మదీనాలో మొదటి మెట్టు
మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు మదీనా చేరుకున్న తరువాత చేసిన మొట్టమొదటి పని మసీదును నిర్మించడం. ఇది ఎలా చేయగలిగారంటే ఒకసారి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇద్దరు అనాధ పిల్లలను చూశారు .మరియు అనాధ పిల్లల యొక్క స్థలాన్ని ఖరీదు చేశారు. దీనితో ఇక మసీదును కట్టడం ప్రారంభించారు .ఈ మసీదును నిర్మించడంలో హుజూర్ సరదాగా స్వయంగా పనిచేశారు. తామ స్వయంగా తమ కంబలిలో ఇటుకలు పెట్టుకుని తీసుకొచ్చేవారు.
తర్వాత ఒక ముఖ్యమైన పని చేశారు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అదేమిటంటే, మదీనా నగరంలో మంచి చెడులను సరిదిద్దారు మరియు నగరంలో సుఖశాంతులను నింపారు. ఈ పని జరగడానికి మదీనా మొత్తం ప్రజలను ఒక చోట చేర్చి వారికి ఇస్లాం గురించి సెలవిచ్చారు. మరియు ముహాజరిన్ అనగా మక్కా నుండి హిజ్రత్ చేసి మదీనా వైపు వచ్చినవారు ఇంకా అన్సార్ అనగా మదీనా వాసులు. వీరిద్దరి మధ్య అన్నదమ్ములనే బంధాన్ని పుట్టించి ఆ బంధాన్ని సంతోషపరచారు.
ఇక ముహాజ్రిన్లను ఒక్కొక్క అంశాలు కు వచ్చి ఒక్కొక్క ముహాజ్రిన్లను తీసుకువెళ్లేవారు. వారికి తమ సగభాగాన్ని ఇచ్చేవారు అన్సార్లు .ఎవరి దగ్గరైనా ఎక్కువ ధనం ఉంటే అది ఇచ్చేసేవారు .మరియు ఇల్లు ఉంటే అది ఇంకా, ఎవరి దగ్గరైనా ఇద్దరు భార్యలు ఉంటే ఒకరికి విడాకులు, ఇచ్చి వీరికి అనగా మహాజరిన్లకు ఇచ్చేవారు.
మహాజరీన్లు కూడా అంత పిసినారిగా అన్ని తీసుకోలేదు. వారికి కావాల్సినంత తీసుకొని ,వారు కూడా కష్టపడి పనులు చేయసాగారు .కొందరు కిరాణం పెట్టేవారు, మరియు కొందరు వ్యాపారం అమ్మడానికి వెళ్తుండేవారు మరియు ఇలా రకరకాలుగా మదీనా నగరం అభివృద్ధయ్యింది.
ఇలా నగరంలో ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని ఒక వీలునామాలో చాలా షరతులు పెట్టారు .ఈ షరతులు కేవలం ముస్లింల కొరకే కాదు మదీనా యొక్క యూదులకు కూడానూ.ఆ షరతులు;
- మదీనా పై ఎవరైనా విరోధి దాడి చేయడానికి వస్తే అప్పుడు మదీనా ప్రజలు మొత్తం ఏకమై వాడి సంగతి తేల్చాలి.
- మదీనాలో ఎవరైనా వ్యక్తి ఇతరుల మొత్తం కులం, ప్రాణం, ధనం చే వెక్కిరించరాదు.
- మదీనాలో ఎవరైనా ఇరువురి మధ్యన ఘర్షణ జరిగినట్లయితే దాని తీర్పు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాదిస్తారు.
- యుద్ధం జరిగినట్లయితే మదీనా ప్రజలు మొత్తం లాభనష్టాల్ని సమానంగా పంచుకోవాల్సిందే.
- ఎవరి మధ్యన అయితే ఈ ఒప్పందం జరుగుతుందో, వారు వారు శ్రేయోభిలాషులు, మరియు ఇరువురు కలిసి ఉంటారు.
మదీనా యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఈ ఒప్పందాన్ని అనుసరించి నడుచుకోవాలి మరియు నడుచుకుంటారు కూడా.
ఇస్లాం మతం అనేది చాలా శాంతి మరియు మహా ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారు కూడా ఈ మతాన్ని విస్తరింప చేయాలనే ఈ ప్రపంచంలోకి స్వాగతం తీసుకొచ్చారు .ఇస్లాం అనేది ఎవరికీ ఎప్పుడైనానూ ఎవరికి హాని తలపెట్టలేదు. అంతేకానీ ప్రతి ఒక్కరికి వారి హక్కును చేకూర్చే ప్రగతిని అందించింది.
మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. ముస్లింలు చాలా ఎక్కువ యుద్ధాలు చేశారని. నిజమే !కానీ ఈ యుద్ధాలన్నీ ఎలా ,ఎందుకు జరిగాయో తెలుసా?
*తమ విశ్వాస ప్రజలను విరోధుల నుండి రక్షించడానికి,
*మానవుని హక్కును కాపాడటానికి మరియు న్యాయాన్ని భద్రపరచడానికి,
*రాజులు పెట్టే హింసల నుండి ప్రజలను స్వేచ్ఛపరిచేందుకు మరియు,
*ప్రపంచం మొత్తంలో సుఖశాంధిని మెరుగుపరచడానికి
ముస్లింలు యుద్ధం చేశారు. తప్ప మరి ఏమీ లేదు!
మక్కా నుండి అందరూ హిజరత్ చేసిన తర్వాత కూడా ఈ మక్కా వాసుల పీడ మాత్రం తప్పలేదు. వారు ఇస్లాం మతాన్ని తొలగించడానికి ఎంతగానో శ్రమ పడుతున్నారు .ఇందువలన హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారి సమాచారం కొరకు చిన్నచిన్న గుంపులను చేసి ,వీరి అనుచరులను మదీనా యొక్క నలుమూలలకు పంపారు .మరియు కొన్నిసార్లు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా వెళ్లేవారు .ఎందుకంటే ఆ విరోధులు చాలా ఘోరమైన వాళ్ళు .ఆ క్రూరం మృగాలు ఎప్పుడు ఏ హాని తల పెడతారో ,ఎవరికీ తెలియదు. ఈ సమాచారం కొరకే ఇలా చేశారు.
ఆ కాలంనాటి యుద్ధాలు రెండు రకాలు అవి 1. గజ్ వాహ్ మరియు 2.సిరియాహ్.
*గాజ్వాహ్ అనగా ఈ యుద్ధంలో మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా పాల్గొన్నారు అని అర్థం.
*సిరియా అనగా ఈ యుద్ధంలో గారు పాల్గొనలేదు. కానీ వారి సహాబీలు అనగా అనుచరులను పంపించారు.
ఈ విధంగా గారు మదీనాకు వచ్చినా సరే. వారు అనగా అవిశ్వాసులు ఇస్లాం మత్తం ఉండకూడదని యుద్ధం చేయడానికి తెగించారు. విశ్వాసులు చనిపోకూడదని ఇస్లాం మతం బ్రతకాలని హుజుర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా యుద్ధం చేశారు తప్ప ,వారిని చంపాలి ,వీరిని నరకాలి అది చేయాలి ఇది చేయాలని మాత్రం కాదు.
ఈ విధంగా యుద్ధాలు ఆరంభం