ముహర్రమ్ మాస శ్రేష్ఠత మరియు ఘనత
ముహర్రం అల్-హరమ్ ఒక గొప్ప మరియు ఆశీర్వాదమైన నెల, ఎందుకంటే ఈ నెల అన్ని ఇస్లామిక్ నెలలలో ఒకటి, మరియు ఇది ఇస్లామిక్ సంవత్సరంలో మొదటి నెల కూడా ఇమామ్ హుస్సేన్ (RA) అభిమానించేవారు, ఇంటిల్లపాలిధి, గ్రామాలు మరియు నగరాల్లో నలువైపుల అట్టహాసంగా వారి యొక్క అనుగ్రహాలను పూర్తి ఉత్సాహంతో వితరణ చేస్తారు. కానీ ఆధునిక యుగంలో, కొన్ని పుస్తకాల గురించి చాలా అవాస్తవికమైన మరియు కల్పితమైన సంప్రదాయాలు చలామణిలో ఉన్నాయి. పండితుల ప్రసంగాన్ని ఆలపించిన లేదా విన్న తర్వాత ప్రజల్లో దుఃఖం వంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి కల్పిత సంప్రదాయాలను వివరించడం చట్టవిరుద్ధం.
ముహర్రం ఇస్లామిక క్యాలెండర్ యొక్క మొదటి నెల, ముస్లింలకు ముఖ్యమైనది మరియు పవిత్రమైనది. ముహర్రం నాలుగు నిషిద్ధ నెలల్లో ఒకటి. అనగా ఈ నాలుగు మాసాలలో యుద్ధం చేయటం నిషేదించబడింది. దీని మూలం పవిత్రమైన ఖురాన్‌లో పేర్కొనబడింది. ఆ నెలల గురించి అల్లాహ్ పవిత్రమైన గ్రంథలో కూడా ప్రస్తావించాడు, "మొత్తం 12 చంద్రనెలలు ఉన్నాయి, అందులో 4 పవిత్రమైనవని." ఈ నెలలు: 1) దుల్-ఖాయిదా, 2) దుల్-హిజ్జా, 3) ముహర్రం, మరియు 4) రజబ్. అల్లాహ్ ఈ నెలలను గౌరవించాలని, ఈ నెలల్లో యుద్ధాలు చేయవద్దని కోరుతున్నాడు. ఈ నెల గురించి ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా బోధించారు:
عَنْ أَبِي هُرَيْرَةَ، رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم: "أَفْضَلُ الصِّيَامِ بَعْدَ رَمَضَانَ شَهْرُ اللَّهِ الْمُحَرَّمُ، وَأَفْضَلُ الصَّلَاةِ بَعْدَ الْفَرِيضَةِ صَلَاةُ اللَّيْلِ" رَوَاهُ مُسْلِمٌ.
ఈ హదీస్ యొక్క అర్థం ఏమనగా: రంజాన్ తరువాత పవిత్ర మరియు అత్యుత్తమ ఉపవాసం అల్లాహ్ యొక్క ముహర్రం నెలదే మరియు ఫరజ్ ప్రార్థనల తర్వాత అత్యుత్తమ ప్రార్థన రాత్రి పూట చేసే ప్రార్థనే.
ముహర్రం యొక్క ప్రాముఖ్యత మరియు ఆచారాలు:
ముహర్రం మాసం యొక్క మొదటి రోజున ఇస్లామ్ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబ్బీ క్యాలండర్ యొక్క మొదటి నెల. ముహర్రం ఇస్లామిక క్యాలెండర్ లో ఒక ప్రాముఖ్యతమైన నెల. అరబ్బీలో "నిషేధించబడిన" అని అర్థం. అల్లాహ్ యొక్క పవిత్రమైన గ్రంథం ఖురాన్ ప్రకారం అల్లాహ్ 12 చంద్రిక నెలలను నియమించాడు. అందులో నాలుగు 4 నెలలు పవిత్రమైన నెలలుగా ప్రకటించాడు. ముస్లింలు ఈ నాలుగు మాసాలలో ఏ పాపం చేయకుండా అల్లాహ్ యొక్క ప్రార్థనలోనే గడుపుతారు. ముహర్రం నెల గురించి అల్లాహ్ పవిత్ర ఖురాన్‌లో ఇలా శెలవిచ్చాడు:
إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ ۚ فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
ఈ శ్లోకాల ప్రకారం హజరత్ ఇబ్న్ కసీర్(రహిమహుల్లాహ్) తమ యొక్క పుస్తకంలో ఇలా అన్నారు: అల్లాహ్ తన సృష్టి నుండి ఉత్తమమైన వాటిని ఎంచుకున్నాడు: అల్లాహ్ మానవజాతి నుండి తన యొక్క ప్రవక్తలను ఎన్నుకున్నాడు. సాధారణంగా పలికే అక్షరాలలో తన యొక్క ప్రార్థనను ఉత్తమంగా ఎంచుకున్నాడు. మసీదులను భూమిపై అత్యుత్తమ ప్రదేశాలుగా ఎంచుకున్నాడు. మాసాలలో రంజాన్ మరియు పవిత్ర నెలలను ఉత్తమమైనవిగా ఎంచుకున్నాడు. కాబట్టి, జ్ఞానవంతులు అర్థం చేసుకునేవారు అల్లాహ్ ఎంచుకున్న దానిని గౌరవిస్తారు. అందువలన అల్లాహ్ దానిని ఆ విధంగా ఎంచుకున్నందున ముహర్రం ప్రత్యేకమైనది. అయితే ఇలాంటి పవిత్ర మాసంలో మనం ప్రతి చిన్న తప్పుల నుంచి దూరంగా ఉండాలి. మనం మంచి ఉద్దేశాలను కలిగి ఉండాలి. ధర్మంగా ప్రవర్తించాలి, పాపాలకు దూరంగా ఉండాలి.
ఆషూరా:
ముహర్రం యొక్క 10వ రోజును ఆషూరా అంటారు. ఆ ఆషూరా ముస్లింలకు చాల ముఖ్యమైన, పవిత్రమైన రోజు. అలాగే ప్రవక్త ముహమ్మద్ (స) ఆషూరా గురించి ఒక హదీస్ ప్రవచించారు:
عَنْ ابْنِ عَبَّاسٍ، رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ: "كَانَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم يَصُومُ يَوْمَ عَاشُورَاءَ، وَيُوصِي بِصِيَامِهِ.
ప్రవక్త ముహమ్మద్ (స) ఆషూరా రోజున ఉపవాసం ఉండేవారు మరియు ఆయన తమ సహచరులను ఉపవాసం ఉండమని సెలవిచ్చారు.
ఆషురా రోజు యొక్క చరిత్ర ప్రాముఖ్యత:
ఆషురా రోజు ఇస్లాంలో చాలా ముఖ్యమైన, ప్రత్యేకమైన రోజు. ఇస్లాం యొక్క చరిత్రలోని ముఖ్యమైన సంఘటనలెన్నో ఈ రోజుతో ముడిపడి ఉన్నాయి.
- ఆషురా రోజున అల్లాహ్ హజ్రత్ ఆదం (అ) యొక్క పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు.
- ఇదే రోజున నూహ్(అ) యొక్క పెద్ద పడవను వినాశకరమైన వరద నుండి అల్లాహ్ ద్వారా రక్షించబడింది.
- ఇదే రోజున అల్లాహ్ ఇబ్రహీం (స) ను తమ యొక్క ‘ఖలీలుల్లా’గా ఎన్నుకున్నాడు మరియు ఆయనను అగ్నిలో పడకుండా రక్షించాడు.
- అంతేగాక అదే రోజున, హజ్రత్ యూసుఫ్ (S) జైలు నుండి విడుదలై ఈజిప్ట్‌లో గవర్నర్ అయ్యారు.
- ఇదే రోజున హజ్రత్ యూనుఫ్ (ఎ) చాలా కాలం తర్వాత యాకూబ్ (ఎ) ని కలిశారు.
- అంతేగాక ఇదే రోజున హజ్రత్ మూసా (అ) ఉమ్మత్ కోసం తౌరాత్ అవతరించబడింది
- ఇదే రోజున హజ్రత్ అయ్యూబ్ (ఎ) తీవ్ర అనారోగ్యంతో కోలుకున్నారు.
- ఇదే రోజు హజ్రత్ ఈసా (అ) యూదుల దుండగుల నుండి రక్షించబడిన తరువాత ఆకాశానికి ఎత్తబడ్డాడు.
- ఇదే రోజున, కూఫాకు చెందిన నమ్మకద్రోహులు కర్బలా యుద్ధంలో ప్రవక్త మనవడైన హజ్రత్ హుసైన్ (ర) మరియు వారి కుటుంబాన్ని హతమార్చారు.
ఆషూరా ఉపవాసం యొక్క ఘనత:
1)-عَنِ ابْنِ عَبَّاسٍ، قَالَ قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم " صُومُوا يَوْمَ عَاشُورَاءَ وَاغْتَنِمُوا فِيهِ، وَصُومُوا قَبْلَهُ يَوْمًا أَوْ بَعْدَهُ ".
ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అన్నారు: ఆషూరా రోజున ఉపవాసం ఉండండి, యూదులతో విభేదించండి, (ఆషూరా) ముందు రోజు లేదా మరుసటి రోజు ఉపవాసం ఉండండి.
2)عَنِ ابْنِ عَبَّاسٍ، قَالَ قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم " إِنْ بَقِيتُ إِلَى قَابَلِ السَّنَةِ لأَصُومَنَّ التَّاسِعَةَ "
తొమ్మిదవ మరియు పదవ తేదీలలో ఉపవాసం ఉండేందుకు, ప్రవక్త ముహమ్మద్ (స) ఇలా అన్నారు "నేను వచ్చే సంవత్సరం జీవించి ఉంటే తొమ్మిది మరియు పదవ తేదీలలో ఉపవాసం ఉంటాను."
3) عَنِ ابْنِ قَتَادَةَ، عَنْ أَبِيهِ، عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ: "صِيَامُ يَوْمِ عَاشُورَاءَ، أَحْتَسِبُ عَلَى اللَّهِ أَنْ يُكَفِّرَ السَّنَةَ الَّتِي قَبْلَهُ"
మరొక హదీసులో ప్రవక్త (స) ఇలా అన్నారు (ఆషూరా రోజున ఉపవాసం, దాని ముందు వచ్చిన సంవత్సరానికి అల్లాహ్ ప్రాయశ్చిత్తం చేస్తాడని నేను ఆశిస్తున్నాను).
అయితే, సున్నీ మరియు షియా ముస్లింలకు అషురా ముఖ్యమైనది, కానీ వారు దాని అర్థాన్ని భిన్నంగా చూస్తారు:
ముస్లింలకు అషురా: అల్లాహ్ ప్రవక్త మూసా (అ) ను రక్షించిన రోజును అషూరా గుర్తుచేస్తోంది. వారి ప్రజలు ఫిరౌన్ మరియు అతని సైనికుల నుండి రక్షించబడ్డారు. ఈ కారణంగా యూదులు ముహర్రం నెల పదవ (10) రోజున ఉపవాసం ఉండేవారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ (స) యూదుల దగ్గరకు వచ్చి ఇలా ప్రశ్నించారు "మీ కన్నా మూసాపై మాకు ఎక్కువ హక్కు ఉంది" అందుకని ప్రవక్త కూడా ఉపవాసం పెట్టారు. అప్పటినుంచి అయన యొక్క సహచరులు కూడా ఆషూరా రోజున ఉపవాసం పెట్టడం మొదలుపెట్టారు. అల్లా యేసును (ఇసా) సృష్టించాడు. అల్లాహ్ (ఇసా) ను మొదటి ఆకాశంలోకి ఎత్తుకున్నాడు. ఈ సంఘటనలు మొత్తం ఈ ఆషూరాలోనే జరిగాయి. ఈ కారణంగా ముస్లింలు ఉపవాసం ఉంటూ మసీదులలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడం ద్వారా అషురాను వేడకగా జరుపుకుంటారు. అంతేకాకుండా ప్రవక్త హదీసు ద్వారా ఈ ఆషూరా ఉపవాసం ద్వారా గత సంవత్సర పాపాలను అల్లాహ్ క్షమిస్తాడని నమ్ముతారు.
కర్బలా సంఘర్షణ: ఒక్క పెద్ద యుద్ధం ఇరాక్ లోని కర్బాలా అనే స్థలంలో 680 CE అక్టోబర్ 10న జరిగింది. ఈ యుద్ధం యజీద్ మరియు ప్రవక్త (స) యొక్క మనవడైన హజరత్ హుసైన్ బిన్ అలీ(ర) మధ్యలో జరిగింది. ఆ సమయంలో యజీద్ తన తండ్రి ముఆవియా తర్వాత నాయకుడయ్యాడు. అయితే అలీ ఇబ్న్ అబీ తాలిబ్ మరియు వారి కుటుంబ మద్దతుదారులు హుస్సేన్ (ర) ను కూఫాకు ఆహ్వానించారు. ఎందుకంటే కూఫా వారు హజరత్ హుసైన్(ర) కు తమ యొక్క నాయకుడుగా కావాలని కోరుకున్నారు. అయితే అయన యొక్క సహచరులు ఆయనను కూఫా వెళ్ళడానికి నిరాకరించారు. కానీ కూఫా నుంచి అయన కోసం చాల లేఖలు రావడంతో అయన కచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ కూఫా యొక్క పరిస్థితి ఎలా ఉందో కనుక్కోడానికి హజరత్ హుసైన్(ర) ముస్లిం బిన్ అకీల్ ను కూఫాకు పంపారు. అయితే అక్కడ అయన పరిస్థితులను చూసి మొత్తం బాగున్నాయని ఒక లేఖ ఆయనను పంపారు. ఆ తరువాత యజీద్ ముస్లిం బిన్ అకీల్ ను చంపేశాడు. అంతలోనే ఇమామ్ హుస్సేన్ తన కుటుంబం మరియు అనుచరులతో మక్కా నుండి రవాణా అయ్యారు. కూఫా ప్రజలు తమకు ఆదరంగా స్వాగతం పలుకుతారని ఆయన ఆశించారు. అయినప్పటికీ, అయన కర్బలా చేరుకున్నప్పుడు ఉబైదుల్లాహ్ ద్వారా పంపిన సుమారు 4,000 మంది సైనికులతో కూడిన పెద్ద సైన్యం ఉమర్ ఇబ్న్ సాద్ నేతృత్వంలో అతనిని ఎదుర్కొన్నారు. కానీ హుసైన్ బృందంలో కేవలం 72 మంది యోధులు మాత్రమే ఉన్నారు.
యజీద్ సైన్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, హజరత్ హుసైన్ (ర) మరియు అయన సహచరులు ఎక్కువ సమయం పాటు ధైర్యంగా పోరాడారు. కానీ అలాగే పోరాడుతూ అయన మరియు ఆయన యొక్క కుటుంబంతో పాటు వీరమరణం పొందారు. అంతేగాక హాజరత్ హుసేన్(ర) తో సహా యుద్ధంలో మరణించిన వారి మృతదేహాలు చాలా ఘోరంగా ప్రవర్తించబడ్డాయ. ఆ తర్వాత అయనతో పాటు కలిసి ప్రయాణించిన స్త్రీలు, ఆయన్ని యొక్క సోదరి జైనబ్ (ర) వంటి వారిని బంధించి డమాస్కస్‌లోని యజీద్ దగ్గరకు తీసుకెళ్లారు.
కర్బలా యొక్క సంఘటన త్యాగానితకి మారుపేరుగా పరిగణించబడుతుంది. సవాళ్లతో సంబంధం లేకుండా సత్యంతో నిలబడాలని ముస్లింలకు బోధిస్తుంది.