ఐక్యతలోనే భవిష్యత్తు: ఫలస్తీన్ కోసం ఉమ్మత్ ముస్లింల పిలుపు

ఈ రోజుల్లో టీవీ ఛానళ్లలో, సోషల్ మీడియాలో ఫలస్తీన్ ప్రజలు ఎదుర్కొంటున్న ఆకలి, దాహం, బాంబుల దాడులు, తుపాకుల మోతలు ఇలా చాలానే ఉన్నాయి. వాటి మధ్య మరణానికి నెట్టబడుతున్న వారి దృశ్యాలు మన కళ్ల ముందు విస్తరిస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ దృశ్యాలు వారి జీవితాల్లో దారుణత్వాన్ని మనసుకు హత్తుకునేలా చూపిస్తున్నాయి. 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ చేపట్టిన ఈ సామూహిక హత్యాకాండ, ఇంతకు ముందెన్నడూ చూడని క్రూరమైన రూపాన్ని సంతరించుకుంది.

కానీ, దీనిపై ముస్లిం ప్రపంచం చూపిస్తున్న మౌనం, అది వారి బలహీనతా, లేక మనసు మంచు కట్టిన నిర్లక్ష్యమా, చెప్పడం కష్టమే. ఏది ఏమైనా, ఇది వర్ణనాతీతమైన పరిస్థితి.

ఇలాంటి దారుణమైన స్థితి కొనసాగుతుండటం దురదృష్టకరం. ఎందుకంటే ముస్లిం సమాజం, మానవ వనరులు, సహజ సంపదల పరంగా ప్రపంచంలో ఎవరికీ తక్కువ కాదు. లక్షలాది సైనికులు ఉన్నారు, అపారమైన సహజ సంపద ఉంది, ముఖ్యంగా చమురు, దీన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే ఆయుధంగా ఉపయోగించవచ్చు. 

శక్తి సమతుల్యతను నిలబెట్టడానికి కావాల్సిన వనరులు ముస్లిం సమాజం దగ్గర లేవని అనడం అబద్ధం. కానీ, ఆ వనరులను సరిగ్గా ఉపయోగించగల ఆలోచన, ధైర్యం, దిశానిర్దేశం మాత్రం లేవు. ఈ సంక్షోభం ఎందుకు వచ్చిందో లోతుగా అర్థం చేసుకుని, పరిష్కారాలు ఆలోచించే జ్ఞానవంతమైన మనసులు కావాలి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్‌కు విధేయంగా మారిన ఈ కాలంలో. 

ముస్లింలలోని జాతీయ, సాంస్కృతిక విభేదాలు, “ఇది నా సమస్య కాదు” అనే ధోరణి, ఇవే ఇజ్రాయెల్‌కు ధైర్యాన్ని ఇచ్చాయి. తమ సోదరుల పట్ల చూపే నిర్లిప్తతే శత్రువుకు ఆయుధంగా మారింది.

అందుకే ఇప్పుడు అత్యవసరమైనది ఏమిటంటే, మనం ఈ స్థితికి ఎందుకు చేరుకున్నామో తెలుసుకోవడం. మన బలహీనతలు, నిర్లక్ష్యం మనల్ని ఎలా కుంగదీశాయో పరిశీలించడం.

ఇది కేవలం మౌనంగా చూస్తూ ఉండే సమస్య కాదు. ఎందుకంటే గాజాకు చేరాల్సిన మానవీయ సాయం కూడా ఇప్పుడు అడ్డుకోబడుతోంది. ఇది మానవత్వాన్నే పరీక్షిస్తున్న దశ. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే కనీసం ఇప్పటికి కాకపోయినా, రానున్న తరాల కోసమైనా మనం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి. శత్రువు నుంచైనా కొన్ని పాఠాలు నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. 1897లో కొద్దిమంది యూదులు ఒక సమావేశంలో ఇజ్రాయెల్ రాష్ట్రాన్ని స్థాపించాలనే సంకల్పం తీసుకున్నారు. రాబోయే యాభై ఏళ్లలోనే దాన్ని వాస్తవంగా మార్చారు. 

వారిలో కూడా భయాలు, బలహీనతలు, అంతర్గత విభేదాలు లేకపోలేదు. అయినా వారు ఆలోచించారు, ప్రణాళికలు వేశారు, వాటిని అమలు చేయడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డారు.

మరి మన పరిస్థితి ఏమిటి? మనం మోస్తున్న నిర్లక్ష్యం, నిరుత్సాహం మరియు వనరుల వృథా ఇవన్నీ ఒక జాతిని మట్టుబెట్టే ప్రమాదకరమైన వ్యాధులు. ఒక్కసారి ఈ వ్యాధి పట్టుకుంటే, ఆ జాతి భూమిపైనా మిగలడం కాదు, చరిత్రలోనే గుర్తుండదు.

ఇప్పుడు మన చుట్టూ చూస్తే, ప్రతిచోటా అబద్ధాలు, అహంకారాలు ఎదురుపడుతున్నాయి. నెతన్యాహూ లాంటి నాయకుల మాటల్లో ఇలాంటివి స్పష్టంగా కనిపిస్తాయి. ట్రంప్ వంటి వారి పాలనలో ఈ అహంకారం మరింత బలంగా మారింది. దీని వలన లక్షల మంది నిరపరాధులు, వారిలో ఎంతో మంది అమాయకులైన  పురుషులు, స్త్రీలు, పిల్లలు మరియు వృద్ధులు కుడా మరణిస్తున్నారు.వారికి మరణం అనేది ఒక రోజువారీ విషయమైపోయింది. కొన్ని వారపత్రికలు గాజా మరణాలు రోజు జరిగే విషయమే అని వారి మరణ సంఖ్యా మరియు అక్కడి వార్తలను ప్రచురించడం కుడా ఆపేసారు. ఒకవేళ ఉన్న కూడ ఎక్కడో కింద చిన్న డబ్బాలోనే అది వస్తుంది. 

ప్రతిరోజూ మన శత్రువులు రాత్రింబవళ్లు కుట్రలు పన్నుతున్నట్టు మనకు కనిపిస్తోంది. వారు తమ భౌతిక, సాంకేతిక, మానవ వనరులను పూర్తిగా ఉపయోగించి వినాశకరమైన పనులు చేస్తున్నారు. కానీ మన వైపు చూస్తే మన నిర్లక్ష్యంలో మరియు మనకు మనమే ఒక ముస్లిం జాతి వాళ్ళు అని మరచిపోతున్నాము.

మన పరిస్థితి చూస్తుంటే, యూదులు మరియు వారి అనుచరుల చేతిలో ఆటబొమ్మల్లా మారిపోయామనిపిస్తోంది. మన విలువ, మన చైతన్యం, మన గమ్యం ఏమీ పట్టించుకోకుండా వారు మనల్ని చెస్ బోర్డుపై గులకరాళ్లలా అటూ ఇటూ త్రిప్పుతున్నారు. 

పరీక్షల మీద పరీక్షలు, కష్టాల మీద కష్టాలు ఇదే ఇప్పుడు ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న విధి. జీవన పరిధి రోజురోజుకీ సంకుచితమవుతూ, ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ధైర్యం, మనోబలం ఇవన్నీ క్షీణించి చివరి అంచుకు చేరుకున్నాయి. 

మనం ఇప్పుడు నిరాశా సముద్రంలో మునిగి తేలుతున్నాం. ప్రతి ఒక్కరి దృష్టి తన సొంత రక్షణపైనే కేంద్రీకృతమైపోయింది. అందుకే ప్రతి మనసు మూలకు చేరి, మూగగా చూస్తూ ఉండిపోతోంది. ఎవరూ ముందుకు రావడం లేదు, మాట్లాడడం లేదు.

ప్రతి ఒక్కరూ “దైవ నిర్ణయం ఎప్పుడో వస్తుంది, మనం ఏమీ చేయకపోయినా ఈ చీకటి తొలగిపోతుంది” అనే అబద్ధమైన ఊరటతో సరిపెట్టుకుంటున్నారు. కానీ ఇది పతనానికి సంకేతం కాదా? విశ్వాసం బలహీనపడిన సూచనే కాదా? 

మన విశ్వాసం నిజంగా గట్టిగా ఉంటే, మనం ఎందుకు చర్యలు తీసుకోకుండా నిష్క్రియంగా ఉంటాం? దైవ సహాయం కోరడం మంచిదే, కానీ చేతులు ముడుచుకుని కూర్చోవడం అనేది విశ్వాసం కాదు, వైఫల్యం. 

నిజానికి చెప్పాలంటే, ముస్లిం సమాజంలో నిజమైన, పటిష్టమైన విశ్వాసంతో నడిచే వ్యక్తి ఎవరో సులభంగా తెలుస్తుంది. అలాంటి వ్యక్తి ఏమి చేస్తాడంటే: దైవాన్ని గట్టిగా పట్టుకుని, అవసరమైన కారణాలు మరియు సాధనాలు అందుబాటులో ఉంటే వాటిని సద్వినియోగం చేసుకుంటాడు.

విజయం కోసం ప్రయత్నించినప్పుడు, దైవం తనను ఒంటరిగా వదిలేయదని, సహాయం అందకుండా నష్టం జరగదని అతనికి తెలుసు. అలాగే, ఏదైనా చెడు జరిగినా అది అంతిమంగా దైవానికి మాత్రమే సంబంధించినదని విశ్వసిస్తాడు. అతనికి ఏ భయమూ ఉండదు. 

ముస్లింలు పాడుబడిన వారిని అంగీకరించరు. అబద్ధాల బలాన్ని చూసి భయపడరు, దాని ముందు తలవంచరు, దాన్ని ఎదిరించి ధైర్యం చూపిస్తారు. తమ రక్షణలో ధీరత, సహనం, ఓర్పును పెంచుకుంటారు. అలాంటి వారికి సంబంధించిన గట్టి మాటలు ఖురాన్‌ లో ఉన్నాయి:

ఎప్పుడైనా వాళ్ళని తమ సోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు, ఒక ముస్లిం తమ సోదరుడు పిలవక ముందే, అతన్ని ఆపద నుంచి రక్షించడాన్ని అతని కర్తవ్యంగా భావిస్తాడు. మరియు అల్లాహ్  తమ పవిత్ర గ్రంధంలో    ఇలా ప్రస్తావించాడు:

الَّذِينَ قَالَ لَهُمُ النَّاسُ إِنَّ النَّاسَ قَدْ جَمَعُوا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ إِيمَانًا وَقَالُوا حَسْبُنَا اللَّـهُ وَنِعْمَ الْوَكِيلُ

వారితో (విశ్వాసులతో) ప్రజలు: ''వాస్తవానికి మీకు వ్యతిరేకంగా పెద్ద జనసమూహాలు కూర్చబడి ఉన్నాయి. కావున మీరు వారికి భయ పడండి.'' అని అన్నప్పుడు, వారివిశ్వాసం మరింత అధికమే అయింది. మరియు వారు: ''మాకు అల్లాహ్‌ యే చాలు మరియు ఆయనే సర్వోత్తమమైన కార్యసాధకుడు.''  అని అన్నారు.  (ఆల్-ఇమ్రాన్ 3:173)." 

ఉదాహరణకు, ఉహుద్ యుద్ధం జరిగిన సమయానికి వచ్చేసరికి, అనేకమంది సహాబాలు షహీద్ అయిపోయారు. ముస్లిం సోదరుల బలం కొంచెం కుంగిపోయింది. అయితే ఆ సమయంలోనే ఖురాన్ ,

మోమినులు ఎప్పుడూ గౌరవం, ప్రతిష్ఠలు పొందగలిగే స్థాయిలో ఉండాలని హెచ్చరించింది. ఖురాన్ ఇలా ప్రకటిస్తోంది:

وَلَا تَهِنُوا وَلَا تَحْزَنُوا وَأَنتُمُ الْأَعْلَوْنَ إِن كُنتُم مُّؤْمِنِينَ

ఇక మీరు బలహీనత కనబరచకండి మరియు దుఃఖపడకండి మరియు మీరు విశ్వా సులే అయితే, మీరే తప్పక ప్రాబల్యం పొందుతారు. (ఆల్-ఇమ్రాన్ 3:139).

దీని అర్థం ఏమిటంటే: గట్టి విశ్వాసం ఉన్నవాడు తన నమ్మకంతో గర్వపడాలి. ప్రపంచ శక్తులు ఎన్ని ఎదురైనా భయపడకుండా, ధైర్యంగా సమాధానం ఇచ్చే సత్తా అతనిలో ఉండాలి.

 ఇలాంటి పాఠాలను మనం విదేశీ దృక్కోణంతో కాకుండా, మన మనసుల్లో పెట్టుకుని ముందుగా ఆలోచించి, అమలు చేయాలి. అమెరికన్- జయోనిస్ట్ పథకాలను అడ్డుకోవడానికి మన దగ్గర వేదికలు, మార్గాలు ఉన్నాయి! కానీ మనం ముందుకు లేచి, చురుకుగా పని చేస్తేనే అవి ప్రయోజనం ఇస్తాయి. వారు తమ ప్రాంతంలో ఆధిపత్యాన్ని పెంచుకుంటూ, స్థానికులను వారి సంస్కృతి, గుర్తింపు నుంచి విడదీసే లక్ష్యంతో నడుస్తున్నారు. ఉమ్మత్‌ను పూర్తిగా తారుమారు చేసి, జిహాద్ భావనను, మనసుల నుంచి తుడిచేయాలని చూస్తున్నారు.

ఈ రోజుల్లో ఉమ్మత్, మందలో ఎండిపోయిన స్ఫూర్తి, విషాదమైన నిరాశ మధ్యలో గడుపుతోంది. బంధువుల సహాయం నుంచి తమను తాము దూరం చేసుకుంటూ, వెనక్కి తగ్గే ధోరణి కనిపిస్తోంది. అల్లాహ్‌కు సిగ్గుపడకుండా, ఇలాంటి నిరాశ మనల్ని బలహీనత వైపు నడిపించకూడదు. శత్రువు నిరాశను రెచ్చగొట్టడానికే జోక్యం చేసుకుంటున్నాడు. వారి ప్రయత్నం ఇదే: మనలోని నిజమైన ధర్మ మర్యాదలపై పట్టు చీల్చేయడం. దీని ఫలితంగా ముస్లింలు తమ అసలు ఈమాన్‌తో గట్టిగా నిలబడకపోతే మన ఆత్మీయ బంధం, ఆధ్యాత్మిక సంబంధం కాలగర్భంలో కలిసిపోతుంది.

కాబట్టి, మనలోని దాచిపెట్టిన విశ్వాసం చినుకులను మళ్లీ కురిపించాలి. ఆ చినుకులను జ్వాలలుగా మార్చాలి. అదే మనకు సరైన మార్గం: హృదయాల్లోని దిగువను తొలగించి, బలమైన సంకల్పాన్ని మళ్లీ సృష్టించాలి. జాగ్రత్తగా ఉంటూ, శ్రద్ధతో సిద్ధమై, శక్తి సముపార్జనకు కలిసి రావాలి. ఈ విధంగానే మనం ఈ కష్టాలను దాటగలం.

ప్రతి ముస్లిం ఈ శక్తని, ఆందోళన పరిస్తితిని అర్థం చేసుకుని, దీన్ని అడ్డుకోవడానికి తన స్థాయి మేరకు పాత్ర పోషించాలి. ఇది కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదు, ఇది మన విశ్వాసానికి, ధార్మిక, సాంస్కృతిక ఉనికికి సంబంధించిన సంక్షోభం. ఆ సంక్షోభ ప్రశ్నలను పరిష్కరిస్తూ, మన సంస్కారాలను, భావ గాంభీర్యాన్ని కాపాడుకోవడం ప్రతి ముస్లిం బాధ్యత.

మనం ఉమ్మత్ గుర్తింపుతో, ముడిపడిన భావోద్వేగాలను దాడి చేస్తున్నామని తెలుసు. ఈ తర్కం, ప్రాధాన్యాలను మంటలు పెట్టి దూరం చేస్తోంది. వచ్చే పరిస్థితులపై ఆలోచించడం, వాటి పరిణామాలను ముందుగా అంచనా వేయడం, మన దృష్టిని మాయ చేస్తోంది. అందుకే, ఇస్లాం అనేది ముస్లిం హృదయాల్లో, వారి చర్యల్లో నిలిచినంత కాలమే కొనసాగుతుంది.

ఇక చెప్పాల్సిందల్లా, ఇస్లామిక్ సమాజంలో ప్రకాశవంతమైన మూల్యాలు ఇంకా ఉన్నాయనడంలో తప్పు లేదు. గాజాలో జరుగుతున్న హత్యలు, విధ్వంసాలు, దహనాల్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ రాజధానుల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఇవి కొద్ది రోజుల్లో అగ్నిపర్వతంలా మారి సంచలనం సృష్టించే అవకాశం ఉంది

ఒక ఆశాకిరణం ఏమిటంటే బలహీనత, నిరుపాయత ఇస్లామిక్ సమాజాలను పూర్తిగా ఆక్రమించలేదు. వాళ్లలోపల జిహాద్ ఆత్మ ఇంకా మేల్కొంటోంది అది నిషేధించబడలేదు, నిశ్చయంగా జీవించే ఉంది. అదే ఆశ, అది ఉమ్మత్‌కు వరం తెస్తుందని ఆశిద్దాం.

ఈ భావన కొందరి మనసుల్లో చోటు చేసుకుంటే, అపార నిరాశను, ఓడిపోయిన మనోబలాన్ని పక్కన పెట్టగలదు. ఉమ్మత్‌కు మార్గదర్శకత్వం మాత్రమే కావాలి. అలాంటి నాయకత్వం  కార్యరూపం దాల్చే ప్రణాళికతో ముందుకు వచ్చి, రోజురోజుకూ పెరిగిపోతున్న గందరగోళాన్ని, సమాజాల్లో వ్యాపించిన ఫలితం లేని మార్గాలను సరిచేయగలిగేలా ఉండాలి. ఆ నాయకత్వం సామర్థ్య లోపాలను గుర్తించి, కొత్త విశ్వాస విత్తనాలను మళ్లీ నాటగలగాలి.

మనపై ఒక ఆధ్యాత్మిక, మానవీయ బాధ్యత ఉంది.మన ఫలస్తీన్ సోదరుల ధైర్యం, వారి రక్తం చిందిన గాయాల బాధ, ఇవన్నీ మన గుండెల్లో గిలిగిల్లాడాలి. వారిని కాపాడుకోవడానికి మన శక్తి, సంపద, ప్రాణాలు కూడా సమర్పించే సాహసం చూపాలి. ఇది మన మతంలో ఫర్జ్ లాంటిది. అవును, ఇది మన ఆత్మీయ బాధ్యత. మన సామర్థ్యం ఉన్నంతవరకు జిహాద్ (పోరాట ప్రయత్నం)లో ముందడుగు వేయాలి. అచ్చం ఖురాన్ లో చెప్పినట్టు:

انفِرُوا خِفَافٌ خَيۡرٌ لَّكُمۡ إِن كُنتُمۡ تَعۡلَمُونَ ٤١

       తేలికగానైనా సరే, లేక భారంగానైనా సరే బయలుదేరండి. మరియు మీ సంపదలతో, మీ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడండి. మీరు గనక ఇది తెలుసుకోగలిగితే, ఇది మీకెంతో ఉత్తమమైనది.

 (అత్-తౌబా 9:41).

   ఇలాంటి క్లిష్ట సమయంలో, చరిత్రలో ఎన్నడూ లేని అన్యాయాలు జరుగుతున్న ఈ అత్యవసర ఘడియలో, మనం కదిలేది ఇంకెప్పుడు? ఏ ఆధారంతో చైతన్యవంతులై ఈ అన్యాయాలకు ఎదురొడ్డాలి? మన మార్గం ఎక్కడ ముగిసింది? ధర్మానికి వ్యతిరేకంగా నిలబడటం ఎప్పుడు మానేస్తాం? నిష్పక్షపాతం పేరుతో సహాయాన్ని విడిచిపెట్టడం అనేది ఇస్లాం బోధల్లో సరైనది కాదు. రాజకీయ, సైనిక లేదా ఆర్థిక బలహీనతలు ఉన్నా అది మన్ననీయం కాదు.

కారణం స్పష్టం: ఉమ్మత్ కోట్లాది జనాభా కలిగి ఉంది. అపార వనరులు, మనుష్యశక్తి ఇలా అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. కాని శత్రువు కోరుకునేది మాత్రం ఒక్కటే "మానవత్వం పేరుతో మనం నోరు మూసుకుని, కళ్ల ముందు జరుగుతున్న దారుణాలకు మౌనం వహించడం." ఇలాంటి నిర్లక్ష్యమే వారి ఆధిపత్యాన్ని బలపరుస్తుంది.

కాబట్టి ఈ సంక్లిష్ట మలుపు మీద నిలబడి ఉన్నాం. తార్కికంగా, ధార్మికంగా, కర్తవ్యపరంగా ఖురాన్ ఆధారిత దిశానిర్దేశం తిరిగి పొందాలి.

                            "వల్లాహు ఘాలిబున్ అలా అమ్రిహి!" (అల్లాహే తన ఆజ్ఞలపై పరమాధికారి).

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter