డాక్టర్ బాపుట్టి హాజీ (దారుల్ హుదా స్థాపకుడు)

 ప్రపంచంలో జన్మించిన వ్యక్తుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ప్రజల హృదయాలను పాలించి లోకాన్ని విడిచి వెళుతూ వెళుతూ తమ గొప్ప జ్ఞాపకాలని వదిలెల్తారు. అలాంటి మహానీయులలో బాపుట్టి హాజీ ఒకరు. సరళమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి. తన ప్రాంత నాయకులలో మరియు ధనవంతులలో ఒకడు అయినప్పటికీ అతను విద్య మరియు శిక్షణలో నిమఘ్నమై ఉండేవారు.

ఆయనకు అనేక మదరసాల పదవులు అప్పగించబడ్డాయి. కేరళ ముస్లింలలో వారి పేరు ఎల్లప్పుడూ ప్రముఖంగా ఉంటుంది. కేరళలోని దారుల్ హుదా వ్యవస్థాపకుడు డాక్టర్ యు బాపుట్టి హాజీ. జాతినాయకుడు, సాటిలేని అమీర్ వంటి గొప్ప బిరుదులతో ఆశీర్వదించబడ్డారు. 

1977లో నిర్మించబడిన సున్నీ మహల్ ఫెడ్రేషన్ ట్రష్టీ మరియు ఎన్నో మద్రసాలలో అనేక   హోదాలు తనచే జరిగేవి. (ఉదాహరణకు, చెమ్మాడ్ విద్యాభ్యాస బోర్డ్ ప్రసిడెంట్ మెంబర్ గా, మజ్లిసుద్దావతుల్ ఇస్లామియ ప్రెసిడెంట్ గా మరియు తానూర్ ఇస్లాహుల్ ఉలూం అరబిక్ కాలేజ్ ట్రస్టీ లాంటివి)

బాపుట్టి హాజీ తన జీవితమంతా ముస్లిం సమాజాన్ని రూపుదిద్దడంలో బిజీగా ఉండేవారు. కానీ వారి మనసులో సంపద, పేరు మరియు కీర్తి లాంటి కోరికలు ఉండేవి కాదు. వారి జీవితం పవిత్ర ఖురాన్ యొక్క ఈ వాక్యానికి ఉదాహరణ, " وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ " .

కేరళ పండితుల నేల, అవ్లియాలు, సూఫీలు మరియు పండితులు జన్మించిన నేల ఇది. కానీ కాలక్రమేనా వేగవంతమైన అభివృద్ధిలో, మత విద్యార్ధులు ప్రపంచ జ్ఞానానికి గురికావడానికి, వారు ప్రపంచానికి సమానం కావడానికి అటువంటి వాతావరణం అవసరమైన సందర్భంలో ఈ మహనీయుని గొప్ప ఉద్దేశ్యంతో,  రాబోయే విద్యార్థులు మత శాస్త్రాలతో పాటు ప్రాపంచిక శాస్త్రాలతో బాగా పరిచయం ఉన్న మరియు అన్ని సవాళ్లను ఎదుర్కోగలిగే సంస్థ గురించి ఆలోచిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఉమ్మాలోని ప్రతి సభ్యుడు విజ్ఞాన స్వరూపంలోకి మారాలి మరియు వారి అభివృద్ధి మరియు రక్షణ కోసం కొత్త మార్గాలు వెతకాలి అనేది వారి ప్రథమ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి దారుల్ హుదా లాంటి విద్యాసంస్థను ప్రారంభించారు.

 జననం మరియు బాల్యం (కుటుంబ నేపథ్యం):

బాపుట్టి హాజీ సెప్టెంబర్ 1929న జన్మించారు. అసలు పేరు కుంజ్ ఔరాన్. కానీ బాపుట్టీ హాజీ అనే బిరుదుతో ప్రఖ్యాతిగాంచారు. తండ్రి పేరు కరీం కుంజాలన్ కుట్టీ, తల్లి పేరు ఆయేషా. కుటుంబం అలాట్‌ పేరుతో చెమ్మడ్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. వారికి ఆరుగురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు. తన కుటుంబాన్ని చాలా ప్రేమించేవారు. జీవితంలో బిజీగా ఉన్నా కూడా, తల్లిదండ్రుల హక్కులు, పిల్లలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను నెరవేర్చడంలో ఎలాంటి లోటుపాట్లు పడలేదు. ముఖ్యంగా తన పిల్లలు విజ్ఞానాన్ని కలిగి ఉన్నారనే విషయంపై ఆయన దృష్టి కేంద్రీకరించేది. పిల్లలను తన ఇంట్లో మతపరమైన వాతావరణంలో జీవించమని మరియు దానిని అనుసరించమని సలహా ఇచ్చేవారు. పిల్లలు పెద్దైన తర్వాతే విడివిడిగా గదులు ఏర్పాటు చేసి,  పెళ్లయ్యాక ఒక్కొక్కరికీ సొంత ఇల్లు కట్టించారు. దీంతో పాటు వారు ఎక్కడున్నా ఈద్ రోజున కుటుంబం మొత్తం ఒకే ఇంట్లో సమావేశమై ఈద్ ఆనందంలో పాలుపంచుకువారు. తన ప్రతి వ్యక్తిని తన పక్కన కూర్చోబెట్టి వారికి బోధించేవారు. జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను చేయడం మరియు చెప్పడం వారికి అలవాటు.

వారు తన చిన్ననాటి నుండే ప్రత్యేక లక్షణాలు, మర్యాదలు, ప్రదర్శనలు మరియు గొప్పతనం లాంటి ఉన్నత స్థానాల్ని కలిగి ఉండేవారు. తన పిల్లలకు చిన్నతనం నుండే దైవభక్తి కలవారిగా తీర్చిదిద్ది నిత్యం ధార్మిక వాతావరణంలో జీవించేలా శిక్షణ ఇస్తూ ప్రబోధించేవారు. చిన్నతనం నుండే ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలనే తపన ఉండేది.

 విద్య మరియు శిక్షణ:

బాపుట్టీ హాజీ తమ చిన్న వయస్సులో ముహీయుద్దీన్ హసన్ ముస్లియార్ చే బిస్మిల్లా ఖ్వానీని ప్రారంభించారు మరియు ఏడవ సంవత్సరంలో MMLP పాఠశాలలో చేరారు. అతని ప్రాథమిక విద్యను 1 నుండి 5 వరకు పూర్తి చేసి 8\10 వయస్సులో తిరురంగాడి నూరుల్ హుదా మద్రసాలో చేరి మెటీరియల్ స్టడీస్ కోసం అక్కడి GUP స్కూల్ అనాథాశ్రయానికి వెళ్ళేవారు. కాని అక్కడికి రాగానే మతవిద్వేషాల గొడవలు మొదలయ్యాయి. అందువలన వారి తండ్రి అక్కడి నుండి చెమ్మాడ్ దర్స్ మదరసాలో చేర్చారు. అక్కడ ఇస్లామిక విద్యను పొందారు. తన చిన్నతనం నుండే చదువుపై మక్కువ ఎక్కువ ఉండటంతో తన తండ్రి, ఉపాద్యాయులు మరియు తన తోటివారిలో మరియు పొరుగువారిలో కూడా ప్రసిద్ధి చెందారు. 1946లో SS ప్రారంభించి LC ఉత్తీర్ణత సాధించి 1949లో కోటక్కల్ విద్యాశాలలో చేరి డాక్టరేట్‌ చదివారు. హోమియోపతిలో రాణించి గణితంలో కూడా నిష్ణాతుడు. తండ్రికి డాక్టర్‌ వృత్తితో అనుబంధం ఉండడంతో యూనానీ డాక్టరేట్ లో కూడా అనుబంధం ఏర్పడింది.

దారుల్ హుదా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం:

వారు అందించిన సేవల్లో ముఖ్యమైన మరియు ఓ మైలురాయి కేరళలోని గొప్ప విద్యాసంస్థ అయిన దారుల్ హుదా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం. దాదాపు ముప్పై ఐదేళ్లుగా నడుస్తున్న విశ్వవిద్యాలయం ఇది.

దారుల్ హుదా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం హాజీ సాహిబ్ యొక్క చిత్తశుద్ధి మరియు దైవభక్తికి సజీవ చిహ్నం. దీని పునాది హాజీ యూసుఫ్ సాహిబ్ యొక్క కృషి పట్టుదల యొక్క ఫలం. వారు దారుల్ హుదా అభివృద్ధిని తన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా భావించారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి, వారు అనేక కష్టాలను మరియు బాధలను ఎదుర్కోవలసి వచ్చింది. హాజీకి దారుల్ హుదా అంటే ప్రాణం. చెత్త చెదారం మరియు రకరకాల స్థలాలనుండి పారే నీటితో నిండిన పన్నెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి లారీలతో మట్టిని తెచ్చి నింపడం మొదలుపెట్టారు. కానీ ఆ భూమి పూడ్చే పేరు కూడా పెట్టుకోలేదు. ఈ అసాధ్యమైన పరిస్థితిని చూసిని ప్రజలు హాజీ సాహిబ్‌ పై నవ్వేవారు. మరికొంతమంది మానసిక స్థితి బాగోలేదని కూడా ఎగతాళి చేసేవారు. కాని ఆయన మాత్రం తమ కల మరియు కోరికను తీర్చుకోవడంలో బిజీ అయిపోయారు.

చివరగా, దేవుని దయతో, ప్రముఖ పండితులు మరియు ప్రవక్త కుటుంబీకుల (సాదత్- ఎ- ఇజాం) సమక్షంలో, కన్నియత్ అహ్మద్ ముస్లియార్ అనే పండితుడి పవిత్ర హస్తం ద్వారా 25/ సెప్టెంబర్ 1983న దారుల్ హుదా పునాది రాయి వేయబడింది. ఇది 26/ జూన్ 1986 న పూర్తయింది. అదే సంవత్సరం విద్యాభ్యాసం కూడా ప్రారంభమైంది. ఈ సంస్థకు మొదటి ప్రధానోపాధ్యాయుడు ఎం.ఎం.బషీర్ ముస్లియార్. ఆ తరవాత క్రమంగా అభివృద్ధి చెందడం ప్రారంభించి వేలాది మంది పిల్లలు చదువుకోవడం ప్రారంభించిన సంతోషకరమైన రోజులోచ్చాయి. ఇస్లామిక మరియు సమకాలీన విద్యతో కూడిన సకల కళా వల్లభ పండితులను తయారు చేయాలనే లక్ష్యంతో పాటు మతపరమైన విషయాలను మరింత వ్యాప్తి చేయడమే దీని ముఖ్య లక్షం.

 1999లో ఉర్దూ విభాగాన్ని కూడా స్థాపించారు. దీనికి ఫలితంగా నేడు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ విజ్ఞాన దాహాన్ని తీర్చుకుంటున్నారు.

 ఆయన జీవించి ఉన్న కాలంలో ఆయన తన గ్రామానికి ఎంతో అభివృద్ధిని అందించారు. అందుకే ఆయన ప్రతి అంశం నుండి ఉమ్మాకు రక్షకునిగా, తన దుఃఖితులను, సానుభూతిపరులుగా ఉండేవారు. వారు ధైర్య పర్వతం. ఉమ్మా యొక్క ఉన్నతమైన ధైర్యం.

పండితుల స్నేహం వారిని సూఫీగా మార్చింది. ముఖ్యంగా CH ఐద్రోస్ ముస్లియార్, MM బషీర్ ముస్లియార్ బరకత్ ద్వారా మరింత ప్రభావితమయ్యారు. వారి స్నేహం, ప్రేమ ఫలితంగా ఆయన ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఇద్దరూ బోధన మరియు మతాలతో పాటు నైతికత, సంస్కరణ మరియు శిక్షణలో పాల్గొన్నారు.

ప్రవక్త యొక్క సున్నత్ ఆరాధన మరియు క్రమశిక్షణలో సంరక్షకులు. ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా నమాజు సమయంలో ఆ పనిని వదిలేసి మనస్పూర్తిగా భగవంతుని స్మరణలో ధ్యాస పెట్టేవారు. చొక్కాలోని బటన్‌గా (గుండీ) చిన్న చెక్క ముక్కనో లేదా ఏదో ఒక చెట్టు ముళ్ళునో  అతికించి చాలాకాలం వాడేవారని కూడా ఆయన గురించి తెలిసింది.

 ఇతరులలో పొరపాట్లు కనిపిస్తే నిషేధం విధించడమే కాకుండా, సరిదిద్ది అలా కాదు ఇలా అని చెప్పేంత సిధ్ధాంత గల వ్యక్తి. దారుల్ హుదా స్థాపకుడు అయినా కానీ, గ్లాసు నీళ్లు, టీ కూడా తాగేవారు కాదు. ఒకవేళ తాగినా దానికి సరిపడ పైసలను దారుల్ హుదా హుండీలో వేసేవారు. ఈ రోజుల్లో మద్రసాల పేరుతో తెచ్చిన డబ్బును తమ ఇళ్ల కోసం ఖర్చు చేసేవారి కోసం ఓ గుణపాఠం మన బాపుట్టి హాజి.

 అతను తన యూనానీ వైద్యం నుండి తన జీవనోపాధిని నిర్వహించారు. వారు చాలా పవిత్రుడు మరియు చాలా నిజాయితీ పరుడు. అందుకే మంచి విశ్వాసి యొక్క అన్ని లక్షణాలు వారిలో కనిపించేవి. డాక్టర్ ఇక్బాల్ నిజం చెప్పాడు.

 دل سے جو بات نکلتي ہے اثر رکھتی ہے

پر نہیں طاقت پرواز مگر رکھتی ہے

“మనుసులోనుండి బయటకు వచ్చే ప్రతి విషయం ప్రభావం చూపుతుంది”

మరణం:

జీవిత చివరి సమయంలో ఆయన జ్వరాబారాన పడినా దారుల్ హుదాకు వచ్చి వెళ్ళేవారు. తన ఆఖరి సమయం తన కుటుంబీకులను పిలిచి మాట్లడుతూ కన్నీళ్లు కార్చసాగారు. కానీ తన కన్నీళ్లు పిల్లలు, బంధువుల ఎడబాటు కోసం కాదు, దారుల్ హుదాను మరియు దారుల్ హుదా విద్యార్థులను తన కుటుంబాంని కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నందున వారి కళ్ళు దారుల్ హుదా కోసం ప్రవహించాయి. త్వరలో ఈ మృర్త్యలోకాన్ని విడిచిపెడతానని ముందే తెలుసినట్టూ మరణానికి ముందే తన (కఫన్) కొని పెట్టుకున్నారు. చివరికి జులై 22, 2003న ఈ అమూల్యమైన వజ్రం ఈ మృర్త్యలోకం నుంచి శాశ్విత జీవితానికి వెళ్లిపోయారు.

 అల్లాహ్ వారి సేవలను మరియు పుణ్యాలను స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్!

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter