జెరుసలమే ఎందుకు?

పాలస్తీనా అని పేరు వినగానే మనకు ఒకటే శబ్దం గుర్తుకొస్తుంది. అది (అల్ అక్సా మసీదు). ఇది పాలస్తీనా యొక్క రాజధాని జెరూసలేం లో ఉన్న ఒక పవిత్రమైన స్థలం. ఈ మసీదు ఉన్న పవిత్రమైన స్థలాన్ని పొందాలని ముస్లింలు, యూదులు మరియు క్రైస్తవులుందరూ గొడవ పడుతూ ప్రయత్నిస్తున్నాయి. కానీ ఈ లోకంలో ఎన్నో ఇతర మతాలున్నాయి. అంతేగాక ఒక మతానికి తమ యొక్క భగవంతుడితో ప్రార్థన చేయడానికి ఒక పవిత్రమైన స్థలం ఉంది. ముస్లింలకు మసీదు, హిందువులకి దేవాలయం, క్రైస్తవులకి చర్చ్. కానీ పలు మతాలు కలిసి ఒక స్థలానికి తమ పవిత్రమైన స్థలం అని కోరుకుంటారు. అదే మన పవిత్రమైన  అల్ అక్సా మసీదు వున్నా జెరూసలేం. అయితే ఈ మూడు మతాల యొక్క చరిత్ర ఏమిటి మరియు ఆ పవిత్రమైన స్థలం దక్కడం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారో  తెలుసుకుందాం.

ముస్లింలు:

ముస్లింల యొక్క చరిత్ర ఏమనగా, అల్ అక్సా మసీదు నిర్మాణం హజరత్ దావుద్ (అలైహిస్సలాం) ప్రారంభించింది  మరియు అయన తరువాత అయన యొక్క కుమారుడైన హజరత్ సులైమాన్ (అలైహిస్సలాం) ఆ మసీదు తమ యొక్క జిన్నుల సహాయంతో 705ce లో కట్టడం పూర్తిచేశారు. అంతేగాక సులైమాన్ (అలైహిస్సలాం) ఆ మసీదు కట్టేసమయంలో ఒక సంఘటన జరిగింది.

హజరత్ సులైమాన్ (అలైహిస్సలాం) అల్లాహ్ తో ఎక్కువగా తమ యొక్క చావు ఎవ్వరికి తెలియకూడదు మరియు ఎవ్వరికి తెలియకుండానే ప్రాణాలు విడవాలి అని ప్రార్దన చేసేవారు. అయితే ఆ మసీదు యొక్క పని జరుగుతూవుండగా హజరత్ సులైమాన్ (అలైహిస్సలాం) ఆ పని ఎలా జరుగుతోందో చూడ్డానికి వస్తారు. ఆ సమయంలో పనిచేస్తున్న ప్రతి యొక్క జిన్ ఆయనని చూసి భయంతో ఆ మసిదు యొక్క పని కోనసాగిస్తూవుంటారు. ఆప్పుడు సులైమాన్ (అలైహిస్సలాం) యొక్క చేతిలో ఒక ఆసా(కర్ర) వుంటుంది. ఆ యొక్క కర్ర సహాయంతో అయన దాని మీద తమ యొక్క చేతులను పెట్టి నిలబడతారు. అలాగే చూస్తూవుంటారు మరియు ఆ జిన్నులు కూడా మసీదు యొక్క పని కొనసాగిస్తూవుంటారు. అయన చూస్తూండగా శ్వాస ఆగిపోతుంది. కానీ అయన యొక్క శరీరం మాత్రం ఆ కర్ర సహాయంతో  అలాగే నిలిచివుంటుంది. ఎందుకంటే హజరత్ సులైమాన్(అలైహిస్సలాం) మూడు, నాలుగు రోజులు కదలకుండా అల్లాహ్ యొక్క ప్రార్థనలో నడిపేవారు.

అయితే అయన యొక్క జిన్నులు కూడా అయన ప్రార్థనలో వున్నారు అని అనుకుంటారు. కానీ , కొద్దీ రోజుల తరువాత ఒక చేదపురుగు  ఆ కర్ర యొక్క కింద భాగానికి కాస్త కొరికేస్తుంది. అయితే ఆ కర్ర యొక్క కొలత తగ్గడం వల్ల హజరత్ సులైమాన్ (అలైహిస్సలాం) యొక్క శరీరం కాస్త కిందకి వంగిపోతుంది. అప్పుడు అయన యొక్క జిన్నులకి ఆయన ప్రాణం విరిచారు అని తెలుస్తుంది. 

ఇంతేగాక ఈ అల్ అక్సా మసీదుకి ఇంకొక మహత్వం ఉంది. అది ఏమనగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇస్రా మరియు మేరాజ్ ప్రయాణం చేసేటప్పుడు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి అల్లాహ్ యొక్క ప్రవక్తలను ఆ మసీదులో రెండు రకాతుల నమాజ్ చదివించారు. ఆ తరువాత తమ యొక్క ప్రయాణం మొదలుపెట్టారు. 

మరియు ఆ మసీదు ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రవచనం ముందు ముస్లింల యొక్క మొదటి ఖిబ్లాగా ఉండేది. కానీ అల్లాహ్ యొక్క ఆదేశముతో కాబా ముస్లింల ఖిబ్లాగా మారిపోయింది 

కైస్త్రవులు

కైస్త్రవులని ఆంగ్లములో (Christians) అని పలుకుతారు. అయితే కైస్త్రవులు అని మతం పేరు వినగానే ఈసా (యేసు) గుర్తుకొస్తారు. అయితే ఆ మతం యొక్క చరిత్ర ఏమనగా, వారు ఆ మసీదుని గాక జెరూసలేం స్థలాన్ని పవిత్రమైన స్థలం అని భావిస్తారు, అయితే కైస్త్రవులు ఆ జెరూసలేం స్థలాన్ని అంత మహాత్వం ఎందుకు ఇస్తారంటే అక్కడ ఈసా (యేసు) 4 BC లో జన్మించారు. మరియు ఆ జెరూసలేంలో అంతటికంటే పెద్ద మరియు పవిత్రమైన (చర్చి ఆఫ్ ది హోలీ సెపల్చర్) (The Church of the Holy Sepulchre) పేరుతో ఒక చర్చ్ ఉంది. 12 వ శతాబ్దానికి చెందిన ఈ చర్చి క్రిస్టియన్ క్వార్టర్‌లో గోడలతో కూడిన జెరూసలేం ఓల్డ్ సిటీ లోపల ఉంది. ఇది క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రలలో ఒకటి, ఎందుకంటే ఇది యేసు శిలువపై మరణించి, ఖననం చేయబడిన మరియు మృతులలో నుండి లేచిన ప్రదేశంలో నిర్మించబడింది. అందుకని క్రైస్త్రవులు ఆ జెరూసలేంని పవిత్ర మైన స్థలం అని నమ్ముతారు. 

యూదులు:

యూదులులని ఆంగ్లములో (JEWS) అని పలుకుతారు మరియు మూసా(అలైహిస్సలాం) (బైబిల్ పేరు మోషే) కాలంలో తౌరాహ్, దీన్ని అనుసరించే వారు యూదులు. వారు కైస్త్రవుల లాగే ఆ అల్ అక్సా మసీదుని గాక జెరూసలేం స్థలాన్ని పవిత్రమైన స్తలంగా భావిస్తారు. ఎందుకంటే హజరత్ ముసా(అలైహిస్సలాం) యొక్క సమాధి(మఖ్బర) ఆ జెరూసలేంలోనే ఉంది. అంతేగాక జెరూసలేం వారి యొక్క పాపాలను విముక్తి తొలగించడానికి ఒక గోడ ఉంది. ఆ గోడ ద్వారా వారు వారి పాపాలను విముక్తి కల్పిస్తారు. ఆ గోడను ఆంగ్లములో (WAILING WALL) అని అంటారు. అంతేగాక యూదులు ఆ గోడను పవిత్రమైన గోడ అని కూడా నమ్ముతారు. అందుకే వారు జెరూసలేంను అంట మహాత్వం ఇస్తారు.

అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న జెరూసలేం కోసం ఈ మూడు మాతాలు యుద్ధం చేసుకుంటున్నారు.  అక్టోబర్ 7 వ తేదీన మొదలైన యుద్ధం ఇప్పటి వరకు ఆగలేదు. ఈ యుద్ధం ద్వారా ఎందురో పిల్లలు మరియు మహిళలు మరణించారు. అంతేగాక గాజాలో 4,506 కు పైగా పిల్లలు మరియు 3,027 వరకు మహిళలు తమ ప్రాణాలకు విడిచారు. అంతేగాక గాజాలో మొత్తం 11,078 పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయిల్ లో కూడా 11,000 కు పైగా చనిపోయారు. అయినా ఇప్పటికి వరకు యుద్ధం ఆగలేదు. ఇజ్రాయిల్ ద్వారా ఒక మిసైల్ గాజాలో వున్న అల్ షిఫా ఆసుపత్రి మీద  పడింది. అందులో వున్న ఎందురో  రోగులు మరియు వైద్యులు ఈ మిసైల్ యొక్క అగ్నిలో కాలిపోయారు.  గాజాలో వున్నా భవనాలు మిసైల్ ద్వారా కూలిపోయి, ఎన్నో కుటుంబాలకు ఉండటానికి  చోటు లేక రోడ్డున పడిపోయాయి. ఎందురో తల్లులు తమ చిన్న చిన్న పిల్లలను కోల్పోయారు.

ఇంత జరిగినా కూడా ఈ యుద్ధం ఆగలేదు. అయితే  ఇజ్రాయిల్  కి ఏమికావాలి? ఎందుకు ఇజ్రాయిల్ పాలస్తీనా మొత్తం తమ యొక్క గుప్పిట్లో తెచ్చుకోవాలి అని అనుకుంటోంది. పాలస్తీనా  యొక్క పవిత్రమైన స్థలం జెరూసలేంను తమ ఆదేశం లో తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే ఎన్నో సంవత్సరాలనుంచి జరుగుతున్నా గొడవలు ఇప్పుడు యుద్ధంగా మారాయి. అయితే  ఈ యుద్ధం గురించి మాట్లాడటానికి చాలా ఉంది మరియు గాజా ప్రజలు వారి భూమిలో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాలస్తీనా వారి యొక్క భూమి మరియు మన మనందరం కలిసి గాజాను ఆ క్రూర సైన్యం నుండి గాజాను రక్షించాలి!

ఈ యుద్ధం త్వరలో ముగుస్తుందని ఆశిస్తూ ........ 

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter