ఇస్లామేతర పండుగలలో ముస్లింల సంబరాలు

ఇస్లాం ప్రతి ఒక్కరి జీవితానికి దిక్సూచి. ఈ ప్రపంచంలో ఎన్నో సంఘాలు, ఎన్నో మతాలు ఉన్నాయ్. ప్రతి మతాన్ని వారి వేడుకలు, పండుగలు కూడా ఉంటాయి. అందరి మతాల ప్రకారం అందరి పండుగలు వేరే విధాలుగా ఉంటాయి. అయితే ఇస్లాం సన్మార్గ ధర్మంగా ప్రసిద్ధమయ్యింది.

ఇస్లాం ఒక శాంతి, సామరస్యం, సుఖం, మరియు విశ్వసృష్టికర్త అయిన అల్లాహ్ ప్రసాదించిన మంతం. (لا إله إلا الله محمد الرسول الله) చదివిన వారే ముస్లిములవుతారు. దీని అర్థం ఏం అంటే (దేవుడు తప్ప దేవుడు లేడు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని దూత). దీనిలో అల్లాహ్ తప్ప ఎవరికి కూడా పూజించే హక్కు ఎవరికి లేదు.

ఆయేషా (ర) యొక్క అధికారంపై సహీహ్ అల్-బుఖారీలో ప్రవక్త (స) ఇలా అన్నారు:"మా విశ్వాసానికి విరుద్ధంగా ఎవరు పని చేస్తే, అలాంటి చర్య తిరస్కరించబడుతుంది."

అదేరకంగా మరో ఉల్లేఖనం,"మన విశ్వాసంలో అసలు ఉనికిలో లేని దానిని ఎవరు కనిపెట్టినా, మనతో సంబంధం లేదు."

అల్లాహ్ ఇలా ఆదేశించారు:

أَمْ لَهُمْ شُرَكَاءُ شَرَعُوا لَهُم مِّنَ الدِّينِ مَا لَمْ يَأْذَن بِهِ اللَّـهُ ۚ وَلَوْلَا كَلِمَةُ الْفَصْلِ لَقُضِيَ بَيْنَهُمْ ۗ وَإِنَّ الظَّالِمِينَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ ٢١

ఏమీ? అల్లాహ్‌ అనుమతించని ధర్మాన్ని వారికొరకు విధించగల, ఆయన భాగస్వాములు ఎవరైనా వారి దగ్గర ఉన్నారా? ఒకవేళ తీర్పు దినపు వాగ్దానం ముందే చేయబడి ఉండకపోతే, వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి వుండేదే. మరియు నిశ్చయంగా, ఈ దుర్మార్గులకు బాధా కరమైన శిక్ష పడుతుంది. (అల్-షురా, 42:21)

సాంప్రదాయ ఫుకాహాలు సాధారణంగా ముస్లిమేతర పండుగలలో పాల్గొనకుండా ముస్లింలను నిషేధించారు. ఎందుకంటే ఈ పండుగలు మతపరమైన స్వభావంగా పరిగణించబడతాయి మరియు ఇస్లాం రాజీపడని బహుదేవతారాధన ఉండవచ్చు.

కొన్ని ముస్లిములు తమ ముస్లిమేతర స్నేహితులతో కలిసి బాల్యం నుంచే అలవాటు చేసుకుంటారు. తరవాత వాళ్ళకి దీనిలో చాలా ఆనందం కలుగుతుంది. కానీ ఇది కూడా సరికాదు. ఇలాంటి వారు ఈ సంగతి తెలియకుండా చేస్తారు. కానీ కొందరు ముఫ్తీలు ఈ పరిస్థితులలో కూడా మతేతర పండుగలలో మేము కూడా పాలపంచుకోవాలి అని ఫత్వులు జారీ చేస్తారు.

హిందూ ముస్లిములు కలిసి మెలిసి ఉండాలి. భారత దేశం చరిత్రలో హిందూ ముస్లిములు కలిసి పండుగలు చేసేవారు అనేదానికి ఇస్లాం విరుధ్ధంగా ఉండుదు. కాగా ఇతరుల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి.

 وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَالْعُدْوَانِ ۚ وَاتَّقُوا اللَّـهَ ۖ إِنَّ اللَّـهَ شَدِيدُ الْعِقَابِ

పుణ్యకార్యాలు మరియు దైవభీతి విషయాలలో, ఒకరికొకరు తోడ్పడండి. మరియు పాపకార్యాలలో గానీ, దౌర్జన్యాలలో గానీ తోడ్పడకండి. అల్లాహ్‌ యందు భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ శిక్ష విధించటంలో చాల కఠినుడు.

»من تشبه بقوم فهو منهم« صححه الألباني

"ప్రజలను అనుకరించే వారు వారిలో ఒకరు."

కాని ముస్లింలకు అనుమతించదగినది, తమ హిందూ స్నేహితుల పెళ్లిలో గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు సందర్శించాలి, ఇంకా కొన్ని విషయాలు పలుకు వచ్చు. రోజూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఓక వీధి నుంచి రోజూ ఒక ముసలమే అయన పైనా చెత్త వేసేది. ప్రవక్త ఏం చెప్ప కుండా రోజూ ఆ దారితోనే వెళ్ళే వారు. కానీ ఆ ముసలమే ఒక రోజు పడక మీద అనారోగ్యంగా పడింది. ఆవిడకి సహాయం చెయ్యడానికి యెవ్వరూ లేరు. అప్పుడు చీకటి రాత్రిలో ప్రకాశవంతమైన చంద్రుని వలె ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు.

మత విశ్వాసాలు మరియు ఆచారాలు వివిధ కమ్యూనిటీలలో మరియు అంతటా విస్తృతంగా మారుతుంటాయి మరియు మొత్తం వ్యక్తుల సమూహాల గురించి సాధారణీకరణలు చేయడం హానికరం మరియు సరికాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ముస్లింలు, ఇతర విభిన్న జనాభా వలె, మత రహిత పండుగలలో పాల్గొనడానికి విస్తృత దృక్పథాలను కలిగి ఉన్నారు.

కొంతమంది ఇస్లామిక పండితులు మతాంతర సంభాషణ మరియు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తారు. తేడాలను గౌరవిస్తూ భాగస్వామ్య విలువలను జరుపుకోవడానికి మార్గాలను కనుగొంటారు. ఇస్లామేతర పండుగలు జరుపుకోవడానికి ముస్లిం సమాజానికి అనుమతి లేదని ఈ కథనం రుజువు చేసింది.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter