ఉపవాసం మరియు సహనం
ఉపవాసం సహనంలో సగం మరియు పాపాల నుండి రక్షణ కల్పించే ఒక డాలు వంటిది. ఇది క్రమశిక్షణను పెంచి, చెడు అలవాట్లను వదిలేలా మనిషిని ఆధ్యాత్మికంగా సిద్ధం చేస్తుంది.
మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రస్తావించారు "ఉపవాసం అనేది సహనంలో సగం" (తిర్మిదీ)
సహనం, అనగా మన ప్రతిచర్యలను నిలిపివేయడం, మన భావోద్వేగాలను నియంత్రించడం మరియు అల్లాహ్ తఆలా కొరకు మనం ఇష్టపడని పనిని చేయడంలో పట్టుదలతో ఉండటాన్ని సూచిస్తుంది.
అల్లాహ్ తఆలా వైపునకు మన ప్రయాణంలో, సహనం ఒక కీలక పాత్ర. సహనం యొక్క ప్రతిఫలం ప్రత్యేకమైనది. అల్లాహ్ ఖురాన్ లో తెలియజెసాడు:
إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ ١٠
"నిశ్చయంగా, సహనం వహించిన వారికి లెక్క లేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది".
ఉపవాసం లాగే సహనం యొక్క బహుమతి కూడా పేర్కొనబడలేదు. ఇది ఒక ఆశ్చర్యాన్ని మిగిలుస్తుంది. ఎందుకంటే, ఇది సాధించడానికి కష్టమైన లక్షణం, పట్టుదల మరియు వదులుకోకపోవడం, ఫిర్యాదు లేకుండా జీవిత కష్టాలను భరించడం మరియు అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడటం ఇవన్నీ గొప్పవారి లక్షణం. ఇంకా అల్లాహ్ తఆలా ప్రస్తావించివన వాటిలో ఒకటి:
يَا بُنَيَّ أَقِمِ الصَّلَاةَ وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ وَاصْبِرْ عَلَىٰ مَا أَصَابَكَ ۖ إِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ ١٧
"ఓ నా కుమారా! నమాజ్‌ను స్థాపించు మరియు ధర్మాన్ని ఆదేశించు మరియు అధర్మాన్ని నిషేధించు, ఆపదలో సహనంవహించు. నిశ్చయంగా, ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన విషయాలు. "
సహనం అనేది అల్లాహ్ యొక్క క్షమాపణ, దయ మరియు మార్గదర్శకత్వం పొందటానికి ఒక మార్గం. ఇది ప్రాపంచిక మరియు శాశ్వతమైన విజయానికి రహస్యం. ఇది ఒకరి శత్రువుల నుండి రక్షించబడటానికి మరియు విశ్వాసులకు ఆదర్శనంగా మారడానికి సాధనం. సహనం అల్లాహ్ యొక్క ప్రత్యేక సహవాసాన్ని ఆస్వాదించడానికి, అతని ప్రేమను పొందటానికి ఒక దారి.
సహనం మూడు రకాలు.
ఉపవాసం మూడు రకాల శబరాలను మిళితం చేస్తుంది:
1 :అల్లాహ్ కు విధేయత చూపడంలో సహనం.
సహనం యొక్క మొదటి రకం అల్లాహ్ ఆదేశాలపై పట్టుదలతో మరియు స్థిరంగా ఉండటం. రంజాన్ అంతటా, రాత్రి ప్రార్థనల సమయంలో ఎక్కువసేపు నిలబడి, ఖురాన్ పారాయణంలో ఎక్కువ సమయం గడపడం మరియు మసీదులో ఇ'తికాఫ్ కోసం సహనం అవసరం.
కొన్ని దేశాలలో తమ రోజు వారి పనులు చూసుకొని, చాలా సేపు పని చేసి దాని తరువాత కూడా 20కి పైగా గంటలు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. ఇలా ఉండటం అంత సులభం కాదు. ఆ విధంగా, అల్లాహ్ కొరకు ఆకలి, దాహం మరియు అలసటను భరించడం వల్ల మన సహనం అభివృద్ధి చెందుతుంది.
2 : అల్లాహ్ నిర్ణయించిన పరీక్షలకు సంబంధించి సహనం.
ఉపవాసం ఆత్మను కష్టాలను భరించేలా చేస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క సంకల్ప శక్తిని అభివృద్ధి చేస్తుంది. క్రమం తప్పకుండా (మరియు సరిగ్గా) ఉపవాసం చేసే వ్యక్తి జీవిత సవాళ్లను సహనం మరియు ధైర్యంతో ఎదుర్కోవటానికి మరింత సంసిద్ధంగా ఉంటాడు.
3 : పాపాలకు దూరంగా ఉండటంలో సహనం.
సహనం యొక్క మూడో రకం పాపాలకు దూరంగా ఉండటం.
ముఖ్యంగా ఉపవాసం, ఈ రకమైన సహనాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి రూపొందించబడింది. అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రస్తావించారు, "ఉపవాసం (నరకం నుండి) ఒక కవచం" (తిర్మిది)
ఉపవాసం ఆహారం పట్ల, కామాన్ని, దురాశను నిరోధిస్తుంది. ఉపవాసంలో నాలుక, కళ్ళు, చెవులు మొదలైన వాటికి కూడా 'ఉపవాసం' ఉంటుంది. ఈ ప్రేరణలను నియంత్రించడం వల్ల మనం సైతానుకు, పాపానికి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది జరిగినప్పుడు, మన హృదయాలు శుద్ధి చేయబడతాయి, మరియు నరకం యొక్క శిక్ష నుండి రక్షించబడతాము.
ఇమామ్ అల్-గజాలీ (రహ్మతుల్లాహ్ అలైహి) ఉపవాసం ఉన్నవారిని మూడు వర్గాలుగా వర్గీకరించారు:
1 : సామాన్యులు.
ఆహారం, పానీయం మరియు సాన్నిహిత్యానికి దూరంగా ఉండటం.
2: శ్రేష్ఠులు.
మన కళ్ళ హరామ్ చూడ్డం నుండి మరియు మనకు అల్లాహ్ యొక్క జ్ఞాపకం నుండి దూరం చేసే అన్ని విషయాల నుండి దూరంగా ఉండటం,
అబద్ధం, పరోక్షచర్చ, వాదించడం మరియు అసభ్యకరమైన భాష మొదలైన వాటి నుండి నాలుకను రక్షించడం.
హరామ్ వినకుండా చెవులను రక్షించడం.
మిగిలిన శరీరాన్ని హరామ్ నుండి రక్షించడం.
ఇఫ్తార్ సమయంలో కడుపు నిండా తినకూడదు.
అల్లాహ్ మీ ఉపవాసాన్ని అంగీకరిస్తాడని ఆశిస్తూ, అదే సమయంలో మీ ఉపవాసం ఆమోదించబడదని భయపడుతూ ఉండాలి.
3: మహా శ్రేష్ఠులు
అల్లాహ్ ను తప్ప సర్వ ప్రాపంచిక ఆలోచనలు, ఆందోళనలు మరచి అన్నిటికీ దూరంగా ఉండటం.
ఒకసారి ప్రవక్త గారితో ఇలా అడిగారు, "ఉపవాసం ఉన్నవారిలో ఎవరు ఉత్తములు? ఆయన ఇలా జవాబిచ్చారు "అల్లాహ్ ను ఎక్కువగా స్మరించుకునే వారు" (అహ్మద్).
ఉపవాసం అనేది శారీరక మరియు ఆధ్యాత్మిక. నిర్విషీకరణ: ఇది శరీరం మరియు ఆధ్యాత్మిక హృదయం నుండి విషాన్ని తొలగిస్తుంది. మన శరీరాలు మరియు ఆత్మలను నయం చేయడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి వీలు కల్పిస్తుంది. ఉపవాసం అనేది పాపం చేయడాన్ని, ముఖ్యంగా నాలుక మరియు కళ్ళ యొక్క పాపాలను ఆపడానికి మనకు సహాయపడే ఒక శిక్షణా కార్యక్రమం.


