ప్రియ ప్రవక్త ﷺ గారు మరియు వారి ఇరుగుపొరుగు
ఇస్లాంలో మాత్రం ఒక మనిషికి, తనకు ఇరుగుపొరుగున ఉండే వారి స్థానం చాలా గొప్పది. కనుక, మన ఇంటి దగ్గరలో ఉన్న వారందరూ ఒక సమూహంలోకే వస్తారు. మన ఇంటికి కొద్దిగా దూరంలో ఉన్నా సరే, వారిని ఇరికి పొరుగు వారే అని అందురు. సరిగ్గా చెప్పాలంటే ఒకళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న దాదాపు 40 ఇండ్లు వారి పొరుగు వారై పరిగణింపబడతారు. ఒక్కోసారి, వారి కులం లేదా మతం వేరు కావచ్చు, ఒక్కోసారి వారి నడవడిక వేరు కావచ్చు, ఒక్కోసారి వారు వేరే ప్రాంతంలో బస చేసే వారు కూడా అవ్వచ్చు, కానీ వారి గృహం ఒకరి వీధిలో మాత్రం తప్పక ఉంటుంది.ఆ వీధిలో ఉంటే మాత్రం వారు, ఒకళ్ళ ఇరుగుపొరుగు వారి కింది లెక్కకే వస్తారు.
వీధి అనగా ఒక నగరపు ఒక భాగం మరియు అది కొన్ని ఇండ్ల సమూహమై ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, అక్కడ నివసించే వారందరూ బంధువుల వలే కలిసి మెలిసి జీవిస్తారు. ప్రతి ఒక్కరూ తమ బంధువు హక్కుని, వారికి తప్పక అందజేస్తారు. ఇలా అయితే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపవచ్చు. ఈ ప్రపంచంలో అందరూ ఒకే కుటుంబం వలే, కలిసిమెలసి ఉండాలి కూడానూ. అటువంటి విధమైన ఒక వీధి సమాజంలో కొత్త మార్పుని తప్పక తీసుకురాగలదు. కానీ ఒకవేళ ఆ ఇరుగుపొరుగు వారి మధ్య చెడ్డ అలవాట్లు, చెడ్డ మాటలు, గొడవలు సంక్రమిస్తే బ్రతకడమే కష్టమవుతుంది. శాంతం అంతమవుతుంది. ఇటువంటి విధమైన వీధులు కష్టాల గోతిలో పడిపోతాయి. అభివృద్ధికి బదులుగా నాశనం అయిపోతాయి.
ఈ విధమైన కారణాల వల్లనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు ఇరుగుపొరుగు వారి సంబంధాలు గట్టిగా ఉండేలా చూసుకునేవారు మరియు అందరికీ ఉండాలని కూడా తెలిపారు.
పవిత్ర ఖురాన్ లో ఇరుగుపొరుగు వారితో మంచి సంబంధాలు ఉన్న సమాజం, అభివృద్ధికి ఒక చిహ్నం అని తెలియపడం జరిగింది. కనుకే, ఇరుగుపొరుగు వారి హక్కులను అదా చేయని ముస్లింలు, వారికి విశ్వాసం అంటూ ఏదీ లేదని నమ్మబడుతుంది. పవిత్ర ఖురాన్ లోని సురహ్ నిసాఅ్ లో పొరుగువారి హక్కుల గురించి చాలా శ్లోకాలు ఉన్నాయి. అందులోని ఒక ఆయత్లో ఇలా ఉంది.
అల్లాహ్ యొక్క ఆరాధన చేయండి మరియు ఆయనకి భాగ్య స్వామిగా ఎవరిని నిలబెట్టకండి! ఇంకా తల్లిదండ్రుల పట్ల మరియు బంధువుల పట్ల మంచి ప్రవర్తనను కలిగి ఉండండి!
దీని గురించి ఖురాన్లోని నాలుగవ సురహ్, ‘సురహ్ నిసాఅ్’ లో ఇలా ఉంది:.(సూరా నిసాఅ్:36)
﴿وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَبِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَالْجَارِ ذِي الْقُرْبَىٰ وَالْجَارِ الْجُنُبِ وَالصَّاحِبِ بِالْجَنْبِ وَابْنِ السَّبِيلِ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ ۗ إِنَّ اللَّهَ لَا يُحِبُّ مَن كَانَ مُخْتَالًا فَخُورًا﴾(سورة النساء:٣٦)
(సూరా నిసాఅ్ 4:36)
“మరియు మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లి-దండ్రులతో, దగ్గరి బంధువులతో, అనాథులతో నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగు వారితో, 32 ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదారస్వభావంతో వ్యవహరించండి 33 నిశ్చయంగా అల్లాహ్ గర్వి తుణ్ణి, బడాయీలు చెప్పుకునేవాణ్ణి ప్రేమించడు. “3
ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం గారు తమ పొరుగువారి పట్ల దయాగుణం, కనికరం మరియు నిజాయితీని కలిగి ఉండాలని చాలాసార్లు మాటిమాటికి బోధించారు మరియు ఇలా సెలవిచ్చారు:
قال النبي صلى الله عليه وسلم: "ما زال جبريل يوصيني بالجار حتى ظننت أنه سيورثه… (صحيح البخاري .”
“నాకు ప్రవక్త జిబ్రాయీల్ (అ) గారు వచ్చినప్పుడల్లా చాలా సార్లు పొరుగువారి హక్కులను అదా చేసే సలహా ఇస్తుండేవారు. అలా చేస్తుంటే, నాకు ఒక ఆలోచన కూడా తట్టింది. పొరుగువారికి కుదిరితే తమ వారసత్వ సంపదలను కూడా వారి మధ్య తప్పక పంచేయాలని”. (సహీహ్ బుఖారి) .
మరో హదీసులో ఇలా సెలవిచ్చారు:
صحيح البخاري) “”ا يُؤْمِنُ أَحَدُكُمْ حَتّى يَكُونَ هَوْنُ جارهِ عَلَيْهِ،)
ఒక మనిషి తమ పొరుగువారు చెడ్డ పనులలో నిమగ్నమై ఉన్నంతవరకూ, ఆ మనిషి ఒక విశ్వాసిగా పరిగణింపబడడు. (సహీహ్ బుఖారి).
ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు అనాధల పై వారి కరుణ.
నిజానికి చెప్పాలంటే దైవ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారు పుట్టుకతోనే ఒక అనాధ. వారి తండ్రియైన ప్రవక్త అబ్దుల్లాహ్ (ర) గారు ప్రియ ప్రవక్త (స)గర్భంలో ఉండగానే కాలం చేందారు మరియు వారి తల్లియైన ప్రవక్త ఆమినహ్ (ర.అ) గారు వారి ఆరు సంవత్సరాల వయసులోనే, వీరూ కాలం చేస్తారు. దీని ద్వారా ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారికి ఒక అనాధ జీవితం ఎలా ఉంటుందో తెలిసింది. దాని తర్వాత వారి తాతగారైన ప్రవక్త అబ్దుల్ ముత్తలిబ్ (ర) గారు ప్రవక్త (స) గారిని పెంచారు. కానీ రెండు సంవత్సరాల కాలం తర్వాత ప్రవక్త (స) గారి ఎనిమిది సంవత్సరాల వయసులో, ఆయన కూడా కాలం చేస్తారు. ఇక ప్రియ ప్రవక్త (స)గారికి ఒక అనాధ బ్రతుకు ఎలా ఉంటుందో అంత బాగా తెలిసిన తర్వాత కూడా, ఇక ఆయన ఇతర అనాధల్ని చేరదీయక ఎలా ఉండగలరు?
అనాధల పట్ల ఒక ప్రత్యేక దయాగుణం, కనికరం మరియు వారికి తగిన న్యాయాన్ని వారికి అందజేశారు. ఇంకా వారిని పోషించే వారి కొరకు, స్వర్గంలో ఆయనతో దగ్గరయ్యే శుభవార్తని వినిపించారు. దీని గురించి సహీహ్ బుఖారీ హదీస్ లో ఇలాగుంది:
عَنْ سَهْلِ بْنِ سَعْدٍ، عَنِ النَّبِيِّ ﷺ قَالَ: "أَنَا وَكَافِلُ الْيَتِيمِ فِي الْجَنَّةِ هَكَذَا" وَقَالَ بِإِصْبَعَيْهِ السَّبَّابَةِ وَالْوُسْطَى.(صحيح البخاري)
నేను మరియు అనాధను పోషించేవారు స్వర్గంలో ఈ విధంగా ఉంటాము...అంటూ వారి, (స) గారు తమ రెండు వేల్లను దగ్గరగా ఆంచి మరీ సెలవిచ్చారు. (సహీహ్ బుఖారి)
ఇంకా పవిత్ర గ్రంథం అయిన ఖురాన్ లో ఇలా ఉంది: అతను అనాధలను మోసపరిచేవాడు!
అంటే దీని కన్నా ముందు శ్లోకంలో తమ ధర్మాన్ని కూలగొట్టే వారి గురించి ఉంది మరియు వారెవరో కాదు అనాధలను మోసపరిచే వారిని ఈ శ్లోకంలో ప్రస్తావన వచ్చింది. కనుక వారి పట్ల కనీస జాగ్రత్త వహించి తీరాలి.
ఫకీరులకు న్యాయం మరియు మద్దతు
ప్రియ ప్రవక్త (స) గారు మదీనాలో బస చేస్తున్నప్పుడు, ఆ సమయంలో పేదరికం అనేది ప్రజలను పట్టిపీడిస్తుండేది. ధనవంతులు చాలా తక్కువగా ఉండేవారు. ఈ పరిస్థితి అయినందువలన ప్రవక్త ప్రవక్త (స) గారు, ఈ ధనవంతుల మరియు పేదల మధ్యనున్న ఈ సమస్యను అంతమొందించాలని నిత్యం ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. తద్వారా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ మరియు తమ బోధనలు బోధించసాగారు.
ఇంకా వాటి వెలుగుతోనే వారి మధ్య దానం, దయాగుణాల గురించి భోదించి మరియు పేదవారి కొరకై ఖర్చు చేయాలని ఉత్తేజపరచారు. ఇక ‘జకాత్’ మరియు దానధర్మాలు చేయడం ద్వారా సమాజంలో నెమ్మదిగా వారి వారి మధ్య దయాగుణం, సహాయగుణం ఇలా సమాజంలో ఏర్పడి, ఆఖరికి ఈ పేదరిక అనే సమస్య అంతమైంది. ప్రియ ప్రవక్త (స) గారు పంపబడిన ప్రాంతమంతా పేదరికంలో కొట్టుమిట్టాడుతుండేది. కానీ ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు తమ జ్ఞానంతో దాన్ని అంతమొందించారు. అది మొత్తం వేర్లతో సహా రాలేకపోయినా, కనీసం దాని ఒత్తిడి మాత్రం అందరి నుంచి తొలగిపోయింది. ప్రవక్త (స) గారు సదా ఆనాటి ప్రజలతో పేదరికంపై సహనం వహించమని చెబుతుండేవారు. ఇంకా అది తొలగిపోవడం కోసం, ప్రతి ఒక్కరు కష్టజీవి కావలసి వస్తుందనీ తెలిపారు. ఇంకా ప్రతి ఒక్కరిని తమ రెండు చేతులతో పని చేసి, చెమటలు చిందించేలా వారిని తయారు చేశారు. దాని తర్వాత వారందరికీ ఒక ఆశని పుట్టించారు. వారు బయటకు వెళ్లి తమ శక్తిని, తెలివిని ఇతరుల ముందు పెట్టమని తెలిపారు. ఇంకా దానితోపాటు ఇతరులపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఈర్ష్యాద్వేషాలను, తగాదాలను ఉంచుకోకూడదని తెలిపారు.
ఇంకా అల్లాహ్ తఆలా సురహ్ జుమాలోని పదవ శ్లోకంలో ఇలా ప్రస్తావించారు.
“ఇక నమా'జ్ పూర్తి అయిన తరువాత భూమిలో వ్యాపించండి మరియు అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషించండి మరియు మీరు సాఫల్యం పొందాలంటే అల్లాహ్‌ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి!”
ప్రియ ప్రవక్త (స) గారు ఫకీరుల మరియు గరీబులకు మరియు ఏదైనా అవసరం ఉన్న ప్రజలకు మద్దతు చేసి, వారి హక్కును తీర్చడం జరిగింది, ఇంకా తీర్చాలని సెలవిచ్చారు కూడానూ.
ఖురాన్ యొక్క సురహ్ బఖరహ్ లోని 177 వ శ్లోకంలో ఇలా ఉంది:
“ వినయ-విధేయత (ధర్మనిష్ఠా పరత్వం) 121 అంటే మీరు మీ ముఖాలను తూర్పు దిక్కునకో, లేక పడమర దిక్కునకో చేయటం కాదు; 122 కాని వినయ-విధేయత (ధర్మనిష్ఠా పరత్వం) అంటే అల్లాహ్ ను, అంతిమదినాన్ని, దేవదూతలను, ప్రతి దివ్యగ్రంథాన్ని మరియు ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం; మరియు ధనంపై ప్రేమ కలిగి ఉండి కూడా, దానిని బంధువుల కొరకు అనాథుల కొరకు, యాచించని పేదల 123 కొరకు, బాటసారుల కొరకు, యాచకుల కొరకు మరియు బానిసలను 124 విడిపించడానికి వ్యయపరచడం. మరియు నమా'జ్‌ను స్థాపించడం, 'జకాత్ ఇవ్వడం మరియు వాగ్దానం చేసినప్పుడు తమ వాగ్దానాన్ని పూర్తిచేయడం. మరియు దురవస్థలో మరియు ఆపత్కాలాలలో మరియు యుధ్ధ సమయాలలో స్థైర్యం కలిగి ఉండటం. ఇలాంటివారే సత్యవంతులు మరియు ఇలాంటి వారే దైవభీతి గలవారు. “.
ఇంకా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీని గురించి సహీహ్ బుఖారి లోని ఇంకో హదీసులో ఇలా బోధించారు:
“ఒక విధవ స్త్రీకి మరియు ఒక పేదవాడికి మద్దతు చేసేవారు, అల్లాహ్ కొరకు రణరంగంలో యుద్ధం చేస్తున్నట్లు లెక్క”. (సహీహ్ బుఖారి).
ఈ విధంగా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు యావత్ ప్రపంచానికి ఒక సందేశంగా, తమ జీవితాంతం నీతీ, నిజాయితీని దయాగుణాన్ని కలిగి ఉన్న ఒక సాటిలేని నమూన. అంతేకాక, ప్రవక్త (స)గారు సమాజంలోని ప్రతి గ్రామంలో న్యాయాన్ని నిలబెట్టారు మరియు పూర్తి ఉమ్మత్ కొరకై ఇదే బోధించారు.
ఇక మనం తప్పనిసరిగా మన జిందగీలో ఈ బోధనలన్నిటినీ పాటించాలి. తద్వారా ప్రపంచంలో నీతి నిజాయితీగా బ్రతికి,విజయం సాధించగలం.
ఇన్షా అల్లాహ్ ..
అల్లాహ్ తఆలా మనకు వారి ఆదేశాలను మరియు వారి ప్రవక్త ఆదేశాలను తూ.చా. చెప్పకుండా అమలుపరిచే భాగ్యాన్ని ప్రసాదించుగాక! ఆమీన్!


