శుభ ఘడియాలను షాపింగ్ కోసం వృధా చేయకూడదు

పవిత్రమైన రమదాన్ నెల రాకతో ఆశీర్వాదాలు వెదజల్లిన విధంగా, రమదాన్ చివరి దశలో కూడా మనపై ఎన్నో బహుమతులను ఆశీర్వాదాలను కురిపించి మనకు వీడ్కోలు చెబుతుంది. ఈద్-ఉల్ ఫిత్ర్ యొక్క నెలవంక కనిపించగానే ఆకాశం ఆనందాలతో మెరిసిపోతుంది. ముస్లిములు ఒకరినొకరు కౌగిలించుకొని ఆనందాన్ని పంచుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ నెలవంక కనిపించిన వెంటనే మార్కెట్లలో మనలో కొందరు అభాగ్యులు కనిపిస్తారు. వాళ్లు షాపింగ్ల పై షాపింగ్లు, ఎక్కడ చూసినా అమ్మకాలు కొనటాలు... దీనితోనే అంత మార్కెట్ నిండి ఉంటుంది. బజారులలో చూస్తే, బట్టల షాపుల్లో అడుగు పెట్టేందుకు చోటు కూడా ఉండదు. చుట్టుపక్కల అంతా ఇదే సందడి. ఈ పవిత్ర రాత్రిలో ముస్లిం స్త్రీలలో సగణత్వం, సిగ్గు మానం వదిలేసి చాలా సాధారణంగా తిరుగుతూ ఉంటారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం కూడా లేదు. షాపింగ్ యొక్క పేరుతో స్త్రీలు పరాయి మగోళ్ళు కలవడం దీన్ని చూసి సైతాన్ కూడా సిగ్గుపడుతుంది. ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ కోసమే మొత్తం రమదాన్ నెల అన్న పానీయాలను విడిచి, షరియత్ యొక్క పరిమితుల్లో మన స్వయాన్ని ఉంచి దాని ద్వారా మంచి శిక్షణ తీసుకున్న తరువాత, మన హృదయాన్ని తప్పుల నుండి శుద్ధి చేసిన తర్వాత మన ఆత్మకోరికలను, దేహేచ్చలను నియంత్రించుకొని దాని ద్వారా అల్లాహ్ వద్ద సామీప్యం లభించిన పిమ్మట నెల అంతా కష్టపడినదంత ఒక్క క్షణంలో నేలపాలు చేయడం చాలా బాధాకరంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ధర్మ వ్యతిరేకమైన పనులు చేయబడతాయి. ఈద్ నెలవంక కనిపించిన తర్వాత ఆ రోజు కొన్ని ప్రాంతాలలో పండుగ అయిన రోజు అని ఎన్నో ధర్మ వ్యతిరేకమైన పనులు చేయబడతాయి. ఒక కార్యక్రమం పెట్టుకొని, అందులో పురుషులు స్త్రీలు అసభ్యతతో పాటలు పాడుతారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో మద్యం, కబాబులు సేవించి, అందులోనే ఆడుతూ పాడుతూ డాన్సులు వేస్తూ ఆత్మానందం కోసం నిర్లక్ష్యపు పనులు చేయడం ఇవన్నీ మనకు నరకంలోకి వెళ్లేందుకు దారిగా మారుతాయి. అసలు ఆరోజు నెలవంక కనిపించిన తర్వాత దాని గురించి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "లైలతుల్ జాయిజా" అని అన్నారు. అనగా ప్రతిఫలం యొక్క రాత్రి. ఇది మనం స్వయంగా మన ప్రార్థనలకు ప్రతిఫలం లభించే రాత్రి. ఎందుకంటే అల్లాహ్ మన కోసం పవిత్ర నెల రమదాన్ నెలలో మన కోసం ఎన్నో ఆశీర్వాదాలు బహుమతులు అందించాడు. దానిలో మేము ఎంత ఉపయోగించాము ఎంత మంచి పనులు చేసాము అవన్నీ చూసుకోవడం. రేపు మనం అల్లాహ్ వద్ద క్షమించబడతామా? మా పాపాలు, అతిక్రమాలు క్షమించబడతాయా? మనం ఉపవాసం స్ఫూర్తిని సాధించామా? మనం మన హృదయాలను పుణ్యాభరణాలతో అలంకరించుకున్నామా? మేము క్రమంగా తరావీహ్ పాటించామా? మేము పవిత్ర గ్రంథమైన ఖురాన్తో మన బంధాన్ని పెంచామా? మేము మనం అల్లాహ్ వద్ద క్షమించబడేలా ఏదైనా పనిచేసామా? అందువల్ల, ఈ రాత్రినే ప్రత్యేకంగా క్షమాపణ మరియు ప్రార్థనలు కోరుతూ గడపాలి. రమదాన్ మాసాన్ని నిర్లక్ష్యంగా గడిపినందుకు విచారణతో కన్నీళ్లు పెట్టుకోవాలి. అటువంటి చర్యలు ద్వారా అల్లాహ్ ప్రసన్నతను పొందటానికి కృషి చేయాలి. అయితే ఈ చంద్రుని రాత్రి మనం జీవితానికి సంతోషం, సౌలభ్యం యొక్క ప్రధాన మూలం అవుతుంది.

ఇప్పుడు ఈ పవిత్రమైన రాత్రి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రస్తావించారు "నా ఉమ్మత్ కి రమదాన్ నెలలో ప్రత్యేకంగా ఐదు విషయాలు ఇవ్వబడ్డాయి, అవి ఇతర ఉమ్మత్ వాళ్లకి దొరకలేదు,

1) వారి (ఉపవాస) నోటి వాసన కస్తూరి కంటే అల్లాహ్‌కు అత్యంత ప్రియమైనది. 

2) చేపలు కూడా వారి కోసం (ఉపవాసం ఉన్నవారి కోసం) ప్రార్థిస్తాయి. ఉపవాసం విరమించే సమయం వరకు అలానే కొనసాగుతాయి. 

3) అప్పుడు ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలా అంటారు మీ కష్టాలు తొలగించబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, మీరు నా దగ్గరకి వచ్చే రోజులు కోసం స్వర్గంలో ప్రతిరోజు అలంకరణ చేయబడుతుంది. 

4) సైతాన్లు బంధి చేయబడతాయి 

5) రంజాన్ యొక్క చివరి రాత్రిలో ఉపవాసులకి క్షమాపణ ఇవ్వబడుతుంది. అప్పుడు ప్రవక్త సహచరులు ప్రవక్తతో ఇలా అడిగారు ఇది క్షమాపణ ఇవ్వబడే రాత్రి లేదా ఖద్ర్ యొక్క రాత్రి అని అడిగారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు సల్లం ఇలా ప్రస్తావించారు: లేదు! అల్లాహ్ ఒక పద్దతిని ఎంచుకున్నాడు. ఒక శ్రమజీవి తమ పని అయిన తర్వాత అతనికి తన శ్రమఫలం (కూలి) ఇస్తాడు. 

దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా కూడా అన్నారు: అల్లాహ్ కోసం పుణ్యఫలాపేక్షహతో ఎవరైనా రెండు పండుగల రాత్రులలో (ప్రార్థనలు చేస్తూ) జాగారం చేస్తే హృదయాలు మూర్ఛపొయే రోజున అతని హృదయం సజీవంగా ఉంటుంది (ఇబ్న్ మాజహ్).  

ఇంకొకటి మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రస్తావించారు: ఎవరైతే ఈ ఐదు రాత్రులలో (ఆరాధన కోసం) మేలుకుంటాడో, అతనికి స్వర్గపు మార్గం సులువు అవుతుంది. ఆ 5 రాత్రులు ఇవి:

1) లైలతుల్ తర్వియ (8 జిల్ హిజ్జా రాత్రి) 

2) లైలతుల్ అరఫా (9 జిల్ హిజ్జా రాత్రి)  

3) లైలతుల్ నహర్ (10 జిల్ హిజ్జా రాత్రి/ ఈదుల్ అజ్హా యొక్క రాత్రి) 

4) లైలతుల్ జాయిజా (ఈద్ అల్-ఫితర్ రాత్రి) 

5) షబే బరాత్ (షాబాన్ పదిహేనవ రాత్రి)

ఈ రాత్రి యొక్క గొప్పతనం పైన పేర్కొన్న అన్ని ప్రవక్త హదీసులు నుండి ఈ రాత్రి క్షమాపణ రాత్రి అని తెలుస్తుంది. ఈ రాత్రి క్షమాపణ రాత్రి. ఈ రాత్రి ఆనందం పంచుకునే రాత్రి. ఈ రాత్రి హృదయానికి ప్రాణపోసే రాత్రి. ఈ రాత్రి స్వర్గంలో చేర్చే రాత్రి. కాబట్టి మనం ఈ రాత్రిని పనికిరాని పనుల్లో వృధా చేయకూడదు. షాపింగ్ మొదలైనవి ముందుగానే చేసుకోవాలి. అన్ని పనులను విడిచిపెట్టి ఆరాధనను హృదయపూర్వక అంకితం చేయాలి. వీలైతే పేదల కోసం కొంచెం దయ చూపి రాత్రిపూట సదఖతుల్ ఫిత్ర్ చెల్లించాలి. అప్పుడు పేదలు మీ సదఖాను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. మన ప్రార్థనలో ఆ చంద్రుడి రాత్రి రోజున మనకు ఆ రాత్రి గడిపే అవకాశాన్ని ప్రసాదించమని ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తో అడగాలి. దయచేసి మమ్మల్ని ప్రత్యేకంగా క్షమించమని మన పాపాల నుండి శుద్ధి చేయమని జీవితంలో మళ్ళీ మళ్ళీ రంజాన్ ప్రసాదించమని అడగాలి. అల్లాహ్ ఇవన్నీ ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను ఆమీన్!

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter