అస్హాబుల్ ఫీల్ కాబాను ధ్వంసం చేయాలనుకున్న గజరాజులు
అస్హాబుల్ ఫీల్ కాబాను ధ్వంసం చేయాలనుకున్న గజరాజులు
హజ్రత్ ముహమ్మద్(స)గారి జననానికి ముందు ఆ సంవత్సరములోనే"మక్కా"నగరము ఒక మహా సంఘటనకు సాక్ష్యం వహించినది. దానిని రాబోయే ఒక పెద్ద విజయానికి శుభ సూచకమని చెప్పవచ్చును. పవిత్ర కాబా యొక్క మహిమ అందరికి అర్ధం అయ్యేటట్లు ఆ సంఘటన దారి తీసింది.
అబ్రహతుల్అష్రం అనే ఒకతను ఎతియోపియా రాజైన నజాషీ తరపున యమన్ కు గవర్నర్ గా ఉండెను. అతను సన్అ లో "ఖుల్లైస్” అనే పేరు గల ఒక ఆరాధనాలయాన్ని నిర్మించెను. ప్రజలు పవిత్ర కాబాలయానికిస్తున్న గౌరవము ఈ ఆరాధాలయానికి కూడ ఇవ్వాలని అబ్రహ యొక్క ఆశ. అయితే ప్రజలు ఆ మందిరము అంటేనే కోపగించుకొనేవారు. కాబాకు బదులు మరొక గృహమును అంగీకరించటానికి వారు సిద్ధంగా లేరు. వారు దీనిని తీవ్రంగా వ్యతిరైకించారు. దీనికి తోడు కినాన తెగకు చెందిన ఒకతను ఆ దేవాలయానికి వెళ్ళి మలమూత్ర విసర్జన కూడ చేశాడు. దీని తో కోపోద్రిక్తుడైన అబ్రహ పవిత్ర కాబాను పడ గొడతానని శపధం చేసి సైన్య సమేతంగా బయలుదేరాడు. ఆసైన్న్యములో ఏనుగులు కూడ ఉండేవి.
కాబాలయాన్ని పడగొట్టడానికి అబ్రహ బయలు దేరాడని తెలుసుకొని అరబ్బులు చాల భయ బ్రాంతులయ్యారు. అబ్రహ సైన్యాన్ని ఎదుర్కోవాలనే కోరిక వారికున్నా కూడ దానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు లేవని తెలిసి అంతా అల్లాహుతాలా పైన భారం మోపి వారు నిర్భయంగా ఉండిరి.పవిత్ర "కాబాలయం” (కాబతుల్లా) ను సంరక్షించుకునే బాధ్యత తీసుకున్న ఒక నాధుడున్నాడని వారు గట్టిగా నమ్మారు."మక్కా"కు అధిపతి అయిన అబ్దుల్ ముతల్లిబ్ గారి రెండు వందల ఒంటెలు "అబ్రహ" అనే అతను అపహరించి. అబ్రహ అబ్దుల్ ముతల్లిబ్ గారితో ఇలా అన్నాడు."తమరు మా నుండి ఏం కోరుకుంటున్నారు? అబ్దుల్ ముతల్లిబ్ గారు సమాధానం ఇస్తూ, నా రెండు వందల ఒంటెలు నాకు తిరిగి ఇవ్వాలని అడిగారు.ఇది విన్న అబ్రహ పరిహాసిస్తూ ఇలా అన్నాడు."తమరు పోగొట్టుకున్న ఒంటెలు మాత్రం అడిగి తమకు తమ తాత ముత్తాతలకు చెందిన కాబాలయాన్ని వదిలేయటమా? నేను"కాబెతుల్లా"ను పడగొట్టడానికి వచ్చాను,దాని గురించి చెప్పటానికి ఏమి లేదా? అని అబ్రహ ముతల్లిబ్ గారిని ప్రశ్నించడంతో "నేను నా ఒంటెలకు మాత్రమే యజమానిని పవిత్ర కాబాలయానికి ఒక యజమాని ఉన్నాడు. దానిని ఆయనే కాపాడుకుంటాడని" అబ్దుల్ ముతల్లిబ్ గారు సమాధానము చెప్పారు.
ఖురేషులు శత్రువుల దాడి విషయం తెలిసి భయభ్రాంతులై ఇళ్ళు వాకిళ్ళు వదిలి కట్టుబట్టలతో కొండ పైకి మరియు ఇతర చోట్లకు వెళ్ళి రక్షణ పొందారు. అబ్దుల్ ముతల్లిబ్ నాయకత్వంలో ఒక ఖురేషీ సంఘం కాబాలయానికి వెళ్ళి అబ్రహ సైన్యానికి వ్యతిరేకంగా అల్లాహుతాలాను ప్రార్ధించారు. కాబాలయాన్ని పడగొట్టే ఉద్దేశంతో అబ్రహ మక్కా లోనికి ప్రవేశించాడు. ఏనుగును తయారు చేసి నిలబెట్టాడు. ఆ ఏనుగు పేరు "మహమూద్".
అయితే మక్కా కు వెళ్ళే దారిలో ఏనుగు మోకాలొడ్డినది. ఏనుగును లేపే ప్రయత్నములో దానిని కొట్టారు. అయిన అది లేచి కాబాలయం వైపు వెళ్ళటానికి సమ్మతించలేదు. యమన్ వైపు మళ్ళించి నిలబెట్టగానే అది లేచి హుషారుగా పరుగెత్తసాగింది. అక్కడ ఒక అద్భుతం జరిగినది. అల్లాహుతాలా సముద్రంలో నుంచి ఒక విధమైన విచిత్రమైన పక్షులను చాలా చిన్న గులక రాళ్ళతో పంపాడు. ఆ గులక రాళ్ళు వారిపై పడ్డదే ఆలస్యం శత్రువులు చనిపోయేవారు. అందువలన మిగిలిన సైన్యం భయపడి పరుగులు తీసింది. గులక రాళ్ళు శరీరానికి తగిలి నిర్జీవి అయిన అబ్రహ తన సైన్యంను"స్వన్ఆ" లోనికి పంపాడు.అతని వ్రేళ్ళన్ని ఒక్కొక్కటిగా తోటకూర కాడల్లా విరిగి పోసాగాయి.చివరికి అతను చాలా అవమానకరంగా మరణించాడు.ఈ సంఘటన వలన ఖురేషుల కీర్తిప్రతిష్టలు పెరిగిగాయి.
ఈ సంఘటనకు ఖురాన్ తన వాక్యాలలో ఇలా తెలియ చేస్తుంది:
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِأَصْحَابِ الْفِيلِ *
أَلَمْ يَجْعَلْ كَيْدَهُمْ فِي تَضْلِيلٍ *
وَأَرْسَلَ عَلَيْهِمْ طَيْرًا أَبَابِيلَ *
تَرْمِيهِمْ بِحِجَارَةٍ مِنْ سِجِّيلٍ *
فَجَعَلَهُمْ كَعَصْفٍ مَأْكُولٍ
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో
ఏనుగుల వాళ్లతో మీ ప్రభువు ఎలా వ్యవహరించాడు మీరు చూడలేదా
వారి కుటిల పన్నాగాలను వమ్ము చేయలేదా
వారిపై పక్షులను గుంపులు గుంపులుగా పంపాడు
అవి వాళ్ళ పై కంకర రాళ్ళను వేశాయి
వారిని సమలబడిన తొక్కు గా చేశాయి
డ. పి. అబ్దుల్ గఫ్ఫార్
చిత్తూరు