ఇస్లాంలో పిల్లల హక్కులు మరియు వారిపై ప్రియ ప్రవక్త ﷺ గారి సానుభూతి
దైవ ప్రవక్త (స) గారు పిల్లల పట్ల ప్రత్యేక ప్రేమ మరియు ఎంతో సానుభూతిని కలిగి ఉండేవారు. వారిపట్ల ఎల్లప్పుడూ మృదువైన హృదయం కలిగి మరియు వారి బాధను తమ బాధగా తీసుకుంటూ ఉండేవారు. వారు పిల్లల్ని ఎప్పుడూ ఉత్తేజపరుస్తూ, వారి అవసరాలను గమనిస్తూ, తీరుస్తుండేవారూనూ. ఆ పిల్లలు వారి మనుమలైనా కానీ ఎవరైనా కానీ. అందరితోనూ ప్రేమ మరియు సానుభూతిని కలిగి ఉండేవారు.
ఈ మధ్య పిల్లల గురించి ఒక సైకాలజీ డాక్టర్ అయిన ‘డాక్టర్. వలిం గలాసర్’ ఎన్నో విషయాలపై జాగ్రత్త వహించాలంటూ, మన ముందు ఉంచారు. అవన్నీ గత 1400 సంవత్సరాల క్రితమే, ప్రవక్త (స) గారిచే మనకు బోధించబడ్డాయి. అవన్నీ ఒక దృక్కోణమై, పిల్లల దైనందిన జీవితానికి సంబంధించి ఉన్నాయి. ఇదంతా దేనికోసం! కేవలం ఈ లోకంలో ఒకరి పట్ల మరొకరు ప్రేమ కలిగి ఉండాలని. ఇంకా ఆప్యాయత, అనురాగం వంటి విషయాల అవసరం ఈ సమాజానికి ఉంది కాబట్టి! ప్రతి మానవునికి అటువంటి ప్రేమ అన్ని విషయాల్లోనూ ప్రతి ఒక్కరి పట్ల ఉండి తీరాలి.
అది ఒకరి పిల్లల పెంపకం లోనైనా, వారి పోషణలోనైనా, వారి ఆటపాటల్లోనైనా లేదా ఇతర వారి నిత్య అవసరాల్లోనైనా, ఇలా అన్నిట్లోనూ పిల్లల పట్ల అనురాగాన్ని, ఆప్యాయతని పాలుపంచుకోవడమే కాక, దీన్ని ఆచరించాలనే ఆదేశాన్నీ ప్రియ ప్రవక్త (స) గారు ఈ యావత్ ప్రపంచానికి బోధించారు. ఇలా ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం గారు ప్రేమను పంచడమే కాక, దానితో పాటే, ప్రతి ఒక్క మానవున్ని సమానంగా పరిగణించారు మరియు వారికి తగిన న్యాయం చేశారు.
ఇంకా పిల్లల పట్ల ప్రియ ప్రవక్త (స) గారి ప్రేమను గురించి తెలుసుకోవాలంటే, ఈ హదీస్ ని తప్పక చదివి తీరాల్సిందే.
ప్రవక్త అనస్ (ర) గారు ఇలా ఉల్లేఖించారు: నేను ప్రవక్త సలహాలు సలాం గారి కన్నా ఎక్కువగా పిల్లల పట్ల ప్రేమానురాగాన్ని పంచే ఏ ఒక్కరిని అస్సలు ఎప్పుడూ చూడలేదు. (సహీహ్ ముస్లిం)
ఇక దీని ద్వారా మనం ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి సల్లం గారు ఎంత గొప్పవారో, వారి ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రవక్త అనస్ బిన్ మాలిక్ (ర) గారు దాదాపు పది సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కి సేవలు అందిస్తూ వారి వద్దే గడిపారు.
ఇంకా చెప్పాలంటే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు చంటి పిల్లల్ని తమ ఒడిలో ఎత్తుకొని ముద్దాడేవారు. ఒకసారి తమ మనుమాలైన ప్రవక్త హసన్ (ర) గారిని ఎత్తుకొని చుంబించారు. దీనితో అక్కడే ఉన్న ప్రవక్త అఖ్రా బిన్ హాబీస్ (ర)గారు ఇలా అంటారు: ఓ రసూలల్లాహ్! నాకు పదిమంది పిల్లలు ఉన్నారు! అయినా నేను ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు చుంబించలేద’ని అంటారు. దీనితో ప్రవక్త (స)గారు ఇలా తెలిపారు: ఇతరుల పట్ల కరుణ చూపని వారు, అసలు ఎప్పుడూ కరుణించబడరు. (సహీహ్ ముస్లిం: 4406)
దీని గురించి సహీహ్ ముస్లిం లో వచ్చిన హదీసు ఇలా ఉంది.
قَبَّلَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ الحَسَنَ بْنَ عَلِيٍّ، وَعِنْدَهُ الأَقْرَعُ بْنُ حَابِسٍ التَّمِيمِيُّ جَالِسٌ، فَقَالَ الأَقْرَعُ: إِنَّ لِي عَشَرَةً مِنَ الْوَلَدِ، مَا قَبَّلْتُ مِنْهُمْ أَحَدًا. فَنَظَرَ إِلَيْهِ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، ثُمَّ قَالَ: "مَنْ لَا يَرْحَمْ لَا يُرْحَمْ[صحيح مسلم: الحديث رقم 4406].
ప్రియమైన సహోదరులారా, ఇక పిల్లలపై కరుణ చూపడం అంటే ఏమిటో అర్థమైందని అనుకుంటాను. అల్లాహ్ తఆల మనల్ని జీవితం మొత్తం వారి, మరియు వారి ప్రవక్త ఆదేశాలపై తూ.చ. చెప్పకుండా పాటించే భాగ్యాన్ని ప్రసాదించు గాక! ఆమీన్!”


