స్త్రీ వాదం

 స్త్రీ వాదం  ఈ పదం మీరు తరచుగా ఈ మధ్యకాలంలో వింటుంటారు, ఇంగ్లీషులో చెప్పాలంటే ఫెమినిజిమ్. స్త్రీవాద ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆడ, మొగ అనే తేడా లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలి, అలాగే ఇద్దరికీ సామాజికంగా ఆర్థికంగా, రాజకీయంగా సమాన హక్కులు మరియు అవకాశాలు ఇవ్వాలి అని. ప్రతి ఒక్కరికి వాళ్ల జీవితాల గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉండేలా చూడడం ఇంకొక ఉద్దేశం.

పై ఇచ్చిన నిర్వచనం ఎంత చదవడానికి ఎంత తియ్యగా ఉన్నా ఇస్లాం ప్రకారం చుస్తే ఇది పనికిమాలిన చెత్తతో సమానం. ఔను మీరు విన్నది నిజమె. ఇస్లాం మతంలో స్త్రీలు మరియు పురుషులు సమానులు కారు, అభిన్నులు. ఒకవేళ ముందుగా ఇచ్చిన నిర్వచనాన్ని కనుక మేము తీసుకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

"నేను స్త్రీవాదిని కాబట్టి పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసుకోను",

"నేను స్త్రీవాదిని కాబట్టి నేను ఉద్యోగం చేసి తీరాలి",

"ఒక సాధారణ గృహిణిగా ఉంటే నేను స్త్రీవాదిని కాను, నేను వంట చేయడం ఇల్లు సర్దడం లాంటి పనులు చేయలేను అది నా సాధికారతకు అడ్డు, ఒక పని మనిషిని పెట్టుకొని ఆమెతో వంట చేయించుకుంటా"

"నాకు మొగాళ్లు అంటే కోపం అందుకే నన్ను అందరూ స్త్రీ వాది అంటారు"

"నేను నా సొంత కాళ్లపై నిలబడాలి"

"నా దేహం నా ఇష్టం" వంటివి ఎన్నో ఉన్నాయి.

స్త్రీవాదులకు ఎక్కువగా మతాలపై  విశ్వాసం చూపరు. ముస్లిం స్త్రీవాదులలోలైతే క్రమంగా మత భ్రష్టత్వముకు పాల్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

బాల్యం నుండి సరైనా శిక్షణ లేనందున మన పిల్లలు శత్రువుల కుట్రకి మరియు పన్నాగానికి గురైతారు.కొంతమంది ముస్లింల భర్తలు తమ భార్యలతో ప్రవర్తించే శైలి మరియు వారి న్యాయమైన మనోవేదనలతో ఇది ప్రారంభమవుతుంది. మన సమాజంలో ముస్లిం మహిళల హక్కుల పై ఉల్లంఘనలు జరగడం గమనార్హం. వీటిని కొన్ని ముస్లిమ్స్ స్థాపనలు పట్టించుకోవడం ఇంకా బాధాకరమైన విషయం. ముందుగా ముస్లిం మహిళలు తమ భర్తల ప్రవర్తనలపై అసమ్మతి చూపుతారు, తర్వాత వీళ్ళకి ఇస్లాం పై విరక్తి కలుగుతుంది అట్నుంచి వాళ్లు ఇస్లాం బోధనలు మరియు పాఠాలను నిరాకరిస్తూ ఇస్లాంని వదిలివేయడం క్రమంగా కొనసాగుతుంది. కావున మొగవారు తమ భార్యలతో ప్రేమానురాగాలతో వ్యవహరిస్తే ఈ ముప్పు ఎప్పటికీ రాదు. మహిళ ఓ విశ్వవిద్యాలయం లాంటిది తనని కోల్పోవడం ఓ విశ్వవిద్యాలయాన్ని కోల్పోయినట్టే.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter