ముహమ్మద్ (స) : జననము, బిబి హలీమా మరియు అబూ తాలిబ్ వద్దా

 ముహమ్మద్ (స) : జననము, బిబి హలీమా మరియు అబూ తాలిబ్ వద్దా

 

          ఏనుగుల సంఘటన జరిగిన యాభై రోజుల తరువాత హజ్రత్ ముహమ్మద్(స) గారు జన్మించారు. క్రీ. శ. 570 వ సంవత్సరము ఏప్రిల్ నెల 20 వ తేదీన (రబీవుల్ అవ్వల్ 12 వ తేది) సోమవారము నాడు ప్రాతః కాలానికి ముందు లోకాన్ని అదృష్టం వరించింది. జన్నిచిన 7వ రోజు అబ్దుల్ ముత్తలిబ్ "అఖీఖ" నిర్వహించి  ముహమ్మద్(స) అని నామకరణము చేశారు. పూర్వము ఆకాశ గ్రంధాలలో ప్రస్తావించబడినట్లు క్రైస్తవులు, యూదులు, అంతిమ ప్రవక్త రాక కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే ముహమ్మద్(స) గారి  జననం జరిగినది.    

దాయి హలీమా బీబీ గారి వద్ద:                           

          పసిబిడ్దలకు పాలు పట్టించే పని గ్రామీణ వనితలకు అప్పజెప్పే ఆచారము ఆ కాలములో అరబ్బులలో ఉండేది. అబ్దుల్ ముత్తలిబ్ కూడ తమ మనుమడికి పాలు తాపటానికొరకై ఒక వనిత కోసం అన్వేషణ ప్రారంభించారు. చాలా వనితలు మక్కా వచ్చినప్పటీకి అబ్దుల్ ముత్తలిబ్ గారి మనుమడు, అనాధ శిశువు అయిన దాని వలన వారెవరూ పాలు తాపే పని ఒప్పుకోలేదు, అందరూ తిరిగి వెళ్ళారు. బాలునికి తండ్రి లేని దాని వలన వారు కోరిన విధంగా ప్రతిఫలము లభించదని వీరి ఆలోచన. అయితే అంతిమ ప్రవక్త ముహమ్మద్(స) కు పాలు తాపించే భాగ్యం హలీమా బీబీకి లభించినది. అయిష్టంగా అయినా హలీమా బీబీ అనాధ బాలుడిని స్వీకరించారు. ఆ అనుగ్రహించిన బాలుని సవిశేషాలు త్వరగానే హలీమా బీబీ  గుర్తించగలిగారు. వారి పాలు పెరిగాయి. పాడి పంటలు కూడ వృద్ధి చెందాయి. అనుగ్రహముల వర్షాలు కురిశాయి. ఇది గమనించిన హలీమాబీబీ గారి స్నేహితురాండ్లు అసూయ చెందారు. ఇలా రెండు సంవత్సరముల కాలములో ముహమ్మద్(స) గారు అసాధారణమైన రీతిలో ఎదిగారు. దీనిని గమనించిన హలీమాబీబీ గారు ముహమ్మద్(స) గారి తల్లి అయిన హజ్రత్ ఆమినా(ర) వద్దకు వెళ్ళి వారి బిడ్డను మరి కొంత కాలం పాటు తనతోనే ఉంచాలని కోరారు. హలీమా బీబీ గారి అభ్యర్ధనను హజ్రత్ ఆమినా బీబీ అంగీకరించారు. ముహమ్మద్(స) గారు హలీమా బీబీ గారి సుపుత్రునితో కలిసి గొర్రెలు మేపటానికి వెళ్ళేవారు. ఒక రోజు ఇద్దరు ధూతలు వచ్చి ముహమ్మద్(స) గారి రొమ్ము చీల్చి హృదయం బయటకు తీసి శుద్ధి చేసిన తరువాత తిరిగి అదే స్ధానంలో ఉంచి వెళ్ళారు. ఈ సంఘటన హలీమా బీబీని ఆందోళనకు గురి చేసినది. అందువలన త్వరగా ఆ బాలుడిని తిరిగి ఆమీన బీబీ గారి కి అప్పజెప్పేశారు.

                  

అబూతాలిబ్ గారి వద్ద:

         ముహమ్మద్(స) కు ఆరు సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు వారి తల్లి హజ్రత్ ఆమినా బీబీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. మదీనాలో బంధువులతో ఒక నెల గడిపిన తరువాత "మక్కా" కు తిరిగి వచ్చే సమయంలో "అబ్వాహ్" అనే చోట వ్యాధిగ్రస్థురాలై మరణించారు. ముహమ్మద్(స) మరియు ఉమ్ము అయిమన్ అనే బానిస వనిత ఆ సమయంలో వారితో ఉన్నారు. హజ్రత్ ఆమినా(ర) మరణించిన తరువాత ముహమ్మద్(స) పూర్తిగా తమ తాత అబ్దుల్ ముత్తలిబ్ అధీనంలోనికి వచ్చారు. వారు ముహమ్మద్(స) ను అమితంగా ప్రేమించేవారు. ముహమ్మద్(స) కు ఎనిమిది సంవత్సరముల వయసు వచ్చినప్పుడు వారి తాత అబ్దుల్ ముత్తలీబ్ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. తరువాత ముహమ్మద్ (స) గారి సంరక్షణ బాధ్యత వారి చినాన్నఅయిన అబూతాలిబ్ తీసుకున్నారు. తమ జీవితంలో అనేక కష్టాలున్నా కూడ వారి అన్న కుమారుడైన ముహమ్మద్(స) ను వారు అమితమైన ప్రేమాభిమానాలతో పెంచి పోషించారు. వారు ముహమ్మద్(స) ను తమ కన్న కొడుకుల కన్న మిన్నగా చూసుకునేవారు. ముహమ్మద్(స) కు పన్నెండు సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు తమ పినతండ్రి అబూతాలిబ్ తో కలిసి వర్తక వ్యాపార యాత్రలు చేశారు. వారి వ్యాపార బృందము "బస్రా" లోనికి వెళ్ళినప్పుడు "బహీర" అనే ఒక క్రీస్తు పురోహితుడు ముహమ్మద్(స) గారిని చూసి అబూతాలిబ్ తో ఇలా అన్నాడు:

                   "ఈ బాలునిలో అంతిమ ప్రవక్త యొక్క లక్షణాలు కనబడుచున్నవి, "తౌరాతు" మరియు "ఇంజీలు" లలో కనబరిచిన సువిశేషాలు ఈ అబ్బాయిలో ఉన్నవి. అందువలన మీరు"సిరియా"కు వెళ్ళకండి. అక్కడ యూదులతో ఈ బాలునికి ప్రాణాపాయం ఉంది.

 బహీర ఉపదేశం ప్రకారం అబూతాలిబ్ బాలునితో కలిసి"మక్కా" కు తిరిగివచ్చేశారు. లోకనాధుడైన అల్లాహు సుబ్హనహు వ తఆలా యొక్క సంరక్షణలో ముహమ్మద్(స) గారు పెరిగి పెద్దవారయ్యారు. ఆ కాలంలో అరబ్బులలో పేరుకుపోయి ఉండిన దురాచారాలు మరియు అనాచారాల దరిదాపులకు కూడ ముహమ్మద్(స) గారు వెళ్ళేవారుకాదు. వారు(స) ప్రజల మూల్యముల విలువ తెలిసినవారై, మంచి స్వభావము గలవారై, సత్యవంతులై, విశ్వస్ధులై ఉండిరి. ముహమ్మద్(స) గారిని ప్రజలందరు "అస్సాదిఖ్" అల్ అమీన్" (విశ్వస్ధుడు) అని పిలిచేవారు. ఆతిథ్య మర్యాద పాలించు వారుగాను, కుటుంబ బంధము పాలించువారు గాను, కష్టాలలో ఉండేవారి భారం తమ భుజస్కందాలపై వేసుకునేవారు గాను మున్నగు మంచి గుణాలు కలిగి చిన్నతనంలోనే అందరిని వశపరుచుకున్నారు. మంచి పనులలో ఇతరులకు సహాయపడుట, స్వయంగా కష్టపడి  జీవించుట మున్నగు విషయాలు ఆ రోజులలో ముహమ్మద్(స) గారి జీవిత విధానాలై ఉండేవి.  

        "ఖురేష్" "ఖైస్" మున్నగు తెగలు యుద్దం చేసినప్పుడు ముహమ్మద్(స) గారి వయస్సు 15 సంవత్సరములుండెను. అక్రమానికి అవినీతికి వ్యతిరేకంగా పని చేయుట, బెదిరింపులు మరియు దౌర్జన్న్యాల ను నిరోధించుట వంటి గుణాలు ముహమ్మద్(స) గారి నుంచి వెలువడ్డాయి.

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter