ఖందక్ యుద్దంలో నయీమ్ ఇబ్న్ మసూద్ యుక్క పాత్ర

ఉహుద్ యుద్దం తర్వాత ముష్రికీన్లు ఇంకోక యుద్దం చేసారు. ఆ యుద్దమే ఖందక్ యుద్దం మరియు ఈయుద్దంలోనే ఒక సహాబీ (ప్రవక్త అనుచరుడు) ఉండేవారు. అందరికి ఖందక్ యుద్దం గురించి తెలుసు. ముస్లిములు చాలా రోజులు తర్వాత చాలా సమయం తర్వాత కష్టపడి గెలిచిన యుద్దం ఖందక్ యుద్ధం. ఆ యుద్దంలో సహాబా ఎంతో కష్టపడి ప్రయత్నించారు. అప్పుడు ముష్రికీన్లు భయపడి అక్కడ నుంచి పారిపోయారు.

ఆ యుద్దంలో అలీ రదియల్లాహు అన్హు లాంటి  పెద్ద పెద్ద సహాబాలు కుడా ఉన్నారు. అదే యుద్దంలో ఇంకోక సహాబీ ఉన్నారు. ఖందక్ యుద్దం గెలవడానికి వారి పెద్ద పాత్రే ఉంది. కాని వారు యుద్దంలో పాల్గొనలేదు. బానాలు వేయలేదు. వారు తమ తెలివితో తమ బుద్దితో యుద్దం గెలవడానికి సహాయం చెసారు. కాని వారు యుద్ధం మొదలు పెట్టింది ముష్రికీన్ల తరుపు నుండి, యుద్ధం ముగించి గెలిచింది ముస్లిముల తరుపు నుండి. వారే నయీమ్ ఇబ్న్ మసూద్ రదియల్లాహు అన్హు.

ఉహుద్ యుద్దంలో ముస్లిములకు చాలా నష్టం జరిగింది. కానీ ముష్రికీన్లు గెలవలేదు. ఆ తర్వాత మళ్ళీ యుద్దం జరిగింది. దాని పేరు గజ్వఎ ఖందక్ ఆ యుద్దంలో అబు సుఫియాన్ పది వేల మందిని జోడించాడు ఈ విషయం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి తెలిసిన తర్వాత ఒక నిర్ణయం కోసం వారు సహాబాలతో కలిసారు. అక్కడ సల్మన్ ఇబ్ను ఫారిస్ రజీదియల్లాహు అన్హు ఒక సలహా ఇలా చెప్పారు, మా ఫారిస్ లో ఏదైన యుద్దం జరిగితే మన ఊరి చుట్టుగా మేము ఒక ఖందకం (లోయ లాంటి గుంత) తవ్వుతాము మరియు ఈ సలహా మన నబి సల్లహు అలైహి వ సల్లం కి నచ్చింది. ఆ తరవాత ఆ సలహా ప్రకరం అందరు కలిసి మదీన చుట్టు ఒక ఖందకం తవ్వారు.

యుద్దం మొదలైంది. ముష్రికీన్లు చాలా ప్రయత్నించారు. కాని ఖందకం దాటలేక పోయార. తర్వాత అబూ సుఫియాన్ ఆలోచించాడు. ఒక వేళ మదీనాలో ఉన్న ముష్రికీన్లు మనకుసహాయం చేస్తే మనం గెలిచే అవకాశం ఉంటుంది. అప్పుడు ముష్రికీన్ల తరుపు నుండి ఒక మనిషికి అక్కడ పంపిస్తారు మరియు వాళ్ళు కుడా దీనికి రాజీ అయిపోతారు. కాని కోన్ని రోజుల తర్వాత కుడా వాళ్ళు ఏమీ చెయ్యరు. తర్వాత మళ్ళీ ఇంకోకరు పోతారు. వారే నయీమ్ ఇబ్న్ మసూద్. అప్పుడు వారు అక్కడ పోయీ చెప్పతారు అబు సుఫియాన్ మీతో ఆడుకుంటున్నాడు మరియు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. అప్పుడు వారు వీరి మతల మీద నమ్మేస్తారు మళ్ళీ నయీమ్ ఇబ్న్ మసూద్, అబు సుఫియాన్ దగ్గర పోయి చెబుతారు. వారు యుద్దనికి సిద్దంగా లేరు అప్పుడు అబు సుఫియాన్ కి చాలా దుఖం కలుగుతుంది. కాని వాడు ఓటమి ఒప్పుకోడు.

తర్వాత చాలా వర్షం పడుతుంది. అప్పుడు శత్రువులు పారి పోతారు. ఒక వేళ అక్కడ నయీమ్ ఇబ్న్ మసూద్ (ర) తమ తెలివి ఉపయోగించక పోయి ఉంటే ముస్లిముల పై లోపలి నుంచి కూడా దాడి అయ్యేది. అప్పుడు ముస్లిములకు ముందులాగా నష్టం అయ్యేది. కాని వారి తెలివి వల్ల ముస్లిం బలగానికి లాభం కలిగింది. దీంట్లో ఇంకొక మాట ఏమంటే, ఖందక్ యుద్దం ముందే  నయీమ్ ఇబ్న్ మసూద్ (ర) ఇస్లాం స్వీకరించి ఉంటారు. సహయం చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter