మొట్టమొదటిసారిగా తెలుగు భాషలో ఇస్లాం ఆన్ వెబ్ ఆవిష్కరణ
మొట్టమొదటిసారిగా తెలుగు భాషలో ఇస్లాం ఆన్ వెబ్ ఆవిష్కరణ:
కేరళలో ప్రముఖ వెబ్సైట్ అయిన ఇస్లాం ఆన్ వెబ్ ఇప్పుడు మరిన్ని భాషలలో ఒక కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు దృశ్యమైంది. ఈ వెబ్సైట్ కేవలం మలయాళీలకు మాత్రమే అందుబాటులో ఉంచడం కాకుండా భారతదేశంలో ప్రసిద్ధి చెందిన భాషలలో ఆవిష్కరించాలని ఈ వెబ్సైట్ రూపకర్తల యొక్క ముఖ్య లక్ష్యం. అందుకొరకు భారతదేశంలో హిందీ తరావాత అధికంగా మాట్లాడే తెలుగు భాషలో కూడా ఆగస్టు 15న, శనివారం సాయంత్రం 7.30కు దీనితో పాటు పొరుగు రాష్ట్ర భాష కన్నడలో, బంగ్లాలో, దేశీయ భష ఉర్దూలో మరియు వశవ భాష ఆంగ్లంలో ఆవిష్కరించడం జరిగింది. ఇందుకోసం కేరళ నుంచి ప్రవక్త కుటంబంలోని సయ్యిద్ రషీద్ అలీ షిహాబ్ తంగల్ ముఖ్యఅతిథిగానూ మరియు ఆంధ్రప్రదేశ్, గుంటూరు నుంచి ప్రముఖ చారిత్రక రచయిత సయిద్ నశీర్ అహ్మద్ ప్రాంతీయ అతిథిగానూ పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే, మన ఆంధ్ర, తెలంగాణ ముస్లిం సోదరులకు, సమాజానికి ఇస్లాం మతం గురించి సమస్త, సకల ప్రాథమిక విషయాలు అందుబాటులో ఉంచడం మరియు వారి యొక్క సందేశాలను పూర్తి చేయడం.