పవిత్ర ఖురాన్ వెలుగులో ప్రియ ప్రవక్త ﷺ  గారు మరియు వారి ధర్మం.

దైవ ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం గారు ఈ ప్రపంచంలో అడుగు పెట్టేటప్పటి పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవని మునపటి పరిచయ వ్యాసంలో  తెలియజేయబడ్డాయి. ప్రపంచంలో ఎటు చూసినా, హింస వాదుల హింసలు! ఆ హింసలను మట్టిలో కలిపి, తొక్కి పారేసి, ధర్మాన్ని నిలబెట్టే అవసరం చాలా ఉండేది. అటువంటి పెద్ద పెద్ద కారణాల వల్లనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఈ లోకంలోకి పంపడం జరిగింది.  అంతేకాక ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నీతీ, నిజాయితీ గల ధర్మంలో ఆయన్ని మించిన వారు ఎవరూ లేరు! రాబోరు కూడాను! ఆ ధర్మం గురించి పవిత్ర ఖురాన్ లోని ‘సురహ్ నిసా యొక్క 58వ శ్లోకంలో’ అల్లాహ్ తఆలా ఇలా ప్రస్తావించారు:

   "إِنَّ ٱللَّهَ یَأۡمُرُكُمۡ أَن تُؤَدُّوا۟ ٱلۡأَمَـٰنَـٰتِ إِلَىٰۤ أَهۡلِهَا وَإِذَا حَكَمۡتُم بَیۡنَ ٱلنَّاسِ أَن تَحۡكُمُوا۟ بِٱلۡعَدۡلِۚ إِنَّ ٱللَّهَ نِعِمَّا یَعِظُكُم بِهِۦۤۗ إِنَّ ٱللَّهَ كَانَ سَمِیعَۢا بَصِیرࣰا"

(سورة النساء:٥٨)

   “ పూచీ (అమానాత్‌ )లను తప్పక వాటికి అర్హులైనవారికి అప్పగించండనీ మరియు ప్రజలమధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా తీర్పుచేయండనీ, అల్లాహ్‌ మిమ్మల్ని ఆజ్ఞా పిస్తున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ ఎంత ఉత్తమ మైన హితబోధ చేస్తున్నాడు! నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.” (సూరహ్ నిసాఅ్:58)

అంతేకాక అల్లాహ్ తఆలా ఇలా కూడా ఆజ్ఞాపించారు:

        ”ఓ విశ్వాసులారా! ధర్మాన్ని నిజాయితీగా నిలబెట్టే వారవ్వండి! మరియు మీరు అల్లాహ్ కొరకు తప్పక నిజమైన సాక్ష్యం చెప్పండి! ఆ సాక్షం ఆఖరికి మీ తల్లిదండ్రులు లేదా మీ  బంధువులకు ఎవరికి వ్యతిరేకమైన సరే! ఒకవేళ నేరస్తుడు, ధనవంతుడైన లేదా పేదవాడైనా ఎవరైనా సరే! కనుక మీ కోరిక లేదా ఆశల కొరకై ధర్మాన్ని మాత్రం బలి చేయకండి! ఒకవేళ విషయాన్ని తిప్పి తిప్పి మీ అతి తెలివితేటలని ప్రదర్శిస్తే గనక, తస్మాత్ జాగ్రత్త! అల్లాహ్ మీ ప్రతి పనిని గమనిస్తున్నాడన్న విషయాన్ని మాత్రం మరచిపోవద్దు!”.

         ఇంకా సురహ్ మాయిదా ఐదవ శ్లోకంలో మరోచోట అల్లాహ్ తఆలా ఇలా ప్రస్తావించారు:” ఈ నాడు మీ కొరకు పరిశుధ్ధమైన వస్తువు లన్నీ ధర్మసమ్మతం ('హలాల్‌) చేయబడ్డాయి. మరియు గ్రంథప్రజల ఆహారం 12 మీకు ధర్మ సమ్మతమైనది. మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథప్రజల స్త్రీలు గానీ, 13 మీరు వారికి వారి మహ్ర్ ను (వధుకట్నం) చెల్లించి, న్యాయ బద్ధంగా వారితో వివాహజీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగ చాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి. ఎవడు విశ్వాసమార్గాన్ని తిరస్కరిస్తాడో అతని కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టంపొందేవారిలో చేరుతాడు”.       

  దైవ ప్రవక్త (స)గారు తమ సహచరులు మరియు వారి తరువాత వచ్చే తమ అనుచరులందరి మనసుల్లో న్యాయానికి ఉన్న ప్రాముఖ్యత మరియు దాని విలువ తెలుసుకునేందుకు చాలా ఎక్కువ మొత్తంలో హదీసులు సెలవిచ్చారు. ఆ హదీసులలో నుండి ఒక హదీసు దైవ ప్రవక్త (స) గారి అనుచరులైన ప్రవక్త  అబ్దుల్లాహు గారు ఇలా తెలియజేస్తున్నారు: కరుణామయుడు అల్లాహ్ తన కుడి ఎడుమనున్న ప్రకాశవంతమైన మింబర్లపై, నిజాయితీపరులకు ఆశ్రయాన్ని కల్పిస్తాడు! అంతేకాక, వారందరూ తమ కుటుంబపు మనుషులు మరియు ఇతరుల మధ్యన కూడా న్యాయాన్ని, ఇంకా ధర్మాన్ని కాపాడే వారై ఉంటారు. (సహీహ్  ముస్లిం)

         ఇదే విధంగా మరొక హదీసు కథనం మేరకు ప్రవక్త  అబూ హురైరా(ర) గారి కథనం మేరకు ప్రవక్త  సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు:

قال رسول الله صلى الله عليه وسلم: "سبعة يظلهم الله في ظله يوم لا ظل إلا ظله: أميرٌ عدلٌ، شابٌ نشأ في عبادة الله، رجلٌ قلبهُ معلّقٌ بالمساجد، رجلان تحابا في الله اجتمعا عليه وتفرقا عليه، ورجلٌ ظلّهُ في الحرّاء، رجلٌ ذكر الله خالياً ففاضت عيناه، رجلٌ دعاها داعٍ فأجابته

  మరొక హదీసులో నిజాయితీ గురించి ,అది ఒక స్వర్గస్తుల గుణాలలో ఒక గుణం అని కూడా వచ్చింది. దాని గురించి ప్రవక్త  సల్లలాహు అలైహి వసల్లం గారు ఇలా బోధించారు: స్వర్గంలో మూడు రకాల ప్రజలు కలరు. వారు

  1. ధర్మంపై నిజాయితీగా నడిచే వారు .(ధర్మరాజులు)
  2. అందరి పట్ల దయాగుణం కలిగి, దానధర్మాలు చేసేవారు.మరియు
  3. అందరి కోసం తమ మనస్సు తెరిచి ఉంచుకునేవారు మరియు తమ కష్టా జీవితంలోను పెళ్ళాం పిల్లల్ని కచ్చితంగా పోషించేవారు..”

 

 

2.దైవ ప్రవక్త (స)గారి జీవితంలో నిజాయితీ .

       ప్రియ ప్రవక్త (స)గారి జీవితంలోని సద్గుణాలలో ఒకటైన సద్గుణం నిజాయితీ. అంతేకాక వారు ఏ పనైనా చేసి చూపెట్టేవారు. హుజూర్(స) గారు సత్కార్యాలను చేస్తూనే, ఇతరులకు కూడా వాటి ఆదేశాన్ని ఇచ్చేవారు. అలా ఆదేశం ఇచ్చిన పనులలో, అందరికన్నా శ్రేష్టంగా, పద్ధతిగా చేసేవారిలో అందరికంటే ముందడుగై, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారే నిలిచేవారు. అటువంటి సద్గుణాలలో ఒక గొప్ప సద్గుణం నిజాయితీని కలిగి ఉండడం.

   ఆనాటి సంగతి ఖురైష్ వంశంలో ‘బనూ మఖ్జూమ్’ అన్న కుటుంబం ఒకటి ఉండేది. ఒకనాడు ఆ కుటుంబం నుండి ఒక స్త్రీ ఓ ఇంట్లోదొంగతనం చేస్తుంది. తర్వాత ఆ విషయం ప్రజల మధ్యలోకి ఇట్టే విస్తరిస్తుంది. దీనితో ఖురైషీయులు చాలా పరేషానవుతారు. ఏం చేయాలో వారికెవ్వరికీ ఆ సమయాన ఏం తోచలేదు. దీనితో వారందరూ కలిసి ఓసారి చర్చ చేసి, ప్రవక్త  సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విషయాన్ని చర్చించడానికి సిద్ధపడతారు. అది కూడా ఆ తప్పుడు పని గురించి సిఫారిషు కొరకు. అందుచేత ప్రవక్త  సల్లల్లాహు అలైహి వ సల్లం గారి వద్దకు ఎవరినైనా పంపాలని నిర్ణయించుకుంటారు. వెంటనే వారి చూపు ప్రవక్త  ఉసామా(ర)గారిపై పడుతుంది. ఎందుకంటే వేరే ఎవరికీ వారంతాటి ధైర్యం లేకపోయింది. అంతేకాక ప్రవక్త  సల్లల్లాహు అలైహి వ సల్లం గారికి వారిపై కొద్దిగా అభిమానం కూడా ఉండేది కనుక.

      కానీ ప్రవక్త  ఉసామా (ర)గారు, ఈ విషయంలో  జోక్యం చేసుకోదలచలేదు. అంతమంది ఖురైషీయులు ఒత్తిడి చేయడం వలన, ఆయన గారు కాదనలేక,వెళ్లి, సంగతి వివరించి, బతికే దారేదైనా ఉందేమో చూడండి అనేసరికి ప్రవక్త  సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు:

         “ఏంటి ఉసామా! నీవు నన్ను ఒకరు చేసింది అపకారమని తెలిసి కూడా ,అల్లాహ్ యొక్క హద్దును ఒకరు దాటిన తర్వాత కూడా, వారి కోసం సిఫారిషు చేస్తున్నావా?”

   అలా సెలవిచ్చి, అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దాని తర్వాత ప్రవక్త  (స) గారు ప్రజలందరి ముందు నుంచుని, ప్రసంగం చేస్తారు.అందులో ఇలా తెలియజేశారు:

     “ఓ ప్రజలారా! మీ పూర్వీకులు కూడా దీని ద్వారానే మట్టి కొట్టుకుపోయారు. ఎవరైనా గొప్ప వ్యక్తి దొంగతనం చేస్తే, వాణ్ణి వదిలిపెడుతుండేవారు. ఇంకా ఏ పేదవాడు దొంగతనం చేసినా, అతను హద్దు మీరాడని, అతనిపై శిక్షణు జారీ చేసేవారు.

              నేను అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఒకవేళ ముహమ్మద్ (స)గారి కుమార్తె అయిన ఫాతిమా (ర.అ) గారు కూడా చోరీకి పాల్పడినట్లయితే, నేను ఆమె చేయి తీసేయడానికి సైతం వెనుకాడను.”(సహీహ్  బుఖారి :3475)

      దీని గురించి ఒక హదీసు సహీహ్  బుఖారిలో ఇలా ఉంది:

                حَدَّثَنَا قُتَيْبَةُ بْنُ سَعِيدٍ حَدَّثَنَا لَيْثٌ عَنْ ابْنِ شِهَابٍ عَنْ عُرْوَةَ عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا أَنَّ قُرَيْشًا أَهَمَّهُمْ شَأْنُ الْمَرْأَةِ الْمَخْزُومِيَّةِ الَّتِي سَرَقَتْ فَقَالُوا وَمَنْ يُكَلِّمُ فِيهَا رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالُوا وَمَنْ يَجْتَرِئُ عَلَيْهِ إِلَّا أُسَامَةُ بْنُ زَيْدٍ حِبُّ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَكَلَّمَهُ أُسَامَةُ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَتَشْفَعُ فِي حَدٍّ مِنْ حُدُودِ اللَّهِ ثُمَّ قَامَ فَاخْتَطَبَ ثُمَّ قَالَ إِنَّمَا أَهْلَكَ الَّذِينَ قَبْلَكُمْ أَنَّهُمْ كَانُوا إِذَا سَرَقَ فِيهِمْ الشَّرِيفُ تَرَكُوهُ وَإِذَا سَرَقَ فِيهِمْ الضَّعِيفُ أَقَامُوا عَلَيْهِ الْحَدَّ وَايْمُ اللَّهِ لَوْ أَنَّ فَاطِمَةَ بِنْتَ مُحَمَّدٍ سَرَقَتْ لَقَطَعْتُ يَدَهَا.     ( صحيح البخاري:٣٤٧٥)

         ఇందులో ఉన్న విషయం ఏమిటంటే, ఆ కాలంలో ఆ కుటుంబపు మహిళ అరబ్ వంశాలలోనే గొప్ప పతివ్రతయై పరిగణింపబడేది. అదే వంశంలోని చాలామంది కాబా వద్ద సేవలు చేసుకుంటూ గడిపేవారునూ. వారి వంశపు స్త్రీని ఇలా అందరి ముందూ, శిక్షించడానికి వారి మనస్సు ఒప్పలేదు. అంతేకాక వారి నుండి చాలామంది ఈ తప్పుని కప్పిపుచ్చేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు.

          కానీ, ఆఖరికి ఆ స్త్రీ ఇలా చేసినందువలన అందరి ముందు శిక్షించక తప్పలేదు. ఇలా చేయడం పూర్తి ఖురేష్ వంశానికే సిగ్గుచేటుగా మారింది. దీనితో ఇక్కడ,ఒక గొప్ప పాఠం ప్రతి ఒక్కరూ గమనించదగ్గ విషయం. అది దైవ ప్రవక్త (స) గారు వారందరి ముందు ఈ సంఘటన జరిగిన పక్షంలో, న్యాయం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని నిరూపించారు. ఇది ప్రతి ఒక్క మానవునికి ఒక చక్కని సందేశం. ఒకవేళ ఇలా మాత్రం జరగకపోయి ఉంటే గనుక, మనకూ, మన మునపటి వారికి, ఇక తేడా అంటూ ఏమీ ఉండేది కాదు. వారిలాగే మనము అంతమైపోవాల్సి వచ్చేది. కానీ ప్రియ ప్రవక్త (స)గారు చాలా గుండె ధైర్యం కలవారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాన్ని, న్యాయాన్ని మాత్రం వదిలేవారు కాదు. దీనితో మనం, ఒకవేళ మన మధ్య సత్యం అనేది నిలవ లేకపోతే ఏ ఒక్కరం మిగలమని గుర్తుంచుకోవాలి! ఇంకా, ఇస్లాం ముందు అందరూ సమానమేనని అర్థం చేసుకోవాలి.

       దైవ ప్రవక్త (స) గారు యావత్ ప్రపంచానికి కనికరమై పంపబడ్డారు. అంతేకాక, సమాజంలో గొప్ప వ్యక్తిత్వం కలిగి, నీతీ, నిజాయితీని సత్యాన్ని నిలబెట్టారు. ప్రియ ప్రవక్త (స) గారు కేవలం మానవుల హక్కులు తీర్చిదిద్దడమే కాక, పశు పక్షుల మధ్య కూడా దయాగుణం కలిగి మెలిగారు. మొత్తానికి తమ జీవితం మొత్తంలో సదా గడపా, గడపా, ఊరూ, వాడా ఇలా ప్రతొక్క చోట వారి సందేశం వెలుగులోకి వచ్చిందనడంలో ఎటువంటి సంశయమూ లేదు.

   కనుక, అల్లాహ్ తఆలా, మన జీవితం మొత్తం ప్రియ ప్రవక్త (స)గారి నడవడికను అనుసరించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక! ఆమీన్!

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter