ప్రియ ప్రవక్త ﷺ మరియు ఇస్లాం మతంలో తల్లిదండ్రుల హక్కులు
తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి జీవితం లో అత్యంత ముఖ్యమైన వారు. ఇస్లాంలో తల్లిదండ్రుల గౌరవం చాలా పెద్దది. ఖురాన్‌లో వారిని గురించి చాలా శ్లోకాలు ఉన్నాయి. ఇస్లాం మతం ప్రకారం తల్లిదండ్రుల పట్ల వినమ్రత, కృతజ్ఞత చూపించడం, వారి ఆశయాలను గౌరవించడం ప్రతొక్కరి బాధ్యత. వారి సంతోషమే మన ఆనందం.
ఇది ఇలా ఉండి, ఇక మనం ప్రియ ప్రవక్త (స) గారి విషయాని కొస్తే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక అనాధై జన్మించారు. వారి తండ్రిగారైన ప్రవక్త అబ్దుల్లాహ్(ర) గారి మరణం, ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే జరిగింది. దాని తర్వాత కేవలం 6 సంవత్సరాల కాలం గడిచిందో లేదో, వారి తల్లిగారైన ప్రవక్త ఆమిన (ర) గారు కూడా కాలం చేశారు. తల్లిదండ్రుల పట్ల వినయం మరియు సేవానిరతితో ప్రవర్తించాలని ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు. ఇకపోతే, తల్లిదండ్రులు భగవంతుడు మనకు ఇచ్చిన ఒక వరం. వారిని ఆచరించాలి. ఆ సౌభాగ్యాన్ని దుర్వినియోగం చేయకుండా, సద్వినియోగం చేయడం మన కర్తవ్యం. ప్రియ ప్రవక్త (స) గారు తమ సహచరులతో ఇటువంటి విషయాలు బాగా ఎక్కువగానే చెబుతుండేవారు. అంతేకాక అవి చాలా ముఖ్యమైనవి కూడానూ.
దివ్య ఖురాన్లోనే కాక, ప్రవక్త (స)గారి బోధనలలోనూ తల్లిదండ్రుల హక్కుల గురించి చాలా ఎక్కువ మొత్తంలో హదీసులు ఉన్నాయి. : వాటి నుండి ఒక ప్రసిద్ధిగాంచిన హదీసు:
عن أبي هريرة رضي الله عنه أن النبي محمدًا ﷺسُئل: "يا رسول الله، من أحق الناس بحسن صحابتي؟" فقال: "أمك". قال الرجل: "ثم من؟" فقال: "أمك". قال: "ثم من؟" قال: "أمك". قال: "ثم من؟" فقال: "أبوك (صحيح.
ప్రవక్త అబూ హురైరహ్ (ర)గారు ప్రవక్త (స) గారితో ఇలా అడిగారు? ఓ రసూలల్లాహ్! ప్రజలందరిలోకల్లా నేను ఎక్కువగా ఎవరితో కలిసి ఉండాలి? అని అడిగారు. దానికి జవాబుగా ప్రవక్త (స) గారు ఇలా సెలవిచ్చారు: మీ అమ్మగారితో!
వారి తర్వాత? మీ అమ్మే!
వారి తర్వాత? మీ అమ్మే!
వారి తర్వాత? మీ అమ్మే!
వారి తర్వాత? మీ నాన్న!(సహీహ్ బుఖారీ)
ఇంకో హదీసు ప్రకారం ప్రియ ప్రవక్త (స)గారు ఇలా సెలవిచ్చారు:
حديث معاوية بن جاهمة أن النبي صلى الله عليه وسلم قال له: "الجنة تحت أقدام الأمهات".(ضعيف)۔ ۔
“తల్లుల పాదాల కిందే స్వర్గం ఉంది.” (దయీఫ్).
అంతేకాక, పవిత్ర ఖురాన్ లోనూ చాలా చోట్ల వీరి ప్రస్తావన వచ్చింది. అందులో, కొడుకులు తమ తల్లిదండ్రుల మాట ప్రకారం నడుచుకోవాలని ఉంది మరియు వారిపై నోరెత్తి గట్టిగా ఏమాత్రం అనకూడదని, ఇంకా వారిని కించపరిచే మాటలు, అస్సలు అనకూడదని కూడా ఉంది. నేటి ముస్లిం సమాజం దీనిని తప్పక గమనించి తీరాలి.
అది ఏమిటంటే, ఇంట్లో అందరూ సక్రమంగా, మంచి బుద్ధులతో నడుచుకుంటున్నట్లయితే, వారి పిల్లలకూ, ప్రకృతి సహజంగానే, మంచి బుద్ధులు అలవడుతాయి. దానికోసం పెద్దల సహకారం కూడా తప్పక ఉండి తీరాలి. ఇది ఇస్లాం అంటే! ఇటువంటి చిన్న చిన్న మాటలే, నేటి సమాజానికి అతి ముఖ్యమైపోయాయి. మన దైనందిన జీవితంలో మనం ఒక విషయాన్ని అసలు ఇది తప్పని గుర్తించక, మనం గుడ్డిగా నడుస్తుంటాం. ఇటువంటి మాటల్లోనూ తప్పొప్పులను విడదీసి జీవితానికి ఒక సరైన మార్గాన్ని చూపేదే ఇస్లాం!
وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۚ إِمَّا يَبْلُغَنَّ عِندَكَ الْكِبَرَ أَحَدُهُمَا أَوْ كِلَاهُمَا فَلَا تَقُل لَّهُمَا أُفٍّ وَلَا تَنْهَرْهُمَا وَقُل لَّهُمَا قَوْلًا كَرِيمًا (23)وَاخْفِضْ لَهُمَا جَنَاحَ الذُّلِّ مِنَ الرَّحْمَةِ وَقُل رَّبِّ ارْحَمْهُمَا كَمَا رَبَّيَانِي صَغِيرًا (24)(سورة الاسراء)
" మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లి-దండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ, ఆజ్ఞాపించి ఉన్నాడు. 8 ఒక వేళ వారిలో ఏ ఒక్కరు గానీ, లేదా వారిరువురు గానీ, ముసలి వారైతే, వారితో విసుక్కుంటూ: ''ఛీ! (ఉఫ్)'' అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు. మరియు వారి మీద కరుణ మరియు వినయ-విధేయతల రెక్కలను చాపు మరియు వారి కొరకు ఇలా ప్రార్థించు: ''ఓ నా ప్రభూ! వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పెంచారో అదేవిధంగా నీవు వారియెడల కరుణనుచూపు!'' (అల్ ఇస్రా’).
ఈ విధంగా ఖురాన్ లో స్పష్టంగా తల్లిదండ్రుల సేవల గురించి వివరించబడింది. ఇంకా ఇది ఒక మానవుని విశ్వాసం తర్వాత, ఒక తప్పనిసరి పని అయి నిలిచింది.
ప్రవక్త అబూ హురైరా (ర.అ) గారు ఇలా ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు: "అతను నాశనమగుగాక, అతను నాశనమగుగాక, అతను నాశనమగుగాక." అప్పుడు అడిగారు: "ఓ రసూలల్లాహ్! ఎవరు (నాశనమవుతారు)?"
ఆయన ఇలా బదులిచ్చారు: "ఎవరైతే తన తల్లిదండ్రులిద్దరినీ లేదా వారిలో ఒకరిని వృద్ధాప్యంలో చూసి, వారికి సేవ చేసి స్వర్గంలో ప్రవేశించలేకపోతాడో
(అతను నాశనమవుతాడు)". (సహీహ్ బుఖారీ)
దాని గురించిన హదీసు ఇలా ఉంది:
عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم: " رَغِمَ أَنْفُهُ ثُمَّ رَغِمَ أَنْفُهُ ثُمَّ رَغِمَ أَنْفُهُ " . قِيلَ مَنْ يَا رَسُولَ اللَّهِ قَالَ " مَنْ أَدْرَكَ وَالِدَيْهِ عِنْدَ الْكِبَرِ أَحَدَهُمَا أَوْ كِلَيْهِمَا ثُمَّ لَمْ يَدْخُلِ الْجَنَّةَ "(صحيح البخاري).)
దీని అర్థం ఏమిటంటే, ఎవరైనా తమ తల్లిదండ్రులని వృద్ధాప్యంలో పొంది, సేవ చేసి కూడా వాడికి స్వర్గం దక్కలేదంటే, దాని అర్థం కేవలం వాడు అయిష్టంతో వారికి సేవ చేసి, దాని వలన వారి తల్లిదండ్రులు రాజీ అవ్వలేకపోవడం మాత్రమే. తద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తల్లిదండ్రుల సేవ అనేది స్వర్గంలో ప్రవేశించేందుకు ఒక దారి అని వెల్లడి చేశారు (సహీహ్ ముస్లిం).
ప్రియమైన సహోదరులారా, ఇక దేనికి ఆలస్యం, మానవుడు అనగా, వాడితో జరిగే తప్పులు జరగడం సహజం. అలాగని ఎల్లప్పుడూ తప్పులు చేస్తూ ఉండడం బుద్ధిహీనం. కనుక చేసిన తప్పులను ‘తౌబా’ ద్వారా తొలగొట్టి ఒక కొత్త జీవితాన్ని నేటి నుండి సృష్టించుకుందాం.
ఇన్షా అల్లాహ్….


