు అక్కడి మనుషులు పిచ్చోళ్ళ మరియు చిన్నపిల్లల చేతులతో మన ప్రవక్తకి రాళ్లతో కొట్టించారు అప్పుడు జీబ్రాల్  అలైహి సలామ్ మన ప్రవక్త దగ్గరికి హాజరయ్యారు చెబుతారు, ఓ ప్రవక్త మీరు ఆజ్ఞ ఇవ్వండి. నేను ఈ రెండు కొండల మధ్య ఉన్న ఈ ఊరిని పచ్చడి చేసేస్తాను. కానీ మన ప్రవక్త జవాబు ఎంత శ్రేష్టంగా తీయగా ఇచ్చారంటే "వీళ్ళు కాకపోతే వీరు తర్వాత వచ్చే వాళ్ళు అయినా ఇస్లాం స్వీకరిస్తారు అని చెప్పారు".

 

ఇంకొక్క హదీసు, అనస్ రజియల్లాహు అన్హు ప్రియ ప్రవక్తతో పది సంవత్సరాలు సేవకుడిగా ఉన్నారు. కానీ అతనికి మన ప్రవక్త ఉఫ్ అని కూడా అనలేదు. చేయని పని గానీ చేసిన పని కానీ ఏ పనికి కూడా ఎందుకు చేశావు ఎందుకు చేయలేదు అని కూడా అనలేదు. ఇలాంటిది మన ప్రవక్త స్వభావం. అల్లాహ్ తబారక్ వ తఅలా మమ్మల్ని కూడా ఇవన్నీ గుణాలు అమలులో తేవాలని వేడుకుంటున్నాను ఆమీన్.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter