ఉపవాసం యొక్క లక్ష్యం: తఖ్వా
ఉపవాసమనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆరాధన. ఇది మన బాహ్య, లోపల రూపాన్ని సరిదిద్దుతుంది.
అల్లాహ్ మనకు ఉపవాసం ఉండటానికి ఆజ్ఞాపించాడని మనం ఉపవాసం ఉంటున్నాము. మన మతం ఇస్లామ్ ఇతర ఆజ్ఞల మాదిరిగానే ఉపవాసం కుడా ఒక ప్రధానమైనది. ఉపవాసం మనకు అల్లాహ్ వద్ద సమర్పించుకోవడానికి, అల్లాహ్ పట్ల విధేయత చూపడానికి శిక్షణ ఇస్తుంది. అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الصِّيَامُ كَمَا كُتِبَ عَلَى الَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ ١٨٣
ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబడి ఉండెనో – బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!
ఉపవాసం యొక్క ప్రధానోద్దేశ్యం తఖ్వా సాధించడం. తఖ్వా అంటే అల్లాహ్ యొక్క నిషేధాలను నివారించడం మరియు అతని ఆదేశాలను అమలు పరచడం ద్వారా అల్లాహ్ యొక్క శిక్ష నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం.
ఒక విశ్వాసి అల్లాహ్ వైపు చేసే ప్రయాణంలో యొక్క ముఖ్య సాధన తక్వా.
మన ప్రపంచంలో ఎన్నో ప్రవక్తలు వచ్చారు వారు తమ ప్రజలకు అల్లహ్ని ఆరాధించామని మరియు తక్వాతో జీవితం సాధించామని ఆదేశించేవారు.
తక్వా మనకు అల్లాహ్ యొక్క ప్రేమ, దయ మరియు సహాయాన్ని పొందడానికి మార్గంగా ఉంటుంది. తఖ్వా మనకు సత్యం మరియు అబద్ధాల మధ్య తేడాను గుర్తించడానికి, షైతాన్ను అధిగమించడానికి, మన శత్రువులపై విజయం సాధించడానికి కలిపిస్తుంది. తక్వా ద్వారా, మన పాపాలు క్షమించబడతాయి. గొప్ప బహుమతులు అందుతాయి. మన పనులు అల్లాహ్ వద్ద స్వీకరించబడుతాయి. తక్వా ద్వారా, మన కష్టాలు తగ్గుతాయి, మరియు అల్లాహ్ అల్-రజాక్ (అంతిమ ప్రదాత) మనం ఊహించలేని మూలాల నుండి మనకు తమ ఆహారాన్ని అందిస్తాడు! తక్వా అనేది విజయానికి అంతిమ అంశం, ఎందుకంటే ఇది నరకం (అగ్ని) నుండి కవచం మరియు స్వర్గానికి మార్గం.
ఉపవాసం వల్ల తక్వా ఎలా అధికమవుతుంది?
ఉపవాసం యొక్క ఉద్దేశ్యం దేహేచ్ఛలను ప్రతిఘటించడానికి శిక్షణ ఇవ్వడం.
మనం ఉపవాసం ఉన్నప్పుడు, తాత్కాలికంగా మన మీద సాధారణంగా హలాలైన వస్తువులను నిరోధిస్తాము. (తినడం, త్రాగడం మొదలైనవి). ఉపవాసం మన (నఫ్స్) దేహేచ్ఛలను 'వద్దు చేయద్దు' అని చెప్పడం నేర్పుతుంది. ఇది తక్వా పురోగతికి సహాయపడుతుంది. పూర్తి ఏడాది హరామ్ నుండి మనల్ని మనం నిరోధించుకోవడానికి కూడా సులభం చేస్తుంది.
అందువల్ల, ఉపవాసం అనేది మనమంతటా మనమే అల్లాహుకు విధేయత చూపే శిక్షణిస్తుంది.
మనం ప్రతిరోజూ ఒకే సమయంలో తినడం మరియు త్రాగడం అలవాటు చేసుకున్నప్పుడు, మన శరీరాలు ఆ సమయాన్ని దాటినప్పుడు ఉపవాసం చేయడం ద్వారా, మన నఫ్స్ దాని కోరికలకు లొంగిపోవడానికి నిరాకరిస్తూ, అది అలవాటుపడిన దాని నుండి దూరంగా ఉంటాము. మన నఫ్స్ మనల్ని నియంత్రణ చేసే బదులుగా మనమే మన ఆత్మని నియంత్రిస్తున్నాము.
రెండు ప్రధఆన మార్గాల ద్వారా సైతాను మనుషులను సులభంగా చేరుకోగలడు.
- షహావత్ః ఇవి మనం అనుభవించే కోరికలు మరియు ప్రాపంచిక ఆకర్షణలు, ముఖ్యంగా వ్యక్తిగత భాగాలు మరియు కడుపులో కలిగే కోరికలు. షహవత్ అనేది మన ప్రవర్తనలకు మరియు చర్యలకు సంబంధించినది.
- సంశయాలు ఇవి అల్లాహ్ యొక్క ఆజ్ఞల గురించి, మరియు బహుశా అల్లాహ్ గురించి కూడా మనకు కలిగే సందేహాలు.
సంశయాలు విశ్వాసం (నమ్మకం) మరియు జ్ఞానానికి సంబంధించినది.
ఉపవాసం ఉన్నప్పుడు, మన ఆహారం మరియు పానీయాల తీసుకోవడం తగ్గించి, మన కోరికలపై కఠినంగా అణిచివేస్తే పాలనను కలిగి ఉంటాము. ఇది మనపై దాడి చేయగల షైతాన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, అందువల్ల అతని గుసగుసలకు మనం బలైపోయే అవకాశం తక్కువ ఉంటుంది. ఇలా దీని వల్ల, పాపం తక్కువ చేసే అవకాశాలు తక్కువుంటాయి. మన హృదయాలు శుభ్రమవుతాయి, సంశయాలు మన హృదయాల్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి.
మనం సత్యాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతాము. దాని వల్ల మన సృష్టికర్తకు దగ్గరవుతాము, నిజమైన ఆనందాన్ని, సంతృప్తిని పొందుతాము. మన శాశ్వత నివాసం (జన్నత్) వైపు ముందుకు సాగుతాము. అల్లాహ్ పవిత్ర గ్రంధంలో ప్రస్తావించాడు:
وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ
మరియు తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందన్న భయంతో తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తికి నిశ్చయంగా, స్వర్గమే, అతని నివాసస్థాన మవుతుంది!
అనంత విజ్ఞానం
అన్ని ఇతర ఆరాధనల వలె, ఉపవాసం వల్ల అనేక ప్రయోజనాలు మరియు జ్ఞానాలు కలుగుతాయి. ఉపవాసం మన కోరికలు, అలవాట్లు మరియు శారీరక అవసరాల సంకెళ్ల నుండి మనల్ని విముక్తి కలిగిస్తుంది. ఉపవాసం ఉన్నవారు తన అంతరాత్మతో ఇలా చెబుతారు: నీవు ఏదైనా కోరుకున్నప్పటికీ కుడా నా విధేయత, ప్రేమ చాలా సర్వశక్తిమంతుడైన అల్లాహుకే అంకితం. అల్లాహ్! నా ప్రభువా! నా సృష్టికర్త! మేము ఎంత బలహీనులమో, అవసరదారులో ఈ ఉపవాసం ద్వారా తెలుస్తోంది. కొన్ని గంటలుకు తిండి లేకుండా ఉన్నందుకే చాలా బలహీనంగా అయిపోతున్నాము.
ఉపవాసం వల్ల మన విశ్వాసాం అధికమవుతుంది. ఉపవాసం మనకు అల్లాహ్కు దగ్గరవ్వడానికి, ఆయనకు మరింత అనుగుణంగా మారడానికి మరియు ఆయనను సంతోషపెట్టడానికి మరింత ఆసక్తిగా ఉండటానికి సహాయపడుతుంది.
ఆకలేసిన ప్రతిసారీ, మరొకరికి తెలియకుండానే రహస్యంగా తినవచ్చు. అయితే, అలా చేయకుండా మనల్ని మేము ఆపుకుంటాము. ఎందుకంటే అల్లాహ్ మనల్ని గమనిస్తున్నాడని తెలుసు. ఈ హృదయ ఉనికి, అప్రమత్తమైన అవగాహనన చేస్తూ అల్లాహ్ మరియు తన భక్తుని మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది. ఇహ్సాన్ అనగా ఎలాగైతే మన ప్రియ ప్రవక్త వివరించినారో, "మీరు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా ఆరాధించాలి. మీరు ఆయనను చూడలేకపోతే, ఆయన మిమ్మల్ని నిజంగా చూస్తాడు" (ముస్లిం).
ఉపవాసం ఒక వ్యక్తి హృదయాన్ని మృదువుగా చేస్తుంది, పేదల పట్ల అతని సానుభూతిని పెంచుతుంది. దాతృత్వం చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఉపవాసం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శరీరానికి హానికరమైన ఆహారాన్ని అతిగా తినడం వల్ల అనేక అనారోగ్యాలు సంభవిస్తాయి.
ఉపవాసం శరీరాన్ని విషపదార్ధాల నుండి శుద్ధి చేస్తుంది. అనేక శారీరక అనారోగ్యాల నుండి రక్షణకు నివారణ సాధనం ఈ ఉపవాసం . ఉపవాసం మనస్సును పదునుగా చేసి, మెదడు పనితీరును మెరుగ్గా పెంచుతుంది.
ఉపవాసం మనకు జుహద్ (ప్రపంచం నుండి నిర్లిప్తత) గురించి నేర్పుతుంది. ఇది మనం తినే ఆహారం ఎక్కువ కూడా కాకూడదు, తక్కువ కూడా కాకూడదు. ఆహారం, పానీయం మరియు మన కోరికలతో మనకున్న అనుబంధాన్ని తగ్గించడమే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అలా చేయడం ద్వారా మనం ప్రపంచంలోని వస్తువులకు ప్రాముఖ్యత లేదని గ్రహిస్తాము. అతిశయోక్తి, కామాన్ని, సిగ్గు లేకుండా ప్రోత్సహించే సమాజంలో, ఉపవాసం ఈ జీవితంలో మన ఉద్దేశ్యం తినడం, త్రాగడం మరియు మన లైంగిక కోరికలను నెరవేర్చడం కాదని గ్రహించేలా చేయాలి.