చెరుశ్శరి జైనుద్దీన్ ముస్లియార్: జ్ఞాన సముద్రం

చెరుశ్శరి జైనుద్దీన్ ముస్లియార్

చెరుస్సేరి జైనుద్దీన్ ముస్లియార్ అనే వ్యక్తి గురించి మాట్లాడటం ఒక పుణ్యం. వారు 78 సంవత్సరాలు ఈ భూమిపై జీవించి తన జీవితమంతా విద్య సామాజిక సేవ కోసం అంకితం చేశారు. తమరు దారుల్ హుదా ఇస్లామిక విశ్వవిద్యాలయాన్ని స్థాపించడంలో తోడ్పడ్డారు. విస్తృతంగా జైనుల్ ఉలమాగా గుర్తింపబడ్డారు. షేఖునా అని కూడా పిలువబడే జైనుద్దీన్ ముస్లియార్ 1937లో కేరళ రాష్ట్రంలోని మలబార్ జిల్లా మొరయూర్‌ అనే గ్రామంలో జన్మించారు. అతని ఇంటి పేరు కజియారకం. వారు బంగాళత్ మరియుమ్మ మరియు ఖదీజాలను వివాహం చేసుకున్నారు. వారుకి ఇద్దరు కొడుకులు మరియు రెండు కుమార్తెలు కూడా ఉన్నారు.

షేఖునా గారి విద్య ప్రారంభం:-

షేఖునా ముందుగా తమ విద్యను వాళ్ళ నాన్న సి.హెచ్ అహ్మద్ ముస్లియార్–ముస్లియార్ అనగా “మౌలానా అని ఎలాగంటామో అలా మలయాళ భాషలో ముస్లియార్ అని పిలుస్తారు”– దగ్గర ప్రారంభించారు. వారి తరువాత తమరు ఓ.కె అహ్మద్ ముస్లియార్ దగ్గర విద్యను అభ్యసించారు. తమరు కేరళ మరియు సౌదీ అరేబియాలోని వివిధ ఇస్లామిక విద్యాసంస్థలకు వెళ్ళారు. అక్కడ నుండి వారు ఇస్లాం, అలాగే న్యాయశాస్త్రం మరియు వివిధ జ్ఞాన రంగాలను స్వీకరించారు.

షేఖునా సేవలు:-

గతంలో, అతను కొడంగాడ్, కొండోట్టి మరియు మలప్పురంలో 18 సంవత్సరాలు పాటు ముదర్రిస్‌గా, అంటే ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత చెమ్మాడ్‌లోని జుమ్మా మసీదులో ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. అనంతరం వారు కొండొట్టి జుమా మసీదు ఖదియారకంలో ఖతీబ్‌గా పనిచేశారు. వారు అనేక ముస్లిం కౌన్సిల్‌లకు ఖాజీగా పనిచేశారు. దారుల్ హుదా ఇస్లామిక్ అకాడమీ యూనివర్శిటీగా రూపాంతరం చెందిన మే 2009 నుండి వారు వైస్-ఛాన్సలర్‌గా పని చేసారు. తమరు ఉపన్యాసకులుగా మరియు ఉన్నత విద్యావంతులుగా సేవలందించారు. ఆయన ఇస్లామిక్ వేదాంతశాస్త్రం, న్యాయశాస్త్రం మరియు చరిత్రపై అనేక పుస్తకాలు రాశారు. అదనంగా, వివిధ ఇస్లామిక మాసికలకు మరియు జర్నల్‌లకు చురుకుగా సహకరించాడు.

షేఖునా పై ఉన్న బాధ్యతులు:-

ఆ తర్వాత 1994లో దారుల్ హుదా ఇస్లామిక అకాడమీలో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించారు. అదనంగా, 1974లో సమస్తాలో సభ్యులయ్యారు మరియు తమరు ఫత్వా ప్యానెల్ అధ్యక్షత వహించారు. 1980 నుండి షేఖునా సమస్త ముషావర సభ్యునిగా ఉన్నారు. దీనిని అనుసరించి 1996 నుండి 2016 వరకు షేఖునా సమస్తా కేరళ జమియతుల్ ఉలమా కార్యదర్శిగా పనిచేశారు. ఈ స్థానానికి ముందు, ఇ.కె. అబూబకర్ ముస్లియార్ సమస్త కేరళ జమియతుల్ ఉలమాకు కార్యదర్శిగా పనిచేశారు. తమరు కేరళ పరీక్షల ఛైర్మన్‌గా పనిచేశారు మరియు తానూర్‌లోని ఇస్లాహుల్ ఉలూమ్ అరబిక్ కళాశాలలో నిర్వాహకులుగా పనిచేశారు.

తమరి గురించి ప్రజల ఉల్లేఖనాలు:-

“కేరళ వెలుపలి వ్యక్తులు కూడా సహాయం కోసం వీరి వద్దకు వచ్చారు. జ్ఞానం యొక్క లోతైన సముద్రం, మానవత్వం మరియు సరళత యొక్క స్వరూపం, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కోసం నిరంతరం ప్రార్దించే వరూ.” అని అరబిక్ విభాగం అధిపతి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, డా. జుబైర్ హుదవి చెప్పారు.

మేము అతనిని చాలా మిస్ అవుతున్నాము. ఉస్తాద్‌కి ఉన్నంత మతపరమైన జ్ఞానం ఎవరికీ లేదు అని దారుల్ హదా లో చెదువుతున్న పిల్లలు చెప్పారు.

“వారు ఏదైనా సమస్య యొక్క పరిష్కారం చెబితే, అతనికి ఎదురించే వారు ఉండరు. వారి నిర్ణయం తుది నిర్ణయం. దీనితో మనకు ఇలా తెలుస్తుంది ప్రజలు వారి ఆదేశాలను లేదా మాటలను చాలా గౌరవిస్తారు.” అని దారుల్ హుదా ఇస్లామిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బహాఉద్దీన్ గారు తమరి సంతాప సందేశంలో చెప్పారు.

“తమరు జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. అతను శాస్త్రీయ రంగంలో చాలా నిపుణుడు, కష్టమైన సమస్య యొక్క తుది నిర్ణయం ఉంటే, అది వారిదే.” అని పానక్కాడ్ సయ్యిద్ మునవ్వర్ అలీ షిహాబ్ గారు చెప్పినారు.

మరణం:-

వారు 78 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు స్ట్రోక్ కారణంగా 40 రోజుల పాటు కష్టాలను అనుభవించారు. 18 ఫిబ్రవరి 2016 ఉదయం 7:15 AM వద్ద, వారు కాలికట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ప్రస్తుతం, తమరి ఖనన స్థలం దారుల్ హుదా ఇస్లామిక్ యూనివర్సిటీ మసీదు ప్రాంగణంలోనే ఉంది.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter