హుదైబియా ఒప్పందం

ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్ యొక్క ఆరవ సంవత్సరంలో ఒక కలగన్నారు. ఆ కలలో హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముస్లింలతో పాటు మక్కా చేరుకున్నారు మరియు కాబా యొక్క తవాఫ్ చేస్తున్నారు.

ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ కలని తమ అనుచరులతో పంచుకున్నారు. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి స్వప్నం విని ముస్లింల మనసులో మక్కా  వెళ్లాలని మరియు కాబా యొక్క తవాఫ్ చేయాలనే కోరిక కలిగింది. అయితే ఇదే సంవత్సరంలో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు తమ 1400 మంది అనుచరులతో ఉమ్రా చేయడానికి మదీనా నుండి మక్కా వైపునకు రవాణా అయ్యారు. వారి వద్ద ప్రయాణానికి అవసరపడే సామాను తప్ప వేరే ఏమీ లేదు. తమను రక్షించుకోవడానికి ఆయుధం కూడా లేదు. అయినా సరే ముస్లింలు హుజూర్ సల్లాహు అలైహి వసల్లం తో పాటు ఉమ్రా చేయడానికి బయలుదేరారు. అవిశ్వాసులకు వారు యుద్ధం చేయడానికి వచ్చారని అనిపించలేదు. ఎందుకంటే ముస్లింలు 'జుల్హులైఫా'అనే ప్రాంతం నుండి 'ఇహ్రామ్' తొడిగారు (హజ్ చేసే సమయంలో ఇటువంటి బట్టలే తొడిగి ఉండాలి).  ఖురైష్  ప్రజలు తమను చూసి యుద్ధానికి వచ్చామని, అలా అనుకోకూడదని మరియు కేవలం ఉమ్రా చేయాలనే ఉద్దేశంతో వచ్చారని అది వారికి తెలియాలని అంతే. ఖురైష్  కి ఈ విషయం తెలియగానే వాళ్ళంతా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మక్కాకు రాకుండా ఆపడానికి అందరూ సిద్ధమయ్యారు.

హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ అనుచరులతో మక్కాకు కొంతముందు 'మకా మే హుదైబియా' అనగా హుదైబియా స్థానం వద్ద చేరగానే హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉస్మాన్ రదియల్లాహ్ అన్హు గారిని పంపారు. ఎందుకంటే ఆయన వారు వద్దకు వెళ్లి ముస్లింలు ఉమ్రా చేయడానికి అనుమతి తీసుకురావాలని పంపారని మరియు ముస్లింల రాకపు గమ్యం కూడా అర్ధించడానికి ఉస్మాన్ రదియల్లాహ్ అన్హు గారు మక్కాకు వెళ్లిపోయారు. అప్పుడు ముస్లింల మధ్య ఉస్మాన్ రదియల్లాహ్ అన్హు గారు ఖురైష్ చేత చంపబడ్డారనే అబద్ధపు కబురు విస్తరిస్తుంది. ఆ సమయాన హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ అనుచరులతో ఒక ఒప్పందం చేశారు. "ఒకవేళ ఆ సమయాన ఉస్మాన్ రదియల్లాహ్ అన్హు గారి నెత్తురు కొరకు పోరాడాల్సి వచ్చినా ధైర్యంగా పోరాడుదాం." ఈ ఒప్పందాన్ని 'బైఅతురిజ్వాన్'  అని అంటారు . ఖురైష్ ఈ ఒప్పందం గురించి విని భయపడిపోయింది. ఇక ముస్లింలతో ఖురైష్ ఒప్పందం చేయడానికి సుహేల్ బిన్ అమ్ర్ ను పంపారు.

ఆ ఒప్పందం యొక్క షరతులు ఇవి:

  1. ముస్లింలు ఈ సంవత్సరం వెనక్కి వెళ్లి వచ్చే సంవత్సరం ఉమ్రా కొరకు వస్తారు.
  2. 10 సంవత్సరాల వరకు ఇద్దరి మధ్యన యుద్ధం ఉండకూడదు.
  3. ఒకవేళ ఖురైష్ నుండి ఎవరైనా ముస్లిం అయి మదీనా వైపునకు వస్తే వారిని తిరిగి మక్కాకు పంపించాలి. కానీ, ఒకవేళ ముస్లింల నుంచి ఎవరైనా ఖురైష్ వద్దకు వస్తే వారిని తిరిగి మదీనాకు పంపము!

ఈ ఒప్పందం ప్రకారం ముస్లింలు ఉమ్రా చేయకుండా తిరిగి వెళ్ళిపోయారు. ఈ షరతులు చూస్తే ముస్లింలకు  అభ్యంతరాలుగా ఉండేవి. కానీ ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం  గారు అన్ని షరతులు ఒప్పుకున్నారు. తమ అనుచరులను కూడా ఒప్పించారు. కానీ అనుచరులకు ఈ ఒప్పందాన్ని  అర్ధించడానికి కొంత సమయం పట్టింది మరియు ఈ షరతులన్నిటినీ ఒప్పుకున్నందుకు ఇస్లాం మరియు ముస్లింలకు చాలా లాభం కలిగింది.

మరుసటి సంవత్సరం హాయిగా మరియు చాలా గొప్పగా ఉమ్రా చేయడానికి ముస్లింలకు అవకాశం దక్కింది. దీని తర్వాత యుద్ధాలు తగ్గసాగాయి. దీని వలన ఇస్లాం మతాన్ని విస్తరించడానికి కావాల్సినంత సమయం దొరికింది. ముస్లింలు మరియు అందరూ ఆ పనిలో నిమఘ్నులైపోయారు. దీనితో పెద్ద పెద్ద బలమైన రాజులకు(కిసరా, ఖైసర్ మరియు మిస్ర్) కు ఉత్తరం ద్వారా ఇస్లాం వైపునకు ఆహ్వానించబడ్డారు. ఇదంతా చూసి ఇస్లాం యొక్క గొప్పతనాన్ని అర్థించి, చాలామంది పెద్దలు విశ్వాసులుగా మారారు. అందులో కొందరు (ఖాలిద్ బిన్ వలీద్ మరియు అమ్రు బిన్ ఆస్)  మొదలగు వారు...

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter